UNIVERSITY OF HYDERABAD
End of Semester Examinations, April, 2011
End of Semester Examinations, April, 2011
School of Humanities, M.A., Telugu
Semester – IV
Course Title: HT: 576 DALIT LITERATURE
Date of Examination: 20 -04-2011
Time: 10.00 A.M. to 1.00 P.M Max. Marks: 60
Time: 10.00 A.M. to 1.00 P.M Max. Marks: 60
I కింది ప్రశ్నలలో ఒకదానికి వ్యాసరూప సమాధానాన్ని రాయండి. (1x15 =15 మార్కులు)
తెలుగులో దళితసాహిత్యం ఆరంభ వికాసాలను వివరించండి.
(లేదా)
దళిత సాహిత్య చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ, మౌలిక భావనలను పేర్కొనండి.
II కింది ప్రశ్నలలో రెండింటికి వ్యాసరూప సమాధానాలు రాయండి. (2x15 = 30 మార్కులు)
1.పాలేరు నాటకంలోని వస్తు, శిల్ప విశేషాల్ని పేర్కొనండి.
2. మునివాహనుడు నాటకాల్లోని వస్తు, శిల్ప వైవిధ్యాన్ని సమీక్షించండి.
3.జగడం నవలలో గల దళిత జీవితాన్ని ఆవిష్కరించండి.
4.పోలయ్య కథలలో గల మత పరిస్థితుల్ని విశ్లేషించండి.
III కింది కవితా ఖండికలోని సౌందర్యాన్ని విశ్లేషించండి (1x15 =15 మార్కులు)
‘‘ ముప్పుఘటించి వీని కులమున్, గలిమిన్ గబళించి దేహమున్
బిప్పియొనర్చునీ భరతవీరుని పాదముకందకుండగాు
జెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలే
దెప్పుడు నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్ ’’ -గుఱ్ఱం జాషువ
(లేదా)
‘‘ఇప్పుడు మా మాట ఆత్మగౌరవం
ఇప్పుడు మా బాట విముక్తి
మా పెట్టుబడికి విశ్రాంతి లేదు
రెండు చేతుల రెండు కాళ్ళ
రెండు రెండు దినాల ఉపవాసాల గంజినీళ్ళ నిర్విరామ శ్రమగీతంతో
మాకు తెలిసిన జీవితమంతా త్రికాలాల్లో
మీ అందరికీ వొంగివొంగి ఉండటం
ఇప్పుడంతా మూడ కాలాలూ
మూడు అవమానాగ్నులే
ముప్పొద్దులా శ్రమలోంచి పుట్టిన చెమట చుక్క
ఆత్మాభిమానం విసిరే విచ్చుకత్తి
మూడు పాయలుగా చీలిన మేనంతా
క్రోధార్ణవమే అయ్యింది
నిజమే మేమెరిగిన జీవితమంతా
శిలావిగ్రహాలుగా మిగలటం
త్యాగమే మా జీవితం
భోగ భోగ భోగం మీ లక్ష్యం ’’ - బన్న ఐలయ్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి