Wednesday, February 16, 2011

సామాజిక విప్లవదార్శినికుడే వీరబ్రహ్మేంద్రస్వామి

Courtesy : 14-2-2011 Surya daily
సాహిత్యంలో తమ అస్తిత్వాన్ని వెతుక్కునే క్రమంలో ప్రమాణాలు మారుతుంటాయి. తమ కులం, మతం, ప్రాంతం వంటివన్నీ ఆ సాహిత్యాన్ని అర్థంచేసుకోవడంలో కొత్తవాదాల్ని తెరపైకి తెస్తాయి. ఈ మధ్య కాలంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యం గురించి చర్చ జరుగుతోంది.వేమనవీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యంగా ప్రచారంలో ఉన్నదంతా నిజంగా వాళ్ళదేనా? లేక ఆ పేరుతో మరెవరైనా రాశారా? అనే అనుమానాలకి రకరకాల కారణాలున్నాయి.దానికి ఆ కవుల్లో వచ్చిన పరిణామం ఒక కారణమైతే, ఆ సాహిత్యం వివిధ పాఠాంతరాల్తో ప్రజల్లో ప్రచారం కావడం మరోకారణంగా విశ్లేషించుకోవచ్చు. వీరి సాహిత్యం ఇప్పుడు లిఖితరూపంలో కనిపిస్తున్నా, అది చాలా కాలం మౌఖిక సంప్రదాయంలోనే వ్యాపించింది. తర్వాత కాలంలో ఆ సాహిత్యాన్ని సేకరించి లిఖితరూపంలోకి తెచ్చారు.
వేమన కంటే  వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యం పూర్తిగా మౌఖికంగానే కొనసాగకపోయినా, వివిధ పాఠాంతరాలతో కనిపిస్తుంది. మఠంలో దొరికిన తాళపత్రప్రతుల్ని సంపాదించి, గ్రంథస్థం చేసేసరికే రకరకాల ప్రచారం జరిగిపోయింది.దీనివల్ల విగ్రహారాధనను వ్యతిరేకించిన వారికే  ప్రజలు విగ్రహాలు, దేవాలయాలు నిర్మించారు. విగ్రహారాధనకీ, చారిత్రక వ్యక్తులకు విగ్రహాలను ఏర్పాటు చేయడానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. చారిత్రక వ్యక్తులకు విగ్రహాలు ఏర్పాటుచేయడం అవసరమే. అలాగే వేమనవీరబ్రహ్మేంద్రస్వామి  విగ్రహాలనూ ఏర్పాటు చేశారనుకోవడానికి వీల్లేదు. వాటికి పూజలు జరుగుతున్నాయి. జయంతులకో, వర్థంతులకో ఆ విగ్రహానికి పూలదండలు వేయడం, వాటికి చేతులు జోడించడం  వల్ల దాన్ని పూజలు చేసినట్లుగా భావించడానికి వీల్లేదు. వీటి మధ్య తేడాల్ని గమనించకపోతే, సామాన్యుల్ని మూఢత్వం వైపు నడిపించడమే అవుతుంది. వేమన,వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యాన్ని కూడా ఇలాగే అర్థం చేసుకోవాలి.
వీరబ్రహ్మేంద్రస్వామి కాలం నాటికి పాలకులు, భూస్వాములు కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళపై చేసే దురాగతాలకు స్పందించి, ఒక నిస్సహాయ స్థితిలో కొన్ని తత్వాల్ని చెప్పారు. తానేది చెప్తున్నారో, దాన్ని ఆచరించి చూపడానికి వీలుగా కుల,మతాలకు అతీతంగా వివిధ వృత్తుల వాళ్ళని దగ్గరకు చేర్చుకున్నారు. లోకపరిశీలన వల్ల వచ్చిన అనుభవంతో తాను చెప్పేవి జరుగుతుండడం వల్లా, నాటి సమాజంలో సంస్కరణల్ని ఆశించేవాళ్ళు, సామాన్యులు సహజంగానే ఆయన బోధనలకు ఆకర్షితులయ్యేవారు. ఆ విధంగా వ్యవస్థీకృత పద్ధతిలో, శాంతియుతంగానే ప్రజల్ని ఆలోచించించేలా చేశారు.ఈ సమాజవ్యవస్థని వెంటనే మార్చేయడం సాధ్యం కాకపోయినా, భవిష్యత్తులో ‘‘వీరభోగవసంతరాయలు’’ వస్తాడని, అప్పుడు అతడు సక్రమ వ్యవస్థను రూపొందిస్తాడనే ఆశను కలిగించారు.నిజానికిది సంప్రదాయంలో ఉంటూనే, సంప్రదాయంపై తిరుగుబాటు చేయడం వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యంలో కనిపించే ఒక వ్యూహం. సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రత్యక్షంగా కనిపించకపోయినా, పరోక్షంగా ఆయన చేసింది అదే. కుల, మత భేదాలు పోవాలంటూ, తన కులాన్ని చెప్పుకోవడం వెనుక, ఆ కుల అస్తిత్వం కోసం జరిగిన సంఘర్షణ కూడా కనిపిస్తుంది. ‘‘ విశ్వదోషగణము విప్రుల పాలాయె’’ నని విప్రులను నిందిస్తూ ఒకచోటిలా వర్ణించారు. 
 ‘‘విశ్వకర్మను నేను విప్రులు మీరయా,
రొప్పియెక్కు వనుట రోతగాదె?
 తక్కువెక్కువలను చక్కజేయు యముండు,
 కాళికాంబ!హంస! కాళికాంబ’’ ( కాళకాంబపద్యరత్నములు, పరిష్కర్త : డావి.వి.ఎల్‌.నరసింహారావు, 2002-190) దీనిలో తనకులాన్నే చెప్పుకున్నారు. ఈ పద్యంలో మూడవ పాదం డాకొండవీటి వేంకటకవి పరిష్కరించిన గ్రంథం (2002-142)లో ‘‘ ఎక్కువతక్కువలకు నెవరయా కర్తలు’’ అని ఉంది. రొప్పి అంటే బాధపెట్టడం. కులం పేరుతో ఒకకులం గొప్పది, మరొక కులం తక్కువని బాధపెట్టడం సరైందికాదనే వాదన దీనిలో కనిపిస్తుంది.
ఈ దేశంలో పుట్టినప్పుడు ఏదొక కులంలో పుట్టక తప్పదు. తాను పుట్టక ముందే తనకోసం ఒక కులం ముద్ర సిద్ధంగా ఉంటుంది. ఇది భారతదేశ వాస్తవికత. బహుశా, కులం వల్ల తాను అనేక అవమానాలకు గురై ఉండటమో, అవమానాలకు గురౌతున్నవాళ్ళనో చూసి, కులవ్యవస్థను చాలా చోట్ల తీవ్రంగానే వీరబ్రహ్మేంద్రస్వామి నిరసించారనుకోవాలి. కింది లేదా నిమ్న కులాలుగా పిలవబడుతున్న వాళ్ళు వేదాల్ని ఒప్పుకుంటూనే, నిజమైన వేదాల్లో కులం లేదని తమకి తామే సమర్థించుకుంటూ సంప్రదాయంలో కలిసిపోవాలనుకుంటారు. కానీ, ఋగ్వేదం, 10వ మండలం, పురుషసూక్తంలో చాతుర్వర్ణవ్యవస్థ ఏర్పడిన క్రమం కులం ఉందని చెప్పకనే చెప్తుంది.అందుకనే కులం వల్ల అవమానాలు పొందేవాళ్ళు, వేదాలు అపౌరుషేయాలనడాన్ని విశ్వసించరు.పైగా వాటిని ప్రశ్నిస్తారు కూడా! వీరబ్రహ్మేంద్రస్వామి కూడా వేదాల్ని నిరసిస్తూ, ‘‘వేదవిద్యలెల్ల బాధాకరమ్ములు’’ (కాళికాంబసప్తశతి, పరిష్కర్త: డా కొండవీటి వేంకటకవి, 2002`56) అని వర్ణించారు. బ్రహ్మ శబ్దాన్ని భిన్నార్థాల్లో వర్ణించడం కనిపిస్తుంది. ఒకచోట
‘‘ వాక్కు బ్రహ్మమను వర్ణింప నేరరో
చూపు నీశు డనుచు చూడలేరొ
కోర్కి విష్ణువౌట కొనసాగ నీయరో
కాళికాంబ! హంస! కాళికాంబ!’ ( కాళికాంబసప్తశతి,పరిష్కర్త: డా కొండవీటి వేంకటకవి,2002112) అని వర్ణించిఆ తర్వాత కూడా ‘‘ తనకు తానె బ్రహ్మ తారకమౌను’’ అని చెప్పారు. వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యం లోమార్మికత ఒక లక్షణమని పరిశోథకుల అభిప్రాయం. మార్మికంగా చెప్పడమనేది ప్రచారలక్షణంగా మరికొంతమంది సమర్థించారు.దీన్ని లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం జులాన్ని చెలాయిస్తున్నప్పుడు గానీ, సత్యాన్ని సత్యంగా అంగీకరించలేని సమయంలో గానీ, తాను చెప్పే సత్యాన్ని సమర్థవంతంగా వాదించి వివరించే వ్యవస్థీకృత స్థితిలేనప్పుడుగానీ, ఒక నిస్సహాయ స్థితిలోకి కూరుకుపోయినప్పుడు గానీ మార్మికత్వం బయటపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే తన భావాల్ని తానే ఖండించుకున్నట్లుంటాయి. అందుకే వేమనవీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యంలో ఇటువంటి స్థితి కనిపిస్తుంది.
కులం వద్దంటూనే, తన కులం గురించి ఉన్నతీకరించుకోవడం వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యంలో  ప్రతిఫలించింది.  
విశ్వంబులో విశ్వనాథావధూతయగు
విశ్వబ్రాహ్మణుడొకడు పుట్టేనుమా
విశ్వంబులో తాను శాశ్వతంబుగ నుండె
విశ్వనాథుండనని పల్కేనుమా’’ ( వివిఎల్‌, గోవిందవాక్యములు, 2002-202)
బ్రాహ్మణుల్ని వ్యతిరేకిస్తూనే, బ్రహ్మ, బ్రాహ్మణ శబ్దాల్ని భిన్నవిధాలుగా ప్రయోగించారు. కోమట్లను, మాల మాదిగల స్థితి గతుల్ని వైరుధ్యాలతో వివరించారు. బ్రాహ్మణుల్ని నిరసిస్తూ కొన్ని పద్యాలు, భావాలు కనిపిస్తున్నాయి.  
 ‘‘ సత్తు చిత్తెఱుంగు సద్బ్రాహ్మణుండైన
బ్రాహ్మణక్రియలను త్రచ్చవలెను
త్రచ్చలేడు గనుక తానెట్లు బాపడౌ?...’’ ( వివిఎల్‌, 2002`192) అని ప్రశ్నిస్తారు. మరోచోట చూడండి. 
 ‘‘బ్రహ్మవేత్తలను వెంటబెట్టుకొని
బహ్మాస్త్రము బూని వచ్చేరుమా
బ్రహ్మలు దేశాలు బుడబుడా మార్చేరు
బ్రాహ్మణకుల ముద్దరించేరుమా’’(గోవిందవాక్యములు, పరిష్కర్త : డావి.వి.ఎల్‌.నరసింహారావు, 2002`227) వీటితో పాటు శూద్రుల గురించి వైరుధ్యభావాలు కనిపిస్తున్నాయి.  
‘‘ బ్రాహ్మలకు పీటలు మాలలకు మంచాలు
మహిని వేసే దినము లచ్చీనిమా’’ అని  ఒకచోట, మరొక చోట 
 ‘‘మాలమాదుగులు భూపాలురగుటచే
నీలవర్ణ నీతులు నీతులై
మేలుకీడు తారతమ్యములేకను
మత్తులై చరియించుచుండేరుమా’ ( వివిఎల్‌, 2002`209) అని ప్రవచించారు. మరోచోట 
 ‘‘అయిదువేల మీది బహుధాన్యలోపల
అన్నిజాతములొక్కట య్యీనిమా
అవనిలోగల బీదధనవంతులొకటగ
అయ్యెయోగము కూడ వచ్చేనిమా’’ (2002-204) అని చెప్పారు. మతం గురించి కూడా వీరబ్రహ్మేంద్రస్వామి ఒకచోట ‘‘మతము మత్తు గూర్చు మార్గమ్ముకారాదు’’ అన్నారు. ఇలా వైరుధ్యభావాలున్నా, ‘‘పంచాణం’’ వారికెక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. కమ్మరి, వడ్రంగి, కంసాలి, కాశపని (శిల్పకారులు) కంచరులను పంచాణం అంటారు. వీరు వృత్తుల్ని నమ్ముకుని జీవిస్తారు. ఈ వంశానికి చెందిన వీరబ్రహ్మేంద్రస్వామి కూడా తన కులం పట్లే పరోక్షంగానైనా గొప్పతనాన్ని ప్రకటించడం కనిపిస్తుంది. ఆ గొప్పతనాన్ని అడ్డుకునే బ్రాహ్మణుల్ని తీవ్రంగానే వ్యతిరేకించారు. కులం,మతం వద్దంటూనే, విశ్వకర్మల భవిష్యత్తును గొప్పగా ఊహించారు.
మతాన్ని నిరసిస్తూనే, అచల వేదాంతాన్ని బోధించారు. గురువుని అధికుడిగా భావిస్తారు. శివుడు, విష్ణువు వేరుకాదనీ, అంతా బ్రహ్మమేననీ బోధిస్తారు. తను తాను తెలుసుకోవడమే బ్రహ్మం. దీన్నే అద్వైతమని అంటున్నా, అచలమతంగా ప్రాచుర్యం పొందింది. అచలమతాన్ని ప్రతిపాదించిన వారు శివరామదీక్షితుడు. షడ్దర్శనాల్లోని యోగశాస్త్రం దీనికి ఆధారమని చెప్తుంటారు. యోగం ప్రధానంగా దేహం, ఆలోచనల సంయోగ, వియోగానికి సంబంధించింది. ధారణ, ధ్యానం, సమాధ్యవస్థల ద్వారా జ్ఞానార్జన కలుగుతుందని బోధిస్తారు. దీన్ని సాధించడానికి కుల, మతాలు అడ్డురావని ఏకాగ్రత కావాలంటారు. దీని ద్వారా కైవల్యం సాధించవచ్చనేది వీరి వాదం. ఈదృష్టితో వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది కులాన్ని గుణసంస్కారంగా భావిస్తుంది. గురువు ద్వారానే ముక్తికాంతను చేరుకోవచ్చని బోధిస్తుంది. ఎరుక, జ్ఞానం, ఆత్మ, జ్యోతి తదితర పదాలను ఎక్కువగా అచలమతంలో కనిపిస్తాయి. ఇదే తత్త్వం వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యంలోను కనిపిస్తుంది. కనుక, సంప్రదాయ సాహిత్యంలో కనిపించే కులాధిక్య సమాజానికంటే భిన్నంగా సాధనకు అవకాశమిచ్చే కులదృష్టి వీరి సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. అందుకనే ఈయన సాహిత్యాన్ని అధ్యయనం చేయడంలో భిన్నత్వం ఉంది. దూదేకుల సిద్దయ్యనో, మాదిగ కక్కయ్యనో దగ్గర చేర్చుకున్నంత మాత్రం చేత కుల, మతాలకు అతీతుడని చెప్పుకోవడానికి వీల్లేదు.కానీ, నాటి సమాజ పరిస్థితుల్లో నిమ్నకులాలుగా, గౌరవప్రదం కాలేకపోతున్న వృత్తుల వారిలో ఒక భవిష్యత్తు ఆశను కల్గించగలిగారు. నాటికి ఆ విధంగా బోధించగలగడమే గొప్ప విప్లవం. విప్లవమంటే మౌలికమైన మార్పు. ఆనాటి బలమైన కులవ్యవస్థను కూల్చలేకపోయినా, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను సూచించేదిశగా తత్వాల్ని చెప్పిన వీరబ్రహ్మేంద్రస్వామి సామాజిక విప్లవదార్శినికుడే అవుతారు!  
-డా.దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగుశాఖ,
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌,
గచ్చిబౌలి, హైదరాబాదు- 500 046, 
                        ఫోను: 99896280496 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

Blog added to save list will comment later,

Madhu Mohan said...

మీ అనాలిసిస్ చాలా బాగుంది. చాలా విషయములు సేకరించారు, కాని ఒక చిన్న మార్పు. స్వామీ వారు ఎపుడు కూడా మతాల్ని కావాలనలేదు. విశ్వ కర్మలు అనగా వారి అర్ధం దేవుని బక్తి నేరిపెవారని. అంతే గాని ఒక కులాన్నో మతాన్నో ఆయన ఎప్పుడు వెనకేసుకు రాలేదు.

kameswararao Velpuri said...

ఈ వ్యాసం ఎంతోబాగుంది. ఎంతో వివరనత్మకంగా వుంది. నాకుతెలిసిన కొన్ని విషాయాలు వ్రాయలనిపిస్తుంది. బ్రహ్మం గారు చెప్పిన విషయాలు మధ్య ఎంథొ వైరుద్యాలు కనబడ్తాయి. అయిన వారు చేసిన కృషి అసమానం. మీ వ్యాసంలో చాల తెలిసినాయి. వారు ఒక చొట ఈవిధంగ అంటారు

నడి వీధి నా ముంధు నాటింతుర కొలిమి
నంది మండలం ముందు నాటింతురా
సంధి తెలియనట్టి బద్దె కుక్కల్ బట్టి
బంధించి బాకుల కుమ్మింతురా ... షివ గోవింద గోవింద ...

దీనిని బట్టి వారు ఎంత విప్లవ కారులో తెలుస్తుంది. ఇది ఒక విప్లవ కవే వ్రాయ గలరు. కమ్యూనిజం వస్తుందని తెలియ చెసారు. ఈ విషయాన్ని మీ వ్యాసంలో తెలియ చెసారు. వారి భార్య గొవిందమ్మ ఒక చోట వనిపెంట విశ్వబ్రాహ్మణలు వల్లకాడుగాను, మునిమడుగు విశ్వబ్రాహ్మణలు ముదనష్టంగాను అని శపిస్తారు.దీనిని బట్టి వారికి విశ్వబ్రాహ్మణలు పట్ల అభిమానం ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. సమసమాజం కోరుకున్నారు. పాతుబడ్డారు. హేతు వాద ధృక్పదంతో అలొచిస్తే కొన్నిటికి సమధానాలు దొరకవు. ఏమయిన వారి కృషి అసమాన్యం.

కామేశ్వరరావు
జిజ్ఞాస తరంగాలు రచయిత
Freelance journalist
www.readerswork.blog.spot.com