"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

24 March, 2010

" మాదిగ కుల జాతి రత్నం"


మాదిగ దండోరా సంక్షేమ సమితి, ఆంధ్రప్రదేశ్ ( రి.నెం.603), నాకు " మాదిగ కుల జాతి రత్నం" బిరుదుని ఇస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా నాజాతి ప్రజలు నన్ను గుర్తించడమంటే, నా జాతి ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని గుర్తించడంగా భావిస్తూ చాలా సంతోషిస్తున్నాను. మాదిగ దండోరా సంక్షేమ సమితి, ఆంధ్రప్రదేశ్ వారికీ, అలాగే దాని అధ్యక్షులు మరియు మాదిగ దండోరా సంక్షేమ సమితి సమాచార లేఖ ప్రధాన సంపాదకుడు బి.జె.ఆర్.మాదిగ గార్కి నా కృతజ్ఞతలు తేలియజేస్తున్నాను.
నిజానికి నేను బిరుదుల కోసం రాయలేదు. బిరుదుల కోసం మాదిగల గురించి మాట్లాడటం లేదు. అయినా మాదిగలు నన్ను వెతికి పట్టుకున్నారు. ఇప్పటికీ ఈ బిరుదు ప్రకటించిన వాళ్ళను నేను వ్యక్తిగతంగా చూడలేదు. అయినా, మాదిగల గురించి నా రచనలు, నా ఉపన్యాసాలు విని ఇది ఇస్తున్నామని చెప్పారు. ఇలా నన్ను గౌరవించడమంటే, మమ్మల్ని మేము గౌరవించుకున్నట్లు భావిస్తున్నామన్నారు. ఈ ఆత్మీయతకు మించిన గౌరవం ఇంకేమి ఉంటుంది. నాకు వాళ్ళ మాటలు విన్నతర్వాత నాకు భారత రత్న వచ్చినంత ఆనందాన్ని కలిగింది. సమాజంలో వందలాది సంవత్సరాలుగా మాదిగలు మానసికంగా, శారీరకంగా అనుభవిస్తున్న వేదన నా జీవితానికి కూడా సంబంధింది. ఆ విధంగా నా జీవితం, నా లాంటి వారి జీవితాల్లో కలిగే మానసిక సంఘర్షణ గుర్తించవలసి ఉందనిపించింది. నేను చదువుకున్న తెలుగు సాహిత్యం నుండే దాన్ని మొదలు పెట్టాను. సాహిత్యంలో మాదిగల జీవిత ప్రతిఫలనాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదేదో సేవ అనీ, బిరుదులు, సత్కారాలు వస్తాయని చేస్తున్న పని కాదు. ఒక వైపు నా ఉద్యోగం చేసుకుంటూ, ఆ ఉద్యోగ బాధ్యతల్లో ఈ ప్రభావాన్ని పడనీయకుండా, నా అదనపు సమయాన్ని కేటాయిస్తూ, రాత్రనకా, పగలనకా మా మాదిగల గురించి అన్వేషిస్తున్నాను. యూనివర్శిటీలో, కాలేజీల్లో, స్కూల్స్ లో బిక్కు బిక్కుమంటూ కనిపించే మాదిగల్ని చూసినప్పుడు నా గుండే తరుక్కుపోతుంది. వేషం, భాష, కులం అన్నీ మాదిగల్ని సమాజంలో కలిసిపోయేలా సహకరించడం లేదు. మాదిగలు కొద్దో గొప్పో చదువుకుని, ఆర్థికంగా పైకి వచ్చిన వెంటనే తమ కులస్థులను మరిచిపోతున్నారు. కొంతమందైతే తమ కులాన్ని అవసరార్థం ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మాదిగలకు కావాల్సింది రాజ్యాధికారం కాదనిపిస్తుంది.
మాదిగలకు ఇప్పుడు కావాల్సింది రాజ్యాధికారం కాదు.
మాదిగలకు ఇప్పుడు కావాల్సింది మనో ధైర్యం.
మాదిగలకిప్పుడు కావాల్సింది సాంస్కృతిక ఆత్మగౌరవం.
మాదిగలకిప్పుడు కావాల్సింది మనుషులుగా చూడబడటం. దానికోసం మాదిగలతో పయనిస్తాను. మాదిగల కోసం జీవిస్తాను. అయినంత మాత్రం చేత ఇతర కులాల్ని ద్వేషించాల్సిన పనిలేదు. ఇతర కులాల్ని కూడా మమ్మల్నీ మనుషులుగా గుర్తించమని చెప్పడానికి చేసే ప్రయత్నమిది. ఆ ప్రయత్నాన్ని గుర్తించినట్లుగా దీన్ని నేను భావిస్తున్నాను. దీని కోసం మాదిగ దండోరా సంక్షేమ సమితి వారి సంపుటి : 1, సంచిక: 3 ( 17-3-2010) లో నాకోసం ఒక బ్యాక్ కవర్ నే కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సంచిక ముఖచిత్రం ఇది.

నాకోసం కేటాయించిన బ్యాక్ కవర్ పూర్తి పేజీ కింద ఇస్తున్నాను.

విచిత్రం ఏమిటంటే నాకు తెలియని ఒకాయన ( వడ్ల కొండ రవి శంకర్ మాదిగ, ఖమ్మం జిల్లా ఎం.డి. ఎస్.ఎస్. సలహాదారు ) నాకు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా పత్రికలో పావు పేజీలో ఫోటోతో సహా ప్రకటన ఇచ్చి తన శుభాకాంక్షలను తెలియజేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను.

13 comments:

KAMAL said...

అభినందనలు.

Anonymous said...

Great. Congratulations.

Katti Mahesh Kumar should also be given such or even higher award for his outstanding work in his blogs. He is a natural genius and evergreen revolutionary thinker with many women, backward and minority followers on net.
Once agian congrats for your great achievement.

Rajendra Devarapalli said...

అభినందనలు దార్ల గారు.కుల.మత,ప్రాంతీయపరమైన గుర్తింపుల పట్ల నా భావాలు వేరేగా ఉన్నప్పటికీ మీరు చేస్తున్న,భవిష్యత్తులో మీ కులం వారికి మీవల్ల ప్రాప్తించనున్న ప్రయోజనాల కొరకు గాను మిమ్మల్ని ఎవరైనా అభినందించవలసిందే.మీ కృషి కొనసాగించండి.

Rakesh said...

congrats!!

YOU HAD BEEN WORKING/WRITING FOR THE DOWN-TRODDEN FOR QUITE SOMETIME & DESERVE THIS AWARD!

durgeswara said...

subhaakaamkshalu

-------durgeswara

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మాదిగలు,మాలలు,యానాదులు ఇలా కాకుండా మానవుల్లాగా ఎదైనా పనికొచ్చే పని చేయండి.అప్పుడు జాతి రత్నం ఇతడు అని అందరం ఒప్పుకొంటాం

కొత్త పాళీ said...

సంతోషం. అభినందనలు.

Anonymous said...

Congratulations for the great achievement , Sir.

Wish you get Madiga kula Noble prize !

vrdarla said...

nannu abhinandina variki, suchanalu chesina variki dhanyavadalu.
nijaaniki, kulam gurtimpukanate manishiga gurtinchaalane andari tapana. danilo bhagame naa krushi kudaa.
thank you once again
darla

Anonymous said...

sir you are great. you have to respect other castes also

జాన్‌హైడ్ కనుమూరి said...

CONGRATULATIONS

Sam Gundimeda said...

Congratulations dear Dr. Darla. You deserve that lofty award: Madiga Ratna - for you have been contributing not just for the greater cause of the Madigas but importantly also for the cause of the minority and oppressed. I salute you for your commitment and honest work.
Best wishes
Sam Gundimeda

S Swaroop Sirapangi said...

Hearty Congratulations Sir.

It's not an easy task to coordinate personnel life, teaching activities, research coordination and above all contribution to subaltern literary studies. You were able to achieve this distinction because of your passion.

I wish you all the best in this regard. And wish to see climbing much more heights in the days to come and act as a bacon light to inspire others.