"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

17 డిసెంబర్, 2008

సొసైటీ అండ్ ఎడ్యుకేషన్‌ వెబ్ సైట్ ప్రారంభం!


సమాచార విప్లవం తెస్తున్న ఫలాలను అందరికీ ఉచితంగా అందించాలనే సామాజిక స్పృహతో ఔత్సాహికులైన ముగ్గురు యువకులు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ని రూపకల్పన చేశారు. శాస్త్ర విఙ్ఞానాన్ని సామాన్యులకు సహితం అందుబాటులోకి తెచ్చినప్పుడే సమాజం సరైన మార్గంలో పయనిస్తుందని ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త ఆచార్య కంచె ఐలయ్య అన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆచార్య కంచె ఐలయ్య, సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ని ప్రారంభించారు. సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నా, అవి శాస్త్రీయ విఙ్ఞానాన్ని పెంపొందించడంలో మరింత సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఉందని ఆయన ఉద్బోధించారు.ముగ్గురు యువకులు సామాజిక సేవాదృక్పథంతో ముందుకొచ్చి, శాస్త్ర సాంకేతిక, సామాజిక, మానవీయ రంగాలలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న ప్రపంచ విఙ్ఞాన్ని వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అందించాలనుకోవడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా// దార్లవెంకటేశ్వరరావు అధ్యక్షతను జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానవక్త గా విచ్చేసిన ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రొఫెసర్ బి.రామ్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాలకు మాత్రమే పరిమితమవుతున్న సాంకేతిక విఙ్ఞానం గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి ఇలాంటి వెబ్ సైట్ ల అవసరం ఎంతైనా ఉందని, వారి దగ్గరకు వెళ్ళి వారి అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈ సభలో ప్రముఖ వైద్యులు డా//బి.నరసింగ రావు, సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా//జి.నాగరాజు, ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా// సి.గోవర్ధన్, వెబ్ సైట్ నిర్వహకులు దర్శి శివరామ ప్రసాద్, వి.రవికుమార్, పి.కిరణ్ కుమార్ , కరీమ్, డా//అద్నాన్, శ్రీనివాస్, శ్రీమతి మంజీర, డా//శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెబ్ సైట్ ప్రారంభించడానికి గల కారణాలను మొదట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన విధానం అందరినీ ఆకట్టుకొంది. www.societyandeducation.org ని సందర్శించి విభిన్న రంగాలకు చెందిన మేధావుల గ్రంథాలు,ఉపన్యాసాలు,చర్చాగోష్టులు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చనీ, అలాగే ఔత్సాహికులైన సామాజిక సేవాదృక్పథం గల మేధావులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు రావాలని నిర్వాహకులు విఙ్ఞప్తి చేశారు.

2 కామెంట్‌లు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

ఆ ముగ్గురికీ అభినందనలు...

తన భావాలే పాఠకుడికి కూడా కలగాలి, ఆ చదివినవాడి మనసు జల్లు అనాలని చూసుకునే కవి తన రచనని కొద్దికొద్దిగా తన చేతిలో ఉన్న కలం అనే ఉలితో చెక్కి తయారు చేస్తాడు. అంతే కానీ ఆ కవిత ఒక్కసారిగా స్వయంభువుగా అవతరించదు. అలా అవతరించేది పిచ్చోడి చేతిలో రాయి అని పెద్దల విశ్వాసం... :)

అలాగే ఈ సొసైటీ అండ్ ఆర్గనిజేషన్ వెబ్సైటు దినదినంగా పెరిగి చక్కని ప్రతిమగా తయారు అవ్వాలి అని కోరుకుంటూ ..

vrdarla చెప్పారు...

వంశీ గార్కి నమస్తే,
మీ శుభాకాంక్షలను సొసైటీ అండ్ ఎడ్యుకేషన్‌ వారికి పంపిస్తాను.
థాంక్యూ.
మీ