(జన సాహితి ప్రధాన కార్యదర్శి దివికుమార్ గారు "జాషువా సాహిత్య దృక్పథం" అనే నా ప్రసంగ వ్యాసం చదివి నాకు మెయిల్ ఇచ్చారు. తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆ అభిప్రాయాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను. -దార్ల )
జాషువా సాహిత్య దృక్పథం చదివాను. .బాగుంది. కొంత చర్చించు కొవాల్సింది కూడా వుంది. ఆయన నిజమైన కుల నిర్మూలన వాది. దాన్ని కేవలం ఆశించడమే కాదు నమ్మాడు కూడా! ఒక రకంగా ఆ నమ్మకాన్ని ఆనాటి చారిత్రక పరిస్థితులి చ్చాయి. ఉద్యమాలిచ్చాయి.దాని వెనుక ప్రపంచ వ్యాప్త పీడిత ప్రజా పోరాటాలున్నాయి. స్టాలిన్ నాయకత్వాన సోవియెట్ యూనియన్ వుంది. స్వాతంత్ర్య పోరాటాలున్నాయి. ఈనాడు ఆ విశ్వాసాలు లేవు. అందుకే కుల నిర్మూలన కంటే కుల assertionది పై చేయి అవుతుంది. ఇది వాస్తవంతో సర్దుకొవటం. రాజీ పడటం. యధాతథస్థితిలో position ను వెతుక్కొవటం. ఈనాటి పోరాటమంటూ జరిగే దానికి better compromise కొసమే గాని వ్యవస్థను, దాని నిచ్చెన మెట్లను అంతంగావించటం పైన కేంద్రీకరణ లేదు. అట్టడుగు వర్గాలకు కావలసినది వ్యవస్థ మార్పు. పై శ్రేణికి కావలసింది better placement. దీనిని స్పష్టం చెయ్యడం నేటి అవసరమని నా అభిప్రాయం.
-దివికుమార్
11 అక్టోబరు 2008.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి