సాంబయ్య, గుండిమెడ ప్రస్తుతం లండన్ లో పరిశోధన చేస్తున్నారు. ఆయన ఆంధ్ర ప్ర దేశ్ నుండి వెళ్ళి అక్కడ పరిశోధనలో తలమునకలై ఉన్నారు. అయినా ఆంధ్ర ప్ర దేశ్ లో జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్ల పట్ల తన అభిప్రాయాలను ప్రకటిస్తూ ఒక చక్కని గ్రంధాన్ని ప్రచురించారు. దాన్ని నా బ్లాగులో ప్రచురించమని పంపించారు.
ఈ సందర్భంగా నే మరో విషయం చెప్పాలి.
నాబ్లాగులో రాసిన కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో తీసుకూంటున్నారు. కళింగాంధ్ర గురించి నేను రాసిన వ్యాసం ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. నేను తిరుపతి లో డా..అంబేధ్కర్ పై సెమినార్ జరుగుతుందని ప్రకటించినదాన్ని చూసి గ్లాస్కో యూనివర్సిటీ ప్రొఫెస్ ర్ ఆ సెమినార్ కి సంబంధించిన మరిన్ని విషయాలను నా నుండి తెలుసుకొని, ఆ సెమినార్ లో హాజరై కీ నోట్ ప్రసంగం చేసారు. ఇలా బ్లాగు చాలామందికి ఎంతగానో ప్రయోజనకారి కావటం చాలా సంతోషంగా ఉంది. ఇతర యూనివర్సిటీలనుండి కూడా కవితలు పంపించిన వారున్నారు. కనుక నాది వ్యక్తి గతమైన బ్లాగే అయినా, నాభావజాలానికి సరిపడే ఇతరుల రచనలు కూడా నాబ్లాగులో ప్రచురిస్తానని దీనిలో భాగమే సాంబయ్య, గుండిమెడ గారి పుస్తకాన్ని అందించటం. ఇదిగో ambedkar book ఇక్కడ దీన్ని చదవండి.
5 కామెంట్‌లు:
very nice initiative and congratulations
-thelugodu
అవునూ, మాదిగల మీద పరిశోధన మాదిగల్లో వుండి చేయాలి గానీ లండను నుండీ ఎందుకండీ?
--ప్రసాద్
http://blog.charasala.com
దార్ల గారూ,
"లండన్ లో వుండీ.." అని వుండేసరికి నాకు టైటిల్ ఎత్తిపొడుపులా వినిపించిందడి. మీరు "మాదిగలపై పరిశోధన" అని చెప్పివుంటే సరిపోయేది. లండన్‌లో వుండటం అధికమైన అర్హత అన్నట్టుగా ద్వనించింది.
అయితే ఇప్పుడు పుస్తకం చదువుతుంటే అర్థం అయ్యింది అతనూ దళితుడే అని.
--ప్రసాద్
http://blog.charasala.com
బ్రాహ్మణీయ కులాలు బ్రాహ్మణత్వం అని బ్రాహ్మణుల్ని విలన్లని చేసి మాట్లాడుతున్నారేంటి ఆ పరిశోధనలో ? దళితులు ఎంత పేదవర్గమో వేలాది సంవత్సరాల నుంచి బ్రాహ్మణులు కూడా అంతే పేదవర్గం. చదువులేని బ్రాహ్మణుడికి ఏ రెడ్డీ ఏ రాజూ అన్నం పెట్టలేదు. రాజరికాల్లో కూడా బ్రాహ్మణులకి కులప్రాతిపదికమీద ఆటోమాటిక్ రిజర్వేషన్లు ఏమీ కల్పించబడలేదు. బౌద్ధంలోకి క్రైస్తవ్యంలోకి మారినవాళ్ళకి హిందువుల్ని హిందూత్వాన్ని బ్రాహ్మణుల్ని విమర్శించే అర్హత ఉందా ?
తాడేపల్లి గారూ,
భలే సెలవిచ్చారండీ! ఒకడు చచ్చినా, ఒకడు పుట్టినా బ్రాహ్మణుడికే కదా దానాలు చేయాల్సింది? వాడు చదువుకున్నోడా కాదా అని ఎక్కడా లేదే? బ్రాహ్మణ హత్యను బహ్మ హత్య అన్నారు కానీ చండాలుడి హత్యను అనలేదే?
బిచ్చక వృత్తిని బ్రాహ్మణులకు పవిత్రమైందిగా ఇతరులకు నీచమైందిగా కలిపించలేదూ? కనీసం ఒక బ్రాహ్మడికైనా ఆథిద్యమిచ్చిగానీ భోంచేయొద్దన్నారు గానీ దళితుడు కనపడితే మొహం చాటు చేసుకోలేదూ? ఈ సామాజిక గౌరవాలన్నీ చదువుకున్న బాపనికే లభించాయా?
మన వేల ఏళ్ళ చరిత్రలో జ్ఞానబోధను తలెత్తుకున్న బ్రాహ్మలే అసలు విలన్లు అనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. క్షత్రియుల పంచను చేరి ఆచారాలు, చట్టాలు, కర్మలూ, అగ్రహారాల దానాలు అన్నింటా తమకు ఆధిక్యం లభించేలా చేసుకొన్న విరు పేదలెలా అయ్యారు?
--ప్రసాద్
http://blog.charasala.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి