నిజమే కొన్ని చెప్పాలనీ చెప్పలేక పోతుంటాం.
బ్లాగు రాసిన ప్రతిసారీ లేఖిని గురించి ఏదో చెప్పాలని గుండెగొంతుకలో కొట్టుకుంటుంది.
బ్లాగు రాయటం అయిపోతుంది.
మళ్ళీ మామూలే!
" లేఖిని "ఎంతబాగుందాపేరు.
ఎంత ఆలోచనాత్మకంగా ఉందా పేరు.
ఎ,బి,సి,డి లు వచ్చినవాళ్ళు కూడా బ్లాగు రాయగలిగేటట్లు సమకూర్చారుకదా.
డియర్ లేఖిని...
ఒకవేళ నువ్వుకూడా అమాంతంగా డబ్బు మనిషివి గాని అయిపోతే ...?
ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటున్న అమాయక పసిపాపలేమైపోవాలి?
లేఖినీ!
నువ్వు కొన్ని మార్పులతో సింగారించుకోగలవా...
ఇంకా అందంగా ఉంటావు సుమా...
type writter 2, / apple key లో అడుగులు వేయగలవా?
పోనీ నీతో ఇంగ్లీషులో రహస్యంగా చెప్పినవన్నీ ,తెలుగులో ప్రత్యక్షంగా చెప్పగలవా?
ఇంకా... సరే మరో సారి కలుద్దాం!
3 కామెంట్‌లు:
type writter 2, / apple key అంటే ఏంటి?
లేఖిని గురించి రాసినందుకు ధన్యవాదాలు. లేఖిని ఎప్పటికీ ఉచితంగానే లభిస్తుంది. మీకెలాంటి భయాలూ అవసరంలేదు.
type writter 2, / apple key లు ఏంటో నాకూ తెలియవు. కాస్త వివరిస్తారా?
స్పందించినందుకు ధన్యవాదాలు. ILeap /Anu key boardలలో చూస్తే తెలుస్తుంది.అది ఇంతకు ముందునుండీ టైప్ చేసే వాళ్ళకు చాలా సులభంగా ఉంటుంది.దయచేసి ఒకసారి ILeap /Anu key boardలను చూడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి