"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

02 January, 2007

నాకు నచ్చిన ఒక వ్యాసం- రిజర్వేషన్ చర్చ

ఒక మంచి వ్యాసాన్ని ప్రసాద్ గారి బ్లాగులో చదివాను.వారి వ్యాసాం మరింత ప్రాచుర్యంలోకి రావాలని ఆషిస్తూ...ఈ బ్లాగులో పెడుతున్నాను
రిజర్వేషన్ హక్కు - దేశం తుక్కు తుక్కుSeptember 19th, 2006 by charasala
తాడేపల్లి సుబ్రమణ్యం గారూ,అవునండీ రిజర్వేషన్ల మూలంగానే దేశం బ్రష్టుపట్టిపోతోంది. ఈ దేశంలో ముఖ్యమంత్రులూ, ప్రధాన మంత్రులూ, ఇతర మత్రిపదవులన్నీ అగ్రకులాలమని చెప్పుకునే జాతులకి రిజర్వ్ చేయబడ్డాయి. డొనేషన్లు కట్టగలిగి, లంచాలు మేపగలిగిన బడాబాబులకి పెద్ద పెద్ద కళాశాలల్లో సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. డబ్బున్న వాడికీ, పెద్ద కులమున్న వాడికే ప్రభుత్వపు ప్రతి సేవా రిజర్వ్ చేయబడ్డది. అనాది నుంచి ఆర్యమతమంటూ, మనువు సూత్రమంటూ చెప్పులు కుట్టే వృత్తి మాదిగలకీ, చేతి గోళ్ళు తీసే వృత్తి మంగలోళ్ళకీ, అంటు గుడ్డలు వుతికే వృత్తి చాకలోల్లకీ రిజర్వ్ చేయబడ్డాయి. వంట చేయడం, ఇంటిల్లిపాదినీ సుఖపెట్టడం స్త్రీకి రిజర్వ్ చేయబడింది. ఈ విధంగా దేశ జనాభాలో అధిక శాతం మందిని అణగదొక్కి మేము అగ్రకులమని, పండితులమనీ అతికొద్దిమంది ఈ రాజ్యాన్ని పాడుచేసి, చివరికి పిరికి పందల్లా విదేశీయులకు రాజ్యాన్ని గుత్తగా అప్పగించేశారు! అప్పుడేమయ్యింది వీరి అగ్రకుల అధికత్వం? అప్పుడేమయ్యింది వీరి పోరాటపఠుత్వం? ప్రజల్లో 80 శాతం మందిని ఇలా నిర్వీర్యం చేయకుండా వుండివుంటే (కుల రిజర్వేషన్ల పేరుతో), వాళ్ళను బానిస ప్రవృత్తికి అలవాటు చేయకుండా వుండివున్నట్లయితే మన దేశం అన్నినాళ్ళు పరాయి పాలనలో మగ్గాల్సి వుండేదా?
ఒక్క అగ్రకులాలే మనకు ఒక ఆర్యబట్టుని, ఒక రామానుజాన్ని, ఒక ఠాగూర్ని, ఒక గాంధీని అందించగలిగితే ఇక అన్ని కులాలకీ, సమస్త భారత ప్రజలకీ అలాంటి అవకాశాలే వుండివుంటే మరెంత మంది వేద వ్యాసులు, వాల్మీకులు, ఏకలవ్యులు అందివచ్చేవారు. ఈ కుల వృత్తుల రిజర్వేషన్లే లేకుంటే?అవును మీరన్నట్లే ఈ రిజర్వేషన్ల మీద వచ్చిన వారిని ఏమనలేం! ఈ నిమ్న కులాల వాళ్ళు తరతరాలుగా “సుబ్బిగా”, “లచ్చిగా”, “ఏమే” అని పిలిపించుకున్నవాళ్ళు, మనము ఎదురు పడితే కాళ్ళ చెప్పులు, భుజం మీది కండువా చేతిలో పట్టుకొని వినయంగా దారి పక్కన నిలుచుని దారిచ్చిన వాళ్ళు, “అయ్యా”, “స్వామీ”, “రెడ్డీ”, “పటేలూ”, “కాల్మొక్కుత”, “నీ బాంచెను దొరా!” అంటూ మన దయాధర్మాల మీద బతికిన వాళ్ళు, వీళ్ళకెంత పొగరు? “ఓ మాదిగోడా” అని పిలిస్తే నా కులం పేరు పెట్టి దూశించాడు అంటాడా? వాడి తాతముత్తాతలు మా తాత ముత్తాతల దగ్గర్నుండీ అలా పిలిపించుకోలేదా? ఇప్పుడెందుకు రావాలి రోషం? అయినా ఈ జూనియర్ కాలేజీలో అధ్యాపక వృత్తులన్నీ ఈ అలగా జనానికి రిజర్వ్ చేయబడ్డాయని నాకు తెలియదే? ఒక వేళ చేయబడ్డా అందులో ప్రిన్సిపాలో, డిపార్ట్‌మెంటు హెడ్డో అగ్ర కులపోడే అవ్వాలే! అలా కాకుండా ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళనీ, జుట్టు కత్తిరించేవాళ్ళనీ తెచ్చి ఇలా ఉపాద్యాయ వృత్తిలో కూర్చోబెడితే ఏం జరుగుతుంది? కాలేజీలు మూసేయడం మినహా! మరి ముఖ్యమంత్రుల పోస్టులన్నీ ఈ అగ్రజాతులకి రిజర్వ్ చేయబడ్డా రాష్టానికి, దేశానికీ ఏమీ దుర్గతి? అద్యాత్మికత, పూజలూ, దర్మ ప్రచారమూ తరతరాలుగా బ్రాహ్మణ కులానికి రిజర్వ్ చేయబడ్డా ఇంకా ఎందుకీ మతమార్పిడులూ, అధర్మ వ్యాప్తి?అనాదినుండీ క్షత్రియ కులానికే రాజ్యాధికారము అప్పజెప్పినా ఎందుకు మనం చెంఘిజ్ ఖాన్ మొదలుకొని పరాయి రాజుల పాలబడి ధన, మాన, ప్రాణాలను పోగొట్టుకున్నాం? వైశ్యులే వ్యాపార దక్షులైతే మరెందుకు మనం నిన్నా మొన్నటి వరకు కనీసం న్యూయార్క్ ఎక్సేంజ్ లో నమోదుకాలేక పోయాం? అన్నిటికీ కిఆరణం మన దేశ దుర్గతికి కారణం రిజర్వేషన్ళే! వీసమెత్తు అనుమానం లేదు.మాదిగైనా, మాలైనా అర్చక వృత్తిని నిర్వహించనీయండి.బ్రామ్హణుడైనా, క్షత్రియుడైనా చెప్పులు కుట్టనీవండి.ఏ వృత్తి ఎవరైనా వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి చేయనీవండి.అన్ని వృత్తి నైపుణ్యాలనూ అందరికి అందించే విధంగా సమానావకాశాలను కల్పించండి.
ఆమెవరో ఫీజు కట్టలేక డాక్టరు కోర్సు చేయటానికి అర్హత వున్నా చేరలేక పోయిందట!వాడెవడో ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయినా డబ్బు పెట్టి సీటు కొని MBBS చేస్తున్నాడట!అందరి ముందూ అందమైన అమ్మాయిని బీరుపోయలేదని కాల్చి చంపి, డబ్బూ, అధికారం ముసుగేసుకొని చట్టాన్ని తనింటి కాపలాకుక్కలా చూస్తున్నాడట!తన తాత, తండ్రీ పదవుల్లో వున్నారు గనుక ఆ మంత్రి పదవి తనకే రిజర్వ్ చేయాలంటున్నాడట!
తక్కువ జాతి వాళ్ళు చిన్న చిన్న నేరాలు చేస్తే, పెద్ద జాతి వాళ్ళు పెద్ద నేరాలు చేస్తున్నారు! తక్కువ జాతి వాళ్ళు జేబు కొట్టేస్తే, పెద్ద జాతి వాళ్ళు దేశ ఖజానానే కొట్టేస్తున్నారు.తక్కువ జాతివాళ్ళు తప్పు చేస్తే శిక్షించడానికి ముందుండే చట్టం, అధికారం, డబ్బూ వున్న వాళ్ళ పెరట్లోకి కూడా వెళ్ళలేక పోతోంది.
ఇన్ని రకాల రిజర్వేషన్లు మన సమాజాన్ని వేల ఏళ్ళ తరబడి పీల్చి పిప్పిచేస్తున్నా ఎందుకండి ఇప్పుడు మాత్రమే రిజర్వేషన్లు తప్పంటూ వీధుల కెక్కుతున్నారు? అగ్రకులపు చేద బావి నీరు పెద్ద కులపోళ్ళకే ఎందుకు రిజర్వ్ అయ్యింది? నిమ్న్ కులాల వాళ్ళు దాని దరిదాపులకైనా ఎందుకు రాలేకున్నారని మీరెప్పుడైనా ప్రశ్నించారా? వీధుల కెక్కి ధర్నాలు చేశారా?పల్లకీ మోసేవాళ్ళెపుడూ బడుగు జీవులే ఎందుకవ్వాలి, మనం ఎందుక్కాకూడదని ఎప్పుడైనా గొంతు చించుకొని అరిచారా?వూరి చివర వున్న టీ కొట్టు చూరులో పెట్టిన సత్తు గిన్నె మాదిగ వాళ్ళకే ఎందుకు రిజర్వ్ అయ్యిందని ఎన్నడైనా రాగాలు తీశారా?వూరుమ్మడి ఆస్తిగా జోగినీ అవతారాలు మాదిగ బిడ్డలకే ఎందుకు రిజర్వ్ అయ్యాయని కాసింత విచారించారా?రాత్రయితే మాలామాదిగ పూరిగుడిసేలో దూరే వాడు కూడా, మాలామాదిగకు చెంబెత్తి నీళ్ళేందుకు పోస్తాడని మీరెప్పుడయినా నిలదీశారా?పిల్లీ, కుక్కా తిరిగే ఇంటిలోకి కూడా మాదిగెందుకు వెళ్ళడని మీకనిపించలేదా?గర్బగుడి పూజారికే ఎందుకు రిజర్వ్ అయ్యిందని మీకెప్పుడు ఆందోళన చెయ్యాలనిపించలేదా?
ఆ పదివేల మందిలో 60 శాతం రిజర్వేషదారులుంటారని లెక్క తేల్చారే, రెకమండేషన్ల మీద, డబ్బులు పెట్టి, కులం పేరు చెప్పి ఉద్యోగం కాజెయ్యాలనే ప్రబుద్దుల్లో ఎంత శాతం మంది వుంటారు రిజర్వేషదారులు? వుద్యోగం రాకుంటే ఇక బతకలేని వాడు, లక్షలు వెచ్చించి అమెరికా పోలేని వాడు, ఇన్‌ఫ్లుయెన్సు చేయగలిగన ఒక్క బందువైనా అధికార హోదాలో లేని వాడూ ఇంకేం చేయగలడు? తనకు దొరికిన దొడ్డిదారి చూచుకోక? వీళ్ళనయితే పట్టుకోవచ్చు మరి తమకున్న పలుకుబడి, డబ్బు, అధికార బలంతో వెయ్యికి పైగా పెట్రోలు బంకులని బందువులకీ, అయిన వాళ్ళకీ దారాదత్తం చేసిన వాళ్ళకి శిక్ష ఏదీ?
కాలిన కడుపుతో నేరం చేసిన వాడి కంటే నిండిన కడుపుతో నేరం చేసిన వాడూ ఎక్కువ నేరస్తుడు కాదా?
“బ్రిటీషువారి కాలం దాకా అద్భుతంగా పనిచేసిన సర్కారీ విద్యాసంస్థలు తర్వాతి కాలంలో ఇలా నీచాతినీచంగా భ్రష్టుపట్టిపోవడానికి వేరే కారణం ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా బోధపడదు- రిజర్వేషన్లు తప్ప. రిజర్వేషను సదరు వర్గాలకి రాజ్యాంగ ప్రసాదితమైన హక్కుట. నిజానికి అవి ఆనాటి రాజ్యాంగ సభా సభ్యులైన అగ్రకులాలవారి దయాధర్మభిక్షం.”రిజర్వేషన్లు తప్ప మీకెంతకూ ఇంకో కారణం కనపడకపోవడం ఆశ్చర్యం. లంచగొండితనం, అవినీతి, బందు ప్రీతి, దురాశ కాదా? ప్రభుత్వానికి డబ్బు కట్టకుండా గనులు తవ్వుకుంటున్నది ఎవరు రిజర్వేషదారులా? పెన్నా నదిలో ఇసుకను తలిస్తున్నది ఎవరు రిజర్వేషదారులా? ఈ వేసవిలో వేసిన రోడ్లు వచ్చే వర్షాకాలానికి పాడయ్యేది ఎవరివల్ల, రిజర్వేషదారుల వల్లనా? కారంచేడు ఊచకోత రిజర్వేషదారుల వల్లనేనా?రాంజ్యాంగ సభలోని కొద్దిమంది అగ్రకులాల ధర్మ బిక్షకాదు రిజర్వేషన్లు. అప్పటికే అంబేద్కర్ నాయకత్వాన జరిగిన దళితోద్యమ ఫలాలవి. ఒకవేళ రాజ్యాంగమే వాటిని ఇవ్వకపోయి వుంటే, తరతరాలుగా వేదాల పేరు చెప్పో, మనుస్మృతి పేరు చెప్పో ఇంకా అణగదొక్కి వుంచాలనుకొంటే అది ఇప్పటి ఇన్‌ఫర్‌మేషన్ యుగంలో సాధ్యం కాదు. నిమ్న జాతులొక్కటై అగ్రకులాల అహంకారానికి ఎసరు పెట్టి మరీ తమ హక్కుల్ని సాధించుకొనే వారు. అణగ దొక్కే కొద్దీ పడి వుండి పురాణాలని, అగ్రకులాల వేదాంతాన్ని నమ్మటానికి ఇది ఇంకా వేద కాలం కాదు సుబ్రమణ్యం గారూ!–ప్రసాద్

No comments: