నేను 2004లో దళితతాత్త్వికుడు పేరుతో ఒక కవితాసంపుటి ప్రచురించాను.దాన్ని వివిధ పత్రికలు సమీక్షించాయి.వీటిలోని కవితలు ఇప్పటికే కొంతమంది తమ తమ పరిశోధనల్లో వాడుకున్నారు. ముఖ్యంగా హాస్టల్లో అమ్మ, మావూరునవ్వింది వంటి కవితలు పరిశోధకులు తీసుకున్నారు. మంచి విశ్లేషణలు జరిగాయి. మరికొన్ని యూనివర్సిటిలలో పరిశోధనలకు తీసుకున్నారు. కవితల పట్ల, టైటిల్ పట్లా చాలామంది స్పందించారు. దీన్ని బ్లాగులో కూడా పెట్టాలనే అభిప్రాయంతో కవితలన్నింటినీ పెట్టాను. వాటిని చదివి చాలామంది స్పందిస్తూ తమ అభిప్రాయాలను రాస్తున్నందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయలను అనుసరించి పునర్ముద్రణలో అవసరమైనంతమేరకు మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తాను.అవసరమైతే కవితాసంపుటి పేరుకూడ మార్చటానికి కూడా వెనుకాడను...కానీ... దానికి సరైన విశ్లేషణను ఆశిస్తున్నాను.ఇప్పటికే కొంతమంది టైటిల్ విషయంలో స్పందించారు.వాటి గురించి ఆలోచిస్తున్నాను. అంతేకాదు. వీటినిని మళ్ళీ ప్రచురించేటప్పుడు, ప్రచురణకు ముందుకొచ్చే దళిత, దళితసానుభూతిపరులకు గాని ఈ కవితా సంకలనాన్ని అంకితం చేయాలనుకుంటున్నాను.అలాగే మీ చిరునామాలు లేదా మీ ప్రస్తుత వివరాలతో మీ మీ అభిప్రాయాలను చర్చకు పెట్టాలని అనుకుంటున్నాను. కనుక ఇకపై స్పందనలను రాసే వారు ఎలాంటి మొహమాటం లేకుండా విశ్లేషణాత్మకంగా రాస్తే బాగుంటుంది.
మీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి