"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

19 January, 2007

వింటావులే నిశ్శబ్ద విస్పోటనం!




డియర్ సద్దాం!
నీకు తెలుసా వాడిప్పుడు
మృత్యువై వెంటాడుతున్న మృత్యువు వాడు
భయం నటించటం కూడా ఇష్టపడని
జెడ్ కేటగిరీలో నిర్భయ జీవితమతడు
ప్రజాస్వామ్యాన్నీ,సార్వభౌమాధికారాల్నీ,
జీర్ణం చేసుకున్నఅగ్ర రాజ్యాధిపత్యమతడు
వాడిప్పుడే కాదు ఎప్పుడూరాజరికంతోనే స్నేహిస్తూ
ప్రజాస్వామ్యానికి తేనెపూస్తాడు
వాడిప్పుడేకాదుఎప్పుడూ చెప్పిన మాటకు
చేసే మాటకు పొంతనకలవనివ్వడు
వాడెప్పుడూవిత్తనమయ్యో, వృక్షమయ్యో
పేటెంటయ్యో, మనమేథో తీరమ్మీద స్వారీచేస్తుంటాడు
వాడి గురించిఒక్క మాటలో చెప్పేదేముంది
విశ్వనాశన రూపమతడు!
ప్రేమతో కౌగలించుకున్నాప్రతీకారంతో చెలరేగిపోయినా
యుద్ధానంతర ప్రశాంతమతడు.
మననీటినీ, కన్నీటినీ తాగుతాడు
మనగాలినీ,మన ఊపిరినీ శ్వాసిస్తాడు

కాలుకింద భూమి కదులుతోంది
కనికరం పనిచేయదు
మౌనం బద్దలవ్వాల్సిందే
బొందిలో ప్రాణం బొందలో పెట్టకుండా మేల్కోవాల్సిందే
ఇప్పుడు వాడి కలల గుడారాన్నికూల్చాస్సిందే!

మై డియర్ సద్దాం!
అందరూ చావాల్సిందే
చావుకి నిర్భీతితో నిర్వచనమిచ్చావ్
నీలోనూ లోపాలున్నా
యుద్ధం చేయాల్సినవాడితో తలపడ్డందుకేనేమో
నీతో నే నా కరచాలనం!
ప్రపంచాన్ని శ్వాసిస్తున్న
శాసనాన్ని దిక్కరించినందుకే నీకు చేస్తున్నా ఓ సలాం!
నిజానికి ఓడిపోయిందెవరో మాకు తెలుసు
నిజానికి ప్రపంచ ప్రజల గురికి వేలాడిందెవరో మాకు తెలుసు!
కట్టేసి కాల్చేసి
ఎన్ కౌంటర్లంటున్నవాటినెన్నింటిని చూడట్లేదు
ఓటేసేవరకూ హోరెత్తే వాగ్ధానాల్నెన్ని వినట్లేదు
నీ చావు మాకెక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది చెప్పు!
నిన్ను చంపాననుకుంటున్నాడు
వాడు నిత్యం చస్తూనే ఉన్నాడు!
నీ శిలా విగ్రహాలు కూల్చేసినా
మా హృదయాల్లో శాశ్వత చిత్రాల్నెవరూ చెరిపేయలేరులే!
వలువల్ని విలువల్లేకుండా వలిచే
మాటల్నేర్చిన మీడియానీ నమ్మే స్థితిలో లేమిప్పుడు!
పంటకాలం కోసం కొడవళ్ళతోనే సిద్దంగా చూస్తున్న వాళ్ళామే అంతా!

ఇప్పుడొక నిశ్శబ్దంలో ఉన్నా మౌనం మోసపోదు
ఇప్పుడొక నీలితెరని బలవంతంగా కప్పేసుకున్నా
మౌనం ఓడిపోదు
మౌనమిప్పుడు పిడికిళ్ళు బిగించుకుంటోంది
నిశ్శబ్దం విస్పోటించినప్పుడు నువ్వెక్కడున్నావింటావులే
!
- డా.దార్ల వెంకటేశ్వరరావు

5 comments:

spandana said...

ఒక అగ్రరాజ్య దురఃకారాన్ని ఎదిరించే క్రమంలో సద్దాంను మనం కీర్తించొచ్చు. కానీ అతని తప్పులూ ఎన్నో వున్నాయి కానీ అంతకంటే తప్పులు చేసిన చేస్తున అమెరికా అతన్ని శిక్షించడం మాత్రం గర్హనీయం!
--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

మధ్య ప్రాచ్యం లో వున్న ఏకైక లౌకిక రాజ్యం ఇరాక్. దాన్ని కూలదోశారు ఏవేవో కారణాలు చెప్పి. ఇరాక్ చేసిన దౌష్ట్యమల్లా షియాల వూచకోత. ఏ ప్రభుత్వమైనా తనకెదురొస్తే వాళ్ళను చంపడం సహజం. అంతెందుకు చైనా లో తియాన్మెన్ స్కొయర్ చంప బడ్డ వాళ్ళు ఎంత మంది? దాదాపు పది వేల మంది అని ఒక అంచనా. అప్పుడు దాన్ని వేలెత్తి చూపే సాహసం ఎవ్వరూ చెయ్యలేదు. సౌదీ అరబియా లో చట్టబద్దంగా పబ్లిగ్గా తలలు తీసేస్తారు. ఇక రష్యాలో అయితే వాళ్ళు చేసే పని గుట్టు చప్పుడు కాకుండా వుంటుంది. ఇదంతా అనాగరికమని పెద్ద రాజ్యాలకు కనపడ్డం లేదు.


చిల్లర దొంగలే ఎప్పుడూ జేళ్ళలో వుంటారు. పెద్ద గజదొంగలు, బంది పోట్లు విలాసంగా ఏ.సి. రూముల్లో వుంటారు. సద్దాం చిల్ల దొంగయితే పెద్ద సామ్రాజ్యాలు బంది పోట్లు.

Dr.Pen said...

కవిత బాగుంది. 'నిశ్శబ్ద విస్ఫోటనం' కొత్త ప్రయోగం!

చదువరి said...

సద్దాం తప్పులు చేసాడు. కానీ శిక్షించడానికి బుష్షెవడు? సద్దాం చేసిన తప్పు కంటే కొన్ని వేల రెట్ల తప్పు చేసి, అమెరికా అతణ్ణీరోజున హీరోను చేసింది.

అమెరికాను విమర్శించే క్రమంలో సద్దాంను కీర్తించడం సబబు కాదేమో!

Naga said...

http://www.unknownnews.net/saddam.html