ఈ మధ్య బ్లాగు రాస్తుంటే ఓ మిత్రుడు " ఇంటర్నెట్ లో తెలుగు ఎవరు చదువుతారండీ" అని అడిగాడు. అతనివైపు జాలిగా ఓ చూపు చూసేసి, ఓ చిరునవ్వు నవ్వేశాను. కానీ, ఆ ప్రశ్న చాలా ఆలోచించ వలసిందే అనిపించింది. అప్పుడే అనుకున్నాను. ఇంటర్నెట్లో వస్తున్న తెలుగు గురించి ఓ వ్యాసం రాయటం అవసరమని! త్వరలోనే దీనిపై ఓ సమీక్షా వ్యాసం అవసరమేమో...ఏమంటారు?
7 కామెంట్లు:
ఇంటర్నెట్ లో తెలుగు వాడకం పూర్తిగా హర్షదాయకం, అవసరం కూడా. తెలుగు వాడకం వల్ల తెలుగు ప్రచారం పెరుగుతుంది అది మరింతమందికి దగ్గరవుతుంది. వివిధ మాండలీకాలను గురించి తెలుసుకునే అవకాశం సాటి తెలుగువాడికి కలుగుతుంది. మనలోని భావాలను మన మాతృభాషలో వ్యక్తీకరించినంత సూటిగా వేరే భాషల్లో మనం వ్యక్తీకరించలేము. తెలుగువాడు తెలుగును ఎక్కడ చూసినా(అది ఇంటర్నెట్ కావచు, మరొకటి కావచ్చు) మురిసిపోతాడు చిన్న పిల్లవాడు తల్లిని చూసి కేరింతలు కొట్టినట్టుగా.
ఒక మంచి అంశం మీద సమీక్షా వ్యాసం వ్రాయడానికి పూనుకున్న మీకు నా అభినందనలు.
తెలుగుబ్లాగు సాహిత్యానికి సంబంధించకపోయినా, ఇంటర్నెట్లో తెలుగు పెరుగుదల గురించి నా చిన్న వ్యాసం (ఆంగ్లంలో) చూడండి.
Dear Veeven గారు
ఇంగ్లీషులో రాసినా చాలా విలువైన విషయాలను మీ వ్యాసంలో ఉంచారు.అభినందనలు. కానీ నేను రాయబోయేది సమీక్ష.కనుక, బ్లాగుల స్వభావంపై దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నాను.
ఈ విషయం మీద మన చావా కిరణ్ గారు చాలా రోజుల క్రితం వ్రాసిన వ్యాసం ఒకసారి చూడండి http://chavakiran.blogspot.com/2005/05/blog-post_17.html
"ఇంటర్నెట్ లో తెలుగు" అన్న అంశం పై ఒక ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం సమర్పిస్తే ఎలా వుంటుంది సార్!
కామెంట్‌ను పోస్ట్ చేయండి