"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

04 డిసెంబర్, 2006

కందుకూరి రమేష్ బాబు చూపిన 'సామాన్యుడిలో అసామాన్యత





కవి, సీనియెర్ పాత్రికేయుడు కందుకూరి రమేష్ బాబు ఇటీవల తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య శాస్త్రం పేరుతో సామాన్యుల జీవితాలను పరిచయం చేస్తున్నారు. అది చదిన వారికి కూడా అలా రాయాలనే ప్రేరణ కూడా కలిగిస్తున్నారు. గొప్ప వ్యక్తుల గురించి చెప్పటం ఎవరికైనా చాలా సులభం. కానీ, సామాన్య వ్యక్తుల గురించి, అదీ చదివించే శైలిలో రాయటం సామాన్య విషయం కాదు. అందరి చేతా చదివించే గుణం ఆయన శైలిలో ఉంది. అలా రాయటానికి రచయిత చాలా సంఘర్షణ కు గురైయ్యుంటారు. స్పృహ సాహితీ సంస్థ వాళ్ళు హైదరబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ది 25-9-2006 న కందుకూరి రమేష్ బాబు రాసిన రచనల పై కొంతమంది చేత మాట్లాడించారు. అందులో నన్నూ మాట్లాడమన్నారు. ఆయన రాసిన 'బాలుడి శిల్పం ' గురించి నేను మాట్లాడాను. నిజానికి రచయిత కందుకూరి రమేష్ బాబు గాని, పుస్తకం రాయబడిన చిత్రకారుడి గురించి గాని నాకు వ్యక్తిగతంగా తెలియదు. రమేష్ బాబు కవితలు చదివాను. వ్యాసాలు చాదివాను. అతని శైలిని మనసులోనే అభినందించుకున్నాను. పత్రికలో మంచి కవితలను ప్రచురిస్తున్న ఎడిటర్ గార్కి కొన్నిసార్లు ఉత్తరాలూ రాశాను.
ఆనాటి నా ఉపన్యాసంలోని కొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ రాస్తున్నాను.
కవిత, కథ,నవల, నాటకం వంటి ప్రక్రియల్లో రచయితకు స్వేచ్చ ఉంటుంది. సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు, వాతావరణ చిత్రణ వంటివన్నీ కల్పించుకోవచ్చు. వాటిని చిత్రించటంలో కళాత్మక వాస్తవికతను సాధించి ఆకర్షణీయం చేయవచ్చు. సృజనాత్మక రచయితకు సత్యాన్ని దర్శింప చేయటమే ప్రధానం. కానీ, కందుకూరి రమేష్ బాబు రాసిన ఈ పుస్తకం సృజనాత్మకమా? సృజనేతరమా? అనే ప్రశ్న వచ్చినప్పుడు వాస్తవాన్ని విస్మరించకుండా రాసే బయోగ్రఫి జాబితాలోకి దీన్ని చేర్చటం సమంజసం. బయోగ్రఫి లో సృజనాత్మకత ఉన్నా, సృజనేతర అంశానికే అధిక ప్రాధాన్యత ఉంటుంది.
పుస్తకం చదువుతుంటే పాఠకులకు కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. రచయిత సామాన్యుడి గురించి రాస్తున్నానని ప్రకటించారు. "బాలుడి శిల్పం " చూస్తే, ఎవరీ బాలుడు? ఆబాలుడే చిత్ర. అసలుపేరు విఘ్నేశ్వరాచారి. ఆయన తండ్రి పేరు నందిపాటి జానయ్య
1.) జానయ్య తయారు చేసిన దేవుల్లతో పాటు, ఆయన్నీ (నందిపాటి జానయ్య ) ప్రజలు ఊరేగించారట! తండ్రి లాగే 'చిత్ర ' నీ ప్రజలు ఊరేగించారు.
2.) మహానటుడు శ్రీ య న్ టిరామారావు గారి చేత ప్రసంశలు పొందినవారు .
3.) చిత్ర ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే, ఫెయిర్ & లవ్లీ ప్రకటనలో నటించిన సినీ నటి పూనం కౌర్ కారులో ఇన్విటేషన్స్ పంచారట. మరిన్ని గొప్పతనాలుండగా నందిపాటి జానయ్య గాని, చిత్ర గాని, సమాన్యు లెలా అవుతారు?
పోనీ 'చిత్ర ' కూతురు శిల్ప విషయానికి వద్దాం!
'శిల్ప ' జె.ఎన్.టి.యు లో ఇంజనీరింగ్ సీటు సాధించారు.
దాన్ని మధ్యలోనే వదిలేసి మళ్ళీ ఫైన్ ఆర్ట్స్ లో చేరారు. ఒక సామాన్య విద్యార్ధినికి ఇది సాధ్యమేనా?
ఇక్కడ ఈమె ప్రస్తావన ఎందుకంటే, తాత, తండ్రి వారసత్వం శిల్పకు తెలియకుండానే ఏర్పడిందనే రచయిత వాదన ఒక ప్రాచీన సంప్రదాయానికి జీవంపోసేటట్లు అవుతుందేమో చూడ్డానికే! నిజంగా వారసత్వమే వృత్తికి కారణమైతే, ఒక ప్రమాద కర సిద్ధాంతాన్ని స్థిరీకరించే ప్రయత్నమే తప్ప, సామాన్యత ఏమీ ఉండదు. ఇది రచయత ఆలోచించ వలసి ఉంది.
ఇక చిత్ర లో సామాన్యతను రచయిత గుర్తించ గలిగారా? లేదా? అనే విషయాన్ని చూద్దాం!
1.) కులం కొందరికి హీనత్వాన్ని, మరికొందరికి ఉన్నతత్వాన్ని కలిగిస్తుంది. 'చిత్ర ' పేరు విఘ్నేశ్వరాచారి అని ముందే చెప్పుకున్నాం! తన పేరులో కులం చాయలు కనిపిస్తున్నాయి కనుక, ఆ నీలినీడలు పడకుండా ఉండాలనుకోవటంలో సామాన్య జీవన ఆశయం ఉంది.
2.) జీవితంలో పొదుపుగురించి ' చిత్ర ' ది సామాన్యమైన ఆలోచనే! నీళ్ళలో సబ్బు తేలియడుతున్నా, షాంపూ ఒలికిపోతున్నా దేన్నీ వృధా కానివ్వకూడదనే మనస్తత్వంలో సామాన్యతే ఉంది.
3.) ' చిత్ర ' కి చిన్నతనం లో సరైన బట్టలు లేకపోవటం, అందువల్ల మిత్రుడి జీన్ ఫాంట్, షర్ట్ తీసుకొని, ఇత్తడి చెంబుతో ఇస్త్రీ చేసుకోని, ఆ బట్టలేసుకొని, ఎక్కడెక్కడ ఆ బట్టలను ప్రదర్శించాలో అక్కడ వాటిని ప్రదర్శించి గాని మళ్ళీ తిరిగి రాక పోవటంలో ఒక సామాన్య బాలుడి జీవితానుభవమే పుస్తకంలో రచయిత ప్రదర్శించగలిగారు.
4.) 'చిత్ర ' బాల కార్మిక జీవితాన్ని అనుభవించినా, తన చిత్రాల్లో ఆ బాలకార్మికుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్లు, కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నట్లు అనేక చిత్రాలను చిత్రించటంలో కళాకారుడి ఆశల్ని చిత్రాల్లో చిత్రించారని రచియిత చెప్పటంలో ఇది సామాన్యశా స్త్రం ఎలా అవుతుందో చెప్పగలిగారు.
5.)నిజానికి 'చిత్ర ' చదువు కొనసాగకపోవటనికి, డబ్బులివ్వకుండానే చేపలమ్మే మనిషికి ఇచ్చేశానని గుర్తించ ఒట్టేసుకోవటం వల్లనే తన చదువు ఆగిపోయిందేమో అనే అర్థం కాని జీవితంలో సామాన్యతే ఉంది.
6.) డాక్టరు దగ్గర శిల్పాలు చేసి, ఇంటికి వెళ్తానని డబ్బులివ్వమని గొడవపడటంలో ఒక సామాన్యుని ఉద్విగ్న స్వభావమే ఉంది.
7.) ఒక బాలకార్మికుడిగా పనిచేయలేక పారిపోయి వచ్చి, ఆ జీవితాన్ని ఒక శిల్పం గా మార్చుకోవటంలో గొప్పపరిణామం ఉంది.ఆ పరిణామాన్ని గుర్తించటం ద్వారా వదిలివేయవలసినవేమిటి, స్వీకరించవలసినవేమిటి అనే విజ్ఞతను ఈ బాలుడిశిల్పం గ్రంథం చదివిన పాఠకులు గ్రహించగలుగుతారు.
దేవుడి విగ్రహం తో పాటు కళాకారుణ్ణీ ఊరేగించటం, యెన్. టి. ఆర్. తో పరిచయం, పూనం కౌర్ ఇన్విటేషన్స్ పంచటం వంటివన్నీ ఒక సామాన్యుడీ లో అంతర్నిగూఢంగా దాగిఉన్న కళాకారుడివే! అందుకే అతడు కళాకారుడిగా 'చిత్ర'. అంత కళా కారుడైనా జీవించేది ఒక సామాన్యమానవుడిగానే!! ఆ జీవితమే రచయిత ఇక్కడ చూపాలనుకున్నాడా?
ప్రణాళిక లో కొంత లోపం కనిపిస్తున్నా మలిముద్రణలో సరిచేసుకో దగిన అవకాశం ఉంది. వాటిని గమనించగలిగితే, నిజంగా మనమధ్య బతికిన మనుషులగురించి ఆయనే (రచయిత) కాదు, ఆ పుస్తకాలను చదివిన వారు చాలా మంది ఎంతోమంది జీవితాలను అక్షరీకరించే పనిలో నిమగ్నం కాగలుగుతారు.
ఈ పుస్తకంలో టెక్నిక్ గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలి.రచయిత తాను చెప్పాలనుకున్నదాన్ని ఆకర్షణియంగా చెప్పటానికి రెపోర్టింగ్ టెక్నిక్ ని ఎన్నుకున్నారు. చిత్ర గురించి చెప్పాలి. ఆయన్ని పరిచయం చేశారు. వెంటనే ఆ చిత్ర కారుని నేపథ్యకథనం వినిపిస్తారు. అక్కడక్కడా 'చిత్ర ' చేతనే మాట్లాడించారు. చిత్ర గురించి సంకాలీన రచయితల, కళాకారుల అభిప్రాయాలను క్రోడీకరించారు. టి.వి. స్రీన్ పై ' చిత్ర ' కనిపిస్తుంటే రెపోర్టర్ స్క్రిప్టుని వినిపించినట్లు రాయగలిగారు. ఇదంతా రెపోర్టింగ్ తెక్నిక్కే! తన వృత్తిలో సాధించిన నైపుణ్యాన్ని ఇలా రచయిత వాడుకోవటం వల్ల పరిశోధకులు, విమర్శకులు కవి/రచయితను వేరు వేరుగానే రచనను అనువర్తించాలా? అనుసందించీ చూడాలా అనే కోణం కూడా ఈ పుస్తకం అందించగలుగుతుంది.రచయిత కందుకూరి రమేష్ బాబుని మనసారా అభినందిస్తున్నాను.
-డా.దార్ల వెంకటేశ్వర రావు

కామెంట్‌లు లేవు: