"దార్ల వేంకటేశ్వరరావు దళితకవేకాదు, దళితతాత్త్వికుడు కూడా! ఏది రాసినా అందులో హేతుబద్దత ఉంటుంది. తనకోసం కాకుండా తమజాతి కోసం రాస్తున్నట్టుగా ఉంటుంది ... ఆధునిక కవి ఒకరు 'రోడ్డు శీలం లేనిది ' అన్నట్టే,దార్ల 'మావూరు నవ్వింది ' అంటాడు. సినారె 'మావూరు మాట్లాడింది 'లో గ్రామీణ భాషని, నమామి 'మావూరు మారింది 'లో కింది కులాలు స్వేచ్చతో విహరించినట్టుగానే , దార్ల వాళ్ళ ఊళ్ళో ఉన్న అభినవ మనువు గురించి ఏకరువు పెట్టాడు. వస్తవికతే ఊపిరిగా జీవించాలని, చరిత్రలో తమ జాతి జాడల్ని కనుగొనాలనే తపన దార్ల లో కొట్టవచ్చినట్లు కనపడుతుంది... అమరత్వాన్ని ప్రేమించే దళితతాత్త్వికుడుకూడా దార్ల!"
17-04-2001. 'కడుపుమీద కొట్టకుండ్రి ' కవితాసంకలనం-2001 (పుటలు: 15-16)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి