హ్రస్వదృష్టికీ దూరదృష్టికీ
భేదం తెలుసుకున్న విచక్షణతోనే మాట్లాడుతున్నాను
విభిన్న జాతుల వస్తుప్రదర్శ్నశాల
నా భారతదేశం నుండే మాట్లాడుతున్నాను
నేను చీత్కారాల గొంగళి పురుగునై విసిరేయ బడ్డప్పుడు
నా చుట్టూ నేనే సాలీగూళ్ళు అల్లుకుంటున్నప్పుడు
నాలోకి నేను కుంచించుకుపొతున్నప్పుడు
అభయ హస్తమిచ్చి ఆత్మ విశ్వాసాన్నిచ్చిన వాళ్ళను రణస్థలిలో వ్రణాల్తో నిండిన దేహాన్ని
అమృత హృదయంతో అక్కున చేర్చుకున్నవాళ్ళనూ
వాళ్ళు ఎవరైనా మర్చిపోలేను!
నా శరీరంలో శరీరమై నామనసులో మనసై
నామనిషిలో మనిషై నాప్రాణంలో ప్రాణమైన వాళ్ళని
వాళ్ళు ఎవరైనా చిన్ని రంద్రంనుండే చూడలేను!
నాబతుకులో బతుగ్గా బతకటమంటే..
ప్రాకృతికావస్థ లోకి కూరికి పోవటం కాదు
తరతరాల గోచీపాతల్ని
డాక్టర్ అంబేడ్కర్ నై ధవళ వస్త్ర జిలుగుల్ని మెరిపించటం
బాబూ జగజ్జీవన్ రాం నై అధికారంతో పోటీపడటం
మహాకవి జాషువానై కమ్మని కావ్యాన్నాలపించటం
అభినవ జాషువా ఎండ్లూరి సుధాకర్ లా రసజ్వలిత కెరటమై ఎగిసిపడటం!
నాదండోరా మాదిగోడులొ
నాగుండె స్పందనలో ఓ స్పష్టమైన మార్గముంది!-డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి