"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

04 December, 2017

తెలుగు మాధ్యమంలో విద్యా బోధన సాధ్యాసాధ్యాలు - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


నమస్తే తెలంగాణ, హైదరాబాద్ టాబ్లాయిడ్, 4 డిసెంబర్ 2017
వేదికపై వరుసగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య రెడ్డి శ్యామల, ఆచార్య రామకృష్ణారెడ్డి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, ఆచార్య వెంకటేశ్వరశాస్త్రి ఉన్నారు.


మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే ఆశయం చాలా ఉన్నతమైందే, కానీ దానికి అమలకి కొన్ని అవరోధాలున్నాయి. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో ఒకేరకమైన తెలుగు బోధించటానికి వీలుకాదు. తెలంగాణలో చాలా కాలం వరకు తమది కాని భాషనేదో తమ పాఠ్యపుస్తకాల ద్వారా  తాము చదువుకుంటున్న అనే భావన చాలా కాలం అనుభవించారు. తమపై ఎవరి భాషో ఆధిపత్యం చెలాయిస్తుందనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. దాన్ని తమ తెలుగు కూడా భావించని వాళ్లున్నారు. అందువల్ల ఆ ప్రాంతానికి సంబంధించిన వాడుకభాషను పాఠ్యాంశాలలో చేర్చగలిగితే మరింత బాగుంటుంది. దీనితోపాటు ప్రపంచ విజ్ఞానానికి కేంద్రంగా మారిన ఆంగ్లభాషలో వచ్చే విజ్ఞానాన్ని తమ మాతృభాషలో వెంటనే మార్చుకోగలిగే సదుపాయాన్ని మనం కలిగించగలగాలి. ఆంధ్రప్రదేశ్ లోవ్యవహారంలో ఉన్న తెలుగుకీ, తెలంగాణలో వ్యవహారంలో ఉన్న తెలుగుకీ మధ్యే ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి. వీటన్నింటినీ కంప్యూటర్ సహాయంతో క్షణాల్లో మార్చుకోవచ్చుని ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు చెప్తున్నారు. అలా చేయగలిగితే అంత కంటే గొప్ప విషయం మరొకటి ఏదీ ఉండదేమో. అయితే అది అందుబాటులోకి రావాలి. గూగుల్ తెలుగు భాషను వాడుకలోకి తీసుకు వచ్చిన తర్వాత ఉత్తరాలు ఈ-మెయిల్స్ రాసుకోవడం వంటివన్నీ కూడా చాలామంది తమ మాతృభాష తెలుగులోనే కొనసాగిస్తున్నారు. దీనికి కారణం అందుబాటులోకి ఆ సాధనాలు రావడమే. అలా భాషా శాస్త్ర వేత్తలు ఇతర భాషల్లోని విజ్ఞానాన్ని తెలుగు లోకి కూడా తీసుకు రాగలిగే సాధనాలను అందుబాటులోకి తీసుకొస్తే (మాతృభాష) తెలుగులో కూడా ఉన్నత విద్యను కూడా అభ్యసించవచ్చు.
సాక్షి, హైదరాబాద్ (ముషీరాబాద్ జోన్)

 మనం కొన్ని తెలుగు అనువాదాలను చూస్తుంటాం. తెలుగు పేరుతో సంస్కృతాన్నో, అన్య భాషా పదజాలాన్నో అనువాదం చేసి దాన్ని  తెలుగు అని భ్రమింపచేస్తుంటారు. వాటిని చదివి అర్థం చేసుకోలేనివాళ్ళు వాటికంటే ఆంగ్లమే చాలా సులభం అనే భావానికి రావడం సహజం. మాతృభాషగా తెలుగు మాధ్యమంలోనే ఉన్నత చదువులు కూడా చదవాలంటే కావలసిన నిఘంటువులు,  పదకోశాలు, అనువాద సాధనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించమని భాషాశాస్త్రవేత్తలను కోరుతున్నాను.
Aఈ సందర్భంలో ఒకటి గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. తెలుగుతో పాటు ఆంగ్లాన్ని కూడా ఒక సబ్జెక్టుగా  చదవడాన్ని వ్యతిరేకించొద్దు. ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంతో ఆలోచిస్తుంది. ఆ విధాన రూపకల్పనలో కూడా మన భాషా శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థతోపాటు సమాంతరంగా ప్రైవేటు విద్యా వ్యవస్థ కొనసాగడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. విద్యాభివృద్ధికి, విజ్ఞానాభివృద్ధి అవసరమైనంతమేరకు  పోటీతత్వాన్ని పెంచడం కోసం ఈ వ్యవస్థ అవసరం కూడా. అయితే, దురదృష్టవశాత్తు పాలకులు ఉన్నత, ధనికి వర్గాల నుండి అధికసంఖ్యలో రావడం జరుగుతోంది. దానివల్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, కళాశాలలు ప్రైవేటు విద్యతో పోటీ పడలేకపోతున్నాయి.
నిజానికి ప్రభుత్వ విద్యా సంస్థలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉంటున్నారు. కానీ వాళ్ళకు పాఠాలు చెప్పడానికి తగిన వాతావరణం ఉండటం లేదు. చాలాచోట్ల విద్యా  సంస్థలకు సరియైన భవనాలు లేవు. కొన్నిచోట్ల విద్యార్థులు కూర్చోడానికి బల్లలు కూడా లేని పరిస్థితి. చాలాచోట్ల మరుగుదొడ్లు కూడా ఉండవు. తగినంత మంది ఉపాధ్యాయులను, అధ్యాపకులను నియమించరు. ఉన్న ఈ సిబ్బందిని కూడా ప్రభుత్వ  కార్యక్రమాలలో పాల్గొనాలని సూచిస్తుంటారు. ఓటర్లనమోదుతో పాటు, కొన్ని ప్రభుత్వ పథకాల ప్రచారం వంటివన్నీ వీళ్ళు నెత్తినే పడుతుంటాయి. కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. దానిలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడు. ఒక వేళ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరిగే సమావేశాలకు ఆ ఉపాధ్యాయుడు హాజరైతే  పాఠశాల మూసేయాల్సిందే. దీనికితోడు విద్యా కమిటీల పేరుతో రాజకీయాలు మరొకవైపు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్నా, వారిని విద్యా బోధన కోసం సమర్థవంతంగా వినియోగించడం లేదు. అందువల్ల ప్రభుత్వ విద్యాసంస్థలు అంటే ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా అపనమ్మకమే కలుగుతోంది. తమ పిల్లలను కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదివించుకోవాలన్న కుంటున్నారు.
మరి ఇవన్నీ పాలకులకు తెలియవా? తెలిసినా తెలియనట్లుండే అవకాశమే ఎక్కువ. ప్రైవేటు పాఠశాలల నడిపేదెవరు? ప్రభుత్వంలో భాగస్వామ్యం ఆయన కుటుంబాల వారు ప్రైవేటు పాఠశాలలను నడపకుండా ఉండగలరా? ఇవన్నీ క్షేత్ర స్థాయిలో, ఆచరణలో కనిపించే వాస్తవాలు.  తెలుగు మాతృ భాషను అమలు చేయడానికి ఇవన్నీ ఆటంకాలు. ఈ ఆటంకాలు తొలగిపోవాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ దిశగా కృషి ని ప్రారంభించిన తెలుగు భాషా వేదిక వార్ని అభినందిస్తున్నాను.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
డిప్యూటి డీన్, తెలుగు శాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్, ) 

(తెలుగు భాషావేదిక వారు 3 డిసెంబరు 2017 తేదీన షోయబ్ హాలు, సుందరయ్య విజ్ఞాన భవనంలో జరిగిన ‘‘మాతృభాషా బోధన - తెలుగు అమలు’’ అనే అంశంపై జరిగిన సమావేశంలో చేసిన ప్రసంగ సంక్షిప్తరూపం)

2 comments:

gurao said...

బావుంది మీ ప్రసంగ పాఠం. మీతో ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వాలు ప్రభుత్వ అజమాయిషీ లోని పాఠశాలలను తగిన సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేయటమే కాదు అన్ని విధాలుగా నిర్వీర్యం చేసి ఎవరు రాకుండా చేసింది. తను చేసిన తప్పుకు కలిగిన ఫలితాన్ని(విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరకపోవటం) ఇప్పుడు ప్రజలకు సంజాయిషీ ఇవ్వటానికి వాడుకొంటోంది. అప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వాలది విభజించి పాలించు అనేదే సిద్ధాంతం. అందుకనే ఉమ్మడి విద్యావిధానం అంటే కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో అన్నింట్లొ ఒకే మాధ్యమంలో ఉండాలి. ఇంగ్లీషు ఒక విషయంగా చదవించా

vrdarla said...

ధన్యవాదాలు సర్, మీరు చేస్తున్న తెలుగు భాషోద్యమంలో నేను కూడా భాగస్వామ్యమయ్యేలా అవకాశం కల్పిస్తున్న మీకు నా ధన్యవాదాలు.