"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

19 September, 2017

స్వచ్ఛతా పక్షోత్సవ కమిటీ నివేదిక - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

( భారతప్రభుత్వం ఆదేశాల మేరకు ది 1-9-2017 నుండి 15 -9-2017 వరకు జరగాల్సిన స్వచ్చతా పక్షోత్సవాలను యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు నిర్వహించింది. దీని నిర్వహణకు గాను యూనివర్సిటి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని చైర్మన్ గా నియమించింది. దీనిలో భాగంగా పదిహేను రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన నివేదికను ముగింపు ఉత్సవంలో సమర్పించారు. ఈ సమావేశానికి యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.పి.సంజయ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రత్యేక అతిథులుగా హైదరబాదు  మున్సిపల్ జోనల్ కమీషనర్ హరిచందన విచ్చేశారు. గౌరవ అతిథులుగా ఛీప్ వార్డెన్ ఆచార్య వాసుకి బలవాడి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేవాశిస్ ఆచార్య అధ్యక్షత వహించగా, కార్యక్రమాన్ని డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డా. జి.పద్మజ నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ మరియు చైర్మన్, స్వచ్ఛతా పక్షోత్సవ కమిటి చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన నివేదికను సమర్పించారు. దాని సారాంశాన్ని తెలుగులో అందిస్తున్నాను.... దార్ల ) 


వేదికపైన, సభలోను ఉన్న పెద్దలకు నా నమస్కారాలు. సభలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు నా శుభాకాంక్షలు
·         UGC వారి ఆదేశాల మేరకు, Govt. of India, Ministry of Human Resources Development వారి మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు వారు ఈ నెల ( సెప్టెంబర్) 1 నుండి 15వ తేదీ వరకు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం.
·         ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చైర్మన్ గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు వారు ఒక కమిటీని వేశారు. ఈ కమిటీలో సభ్యులుగా చీఫ్ వార్డెన్ ( లేదా వారి నామినీ), డా.బి.శామన్న, డా.వి.శ్రీనివాసరావు, డా.జి.పద్మజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (హార్టీ కల్చర్ &శానిటేషన్) వారు సభ్యులుగా ఉన్నారు. కార్యక్రమ విస్తృతిని బట్టి డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డా. కె.వి. రాజశేఖర్ గార్ని కూడా సభ్యులుగా కో ఆప్ట్ చేసుకోవడం జరిగింది.
·         సెప్టెంబరు 2 వ తేదీన స్వచ్ఛతా పక్షోత్సవాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె ప్రారంభించారు. వీరితో పాటు తొలిరోజు కార్యక్రమంలో , ప్రొ- వైస్-ఛాన్సలర్ ఆచార్య పి. ప్రకాశబాబు, అసిస్టెంటు రిజిస్ట్రార్స్ శ్రీ సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.
·         రెండవ రోజున Clean Hostel day, నాల్గవ రోజున Clean Mess day సందర్భంగా J & K Hostels లో స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగంగా వంటశాల, మెస్ హాల్, హాస్టల్ పరిసరాల్ని పరిశీలించాం. విద్యార్థులకు పరిశుభ్రత పట్ల అవగాహన కార్యక్రమాన్ని చేశాం. ఈ కార్యక్రమంలో Dy.రిజిస్ట్రార్ ఎ.శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.చంద్రశేఖర్, j హాస్టల్ వార్డెన్ డా.డి. రామచంద్రరావు, k.హాస్టల్ వార్డెన్ డాక్టర్ శ్యామల్ బిశ్వాస్, విద్యార్థులు అధికారులు పాల్గొన్నారు.
·         మూడో రోజు  Green Campus Day లో భాగంగా South Campus హాస్టల్ పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనిలో ముఖ్య అతిథిగా తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ పాల్గొన్నారు. జూనియర్ హార్టీకల్చరిస్ట్ శ్రీ సుబ్బారావు  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వీరితో పాటు డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దేవాశిస్ ఆచార్య,  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, శ్రీ బి. చంద్రశేఖర్ , విద్యార్థులు పాల్గొన్నారు.
·         ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా “ Innovative ways for spreading the message of hydiene”  అనే అంశంపై హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించాం.
·         ఆరో రోజు Clean Surroundings : Roads leading to the Institution లో భాగంగా యూనివర్సిటి మెయిన్ క్యాంపస్ నుండి SBI, HUC బ్రాంచి వరకు GHMC సిబ్బంది, విద్యార్థుల సహకారంతో డా.జి.పద్మజ, శ్రీ బి. చంద్రశేఖర్ గార్ల పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించాం.
·         ఏడొవ రోజు Care for the surroundings, Visit to slum/ villages to explain the concepts of cleaniness లో భాగంగా చందానగర్, శ్రీరాజీవ్ గృహకల్ప పరిసరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎన్. ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డా.వసంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, స్థానిక మున్సిపాలిటీ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
·         ఎనిమిది, తొమ్మిదవ, పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలను శేరిలింగంపల్లి, హెల్త్ సెంటర్, మార్కెట్ పరిసరాల్లో పరిశుభ్రతా అవగాహన కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించాం.
·         పదకొండో రోజు Care for the surroundings : Visit to institutions for the poor (Orphanage etc.) లో భాగంగా చందానగర్ లోని ‘Samkalpa’ Home for the deprived Children ని సందర్శించాం. అక్కడ వారికి పండ్లు పంచి, వారితో కలిసి ఆరోగ్యం, పరిసరాల గురించి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సుందర్, NSS వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
·         పన్నెండో రోజు Care for the Surroundings: Debriefing session with the commissioner local Body about the system for cleanlinessలో భాగంగా శేరిలింగంపల్లి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించాం. డా.బిందుమాధవి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో విద్యార్థులకు పరిశరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
·         పదమూడో రోజు Cleanest Hostel Room లో భాగంగా అంతకు ముందుగానే చీఫ్ వార్డెన్ గారి పర్యవేక్షణలో Cleanest Room  ఎలా ఉండాలో ఈకార్యక్రమ ప్రణాళికను ప్రకటించారు. తర్వాత ఒక్కో హాస్టల్ వార్డెన్, తమ సిబ్బందితో హాస్టల్ రూములను పరిశీలించి, Cleanest Room ని ఎంపిక చేశారు.
·         పద్నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా Elocution contest on “ Health and Hygiene is the real wealth” నిర్వహించాం. దీన్ని ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో పోటీలు ఉంటాయని ప్రకటించాం. అయితే, ఇంగ్లీషు, తెలుగు భాషలకు చెందిన విద్యార్థుల పాల్గొన్నారు.
·         విజేతలకు వ్యాసరచన, Elocution contests  పాల్గొన్న విజేలతకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించాం. వరుసగా రూ. 3,000/-, రూ.2000/-, రూ. 1000/- నగదు పారితోషికంతో పాటు, సర్టిఫికెట్ ప్రదానిస్తామని ప్రకటించాం.
·         Cleanest Hostel Room  ఒక్కొక్క హాస్టల్ ని ఒక యూనిట్ గా తీసుకొని, ఒక్కొక్క హాస్టల్ రూమ్ కి ఒక బహుమతిని ప్రకటించాం. ఒక్కొక్క బహుమతికి గాను రూ.1000/- నగదు, సర్టిఫికెట్ లను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించాం.
·         స్వచ్ఛతా పక్షోత్సవాల్లో పాల్గొన్న స్వచ్ఛందంగా పాల్గొన్న వాలంటీర్లకు ప్రశంసాపత్రాలను ఇవ్వాలని నిర్ణయించాం.  పూర్తి వివరణాత్మక నివేదికను సంబంధిత అధికారులకు సమర్పించడం జరుగుతుంది.
·         స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం వల్ల విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది, పరిసర గ్రామాల ప్రజలు పరిశుభ్రత, ఆరోగ్యాల పట్ల మరింతగా చైతన్యవంతమైయ్యారని భావిస్తున్నాం. పరిసరాల పరిశుభ్రత, దానివల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించేలా చైతన్యపరచడమే స్వచ్ఛతా పక్షోత్సవాల ప్రధాన ఆశయం. ఈ ఆశయం నెరవేరడంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
15 సెప్టెంబర్ 2017

చైర్మన్, స్వచ్ఛత పక్షోత్సవాల కమిటి, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్

No comments: