"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

15 అక్టోబర్, 2026

లెయిజన్ ఆఫీసర్ గా ఆచార్య దార్ల.. అభినందనలు

 లెయిజన్ ఆఫీసర్ గా ఆచార్య దార్ల.. అభినందనలు 

ఎస్సీ, ఎస్టీ లైజన్ ఆఫీసర్‌గా ఆచార్య దార్ల నియామకం - దళిత, బహుజన విద్యార్థి సంఘాల ఘన సత్కారం


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని 14.10.2026 తేదీన సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్న DSU (Dalit Students Union, HCU. విద్యార్థులు 



ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని 14.10.2026 తేదీన సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్న DSU (Dalit Students Union, HCU. విద్యార్థులు 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్ని 15.10.2026 వ తేదీన అభినందించి, శుభాకాంక్షలు తెలియజేస్తున్న BSF విద్యార్థి నాయకులు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్ని 15.10.2026 వ తేదీన అభినందించి, శుభాకాంక్షలు తెలియజేస్తున్న BSF విద్యార్థి నాయకులు

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)కి చెందిన దళిత విద్యార్థి సంఘం (DSU), బహుజన స్టూడెంట్స్ ఫ్రెంట్ (BSF) నాయకులు, అలాగే పలువురు పిహెచ్.డి, ఎం.ఏ. విద్యార్థులు.. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ప్రొఫెసర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని వర్సిటీ క్యాంపస్‌లో ఘనంగా సత్కరించి, తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని 14.10.2026 తేదీన సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్న ఎం.ఏ., పిహెచ్.డి. విద్యార్థులు 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్టోబర్ 8, 2026న ఒక అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. యూనివర్సిటీలోని ఎస్సీ (SC), ఎస్టీ (ST) వ్యవహారాలకు సంబంధించిన లైజన్ ఆఫీసర్ (Liaison Officer)గా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు నియమితులయ్యారు. ఈ కీలక పదవిలో ఆయన తక్షణమే బాధ్యతలు స్వీకరించి, రాబోయే మూడేళ్ల పాటు (3 సంవత్సరాలు) కొనసాగనున్నారు. గతంలో ఈ బాధ్యతల్లో ఉన్న స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఖామ్ ఖాన్ సువాన్ హౌసింగ్ (Kham Khan Suan Hausing) స్థానంలో ఆచార్య దార్ల ఈ నియమాకం పొందారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడటం, ఆ వర్గాలకు చెందిన ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించడం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు వార్షిక నివేదికలు సమర్పించడం మరియు రిజర్వేషన్ రోస్టర్లను పర్యవేక్షించడం వంటివి లైజన్ ఆఫీసర్ ముఖ్య బాధ్యతలు.

యూనివర్సిటీలో సామాజిక న్యాయం అమలులో అత్యంత కీలకమైన ఈ పదవికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఎంపిక కావడం పట్ల దళిత, బహుజన విద్యార్థి సంఘాలు తీవ్ర హర్షం వ్యక్తం చేశాయి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించే ఆయన.. ఈ కొత్త బాధ్యతల్లోనూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి చేస్తారని విద్యార్థులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే వారంతా ఏకమై ఆయనకు ఈ ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేశారు.

అందరి ప్రేమాభిమానాలకు, నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు: ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల లైజన్ ఆఫీసర్‌గా తాను నియమితులైన సందర్భంగా ఘనంగా సత్కరించి, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసిన దళిత విద్యార్థి సంఘం (DSU), బహుజన స్టూడెంట్స్ ఫ్రెంట్ (BSF) నాయకులకు, పిహెచ్.డి పరిశోధక విద్యార్థులకు, ఎం.ఏ. విద్యార్థులకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నాపై నమ్మకంతో యూనివర్సిటీ ఉన్నతాధికారులు అప్పగించిన ఈ కీలక బాధ్యతను అత్యంత బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. విద్యార్థులు, తోటి అధ్యాపకులు, శ్రేయోభిలాషులు నాపై చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమాభిమానాలు నాలో మరింత స్ఫూర్తిని, బాధ్యతను పెంచాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు వారికి సక్రమంగా అందేలా చూడటానికి నా వంతు కృషి నిరంతరం కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.అలాగే, సామాజిక మాధ్యమాల ద్వారా, ఫోన్ల ద్వారా తనకు శుభాకాంక్షలు అందించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధ్యాపకలోకానికి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారం, మద్దతు భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.



కామెంట్‌లు లేవు: