"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

31 అక్టోబర్, 2026

ఒక విద్యార్థి అనుభవం...

 మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు సర్ 😊🙏💐



సర్ నేను M.A లో మొదటి సెమిష్టర్ లో "దళిత సాహిత్యం" ఆప్షనల్ పేపర్ ఎంచుకున్నాను మీ బోధన , ప్రోత్సాహంతో క్లాస్ లో చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉండేది.

నేను పుట్టి పెరిగిన దళిత సామాజిక జీవితం పుస్తకాల్లో రాస్తారా అని నాకు అప్పటికి తెలియదు చదువుతుంటే ఆశ్చర్యమయ్యాను నా జీవితం గురించి నేను చదువుతున్నట్టు అనిపించింది మీరు బోధించిన దళిత సాహిత్యం, మీరిచ్చిన ప్రేరణ, ప్రోత్సాహం ఒక దళితుడిగా, మాదిగగా నాకొక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఇచ్చాయి సమాజంపై అవగాహన కల్పించాయి ఇది నాలో జరిగిన ఒక గొప్ప మార్పు అందులో మీ ప్రభావం అధికం అది నాలో శాశ్వతంగా దళిత సమాజం పట్ల మరింత ఇష్టాన్ని, ప్రత్యేకమైన బాధ్యతను కల్పించింది. 

మీరు చదవమన్న దళిత సాహిత్యం చిలుకూరి దేవపుత్ర గారి "పంచమం" , జి. కల్యాణ రావు గారి " అంటరాని వసంతం " నవలలు చాలా ఇష్టంగా చదివాను పంచమం నవల గురించి క్లాస్ రూమ్ సెమినార్ పెడితే ప్రశ్నలు, జవాబులు , విశ్లేషణలు విద్యార్థుల చేతనే చేయించారు అందులో నేను చాలా ఉత్సాహంగా అందరి ప్రశ్నలకు జవాబులు చెప్పాను అప్పుడు మీరు ఇలాగే చదవాలి , ఇలానే ఆలోచించాలి , పరిశోధన అంటే ఇదే అని చెప్పి నన్ను ప్రత్యేకంగా అభినందించారు అది నా జీవితంలో మరిచిపోలేని ఒక గొప్ప మధురానుభూతి, ఎప్పటికి మరిచిపోని సంఘటన. 

"కులవృత్తి" కథ మీద అసైన్మెంట్ ఇచ్చి వ్యాసం రాయించారు ఇలానే రాయాలి ఇంకా బాగా రాయాలి అని చెప్పి ప్రోత్సహించారు ఈ కథ మీద మీ రూమ్ లో వైవా పెట్టారు నన్ను ఆ కథ పై విశ్లేషణ చేయించి ఈ కథ పై ఒక వాక్యంలో నీ అభిప్రాయం చెప్పు అన్నారు అప్పుడు నేను తడుముకోకుండా 'దళితుల ఔన్నత్యం, బ్రాహ్మణుల అసమర్థత ' అని చెప్పాను మీరు నవ్వి వెరీగుడ్ అన్నారు అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అప్పటి నుంచి మీరంటే ఎంతో గౌరవం, ఇష్టం, ప్రేమాభిమానాలు కలిగాయి నా హృదయంలో మీ స్థానాన్ని పదిలపరుచుకున్నాను. 

అసైన్మెంట్ మేము సబ్మిట్ చేసిన కొద్ది రోజులకి ఇనాక్ తాతయ్య డిపార్మెంట్ కి వచ్చారు అప్పటికే మా ఏసురత్నం తాతయ్య నేను జాయిన్ అయిన కొద్దిరోజులకే కాంపస్ కి వచ్చి తాతయ్య దగ్గరకి మీర్ పేట తీసుకెళ్ళారు.

తాతయ్య డిపార్ట్‌మెంట్‌ కి వచ్చినప్పుడు మేము రాసిన అసైన్మెంట్లు అన్నిటిని ఆయన చూసారు నీ పేపర్ కూడా చూసారు నీ గురించి నాకు చెప్పారు నువ్వు ఇనాక్ గారి వాళ్ళ బంధువువి అంటగదా మా పిల్లోడే అని అన్నారని మీరు నాతో చెప్పారు.

తాతయ్య వెళ్ళేటప్పుడు నన్ను పిలిచి నాయనా నీ అసైన్మంట్ చూసాన్రా అలాగే రాయాలి నీ గురించి దార్ల వెంకటేశ్వర రావు గారికి మా పిల్లోడే మనవడు అవుతావని చెప్పాను బాగా చదువుకో అని చెప్పారు.

 "కులవృత్తి" కథ నాలో ఎన్నో మార్పులకు గురిచేసింది సాహిత్యానికి సమాజానికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది. 

ఇవన్నీ మొదటి సెమిష్టర్ లో కలిగిన గొప్ప అనుభూతులు, ఙాపకాలు సర్ ఈ మెసేజ్ చదివాక మీతో పంచుకోవాలని అనిపించింది మిమ్మల్ని నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటాను. 

మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. 

ధన్యవాదాలు సర్ 

డా.పులిపర్తి రమేష్, 30.10.2026

💙💙💙🙇‍♂️🙇‍♂️🙇‍♂️

కామెంట్‌లు లేవు: