ప్రకృతి విధ్వంసం కవిత
ప్రకృతి - విధ్వంసం
నిన్న
కొండ అతనికి
నీడనిచ్చిన తల్లి,
ఈ రోజు
అదే కొండచరియ
ఒక ఊరి జ్ఞాపకాన్ని
మట్టిలోనే పాతిపెట్టేసింది.
మనిషికి నిత్యం
ప్రకృతి
తన ఉనికిని గుర్తుచేస్తూనే ఉంటుంది
నదిని అడ్డుకుంటే
అది తన దారిని వెతుక్కుంటుంది,
కొండను తొలిచేస్తే
అది తన గుండెను విప్పుతుంది,
ఆకాశాన్ని పొగతో నింపితే
మేఘాలు తమ ఆగ్రహాన్ని కురిపిస్తాయి.
ప్రకృతి
మనిషిపై పగ తీర్చుకోదు
మనిషి సృష్టించిన
విధ్వంసాన్ని
విధ్వంసంతోనే తుడిచేసి
తనదైన భాషలో
ఒక హెచ్చరికనేదో రాస్తుందేమో!
దార్ల వెంకటేశ్వరరావు 30.8.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి