"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

26 ఫిబ్రవరి, 2026

మాటలు ఈటెలవుతాయి తస్మాత్ జాగ్రత్త!

మాటలు ఈటెలవుతాయి తస్మాత్ జాగ్రత్త! 



నిజమే...

అనుభవంతో చెప్తున్నా 

సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఎందుకు పెడతారో నాకు బాగా అర్ధమవుతుంది 

మనం కొంతమందిని నమ్ముతాం. 

అన్ని విషయాలు వాళ్లతో పంచుకుంటాం 

కానీ వాళ్లు సమయం చూసి

ప్రతి పనినీ దెప్పి పొడుస్తూ ఉంటారు!

మన అంంతరంగిక  విషయాలు పంచుకునేటప్పుడు 

ప్రతి వాళ్ళని నమ్మేయకూడదు. 

చాలామందికి మనం చెప్పకూడదనుకున్నా

మన జీవితాల్లోకి అ ప్రయత్నం గా ప్రవేశిస్తారు 

మనం ఏమి అడగకపోయినా పట్టుకొచ్చి పెడతారు.

తీసుకోకపోతే, తినకపోతే ఏమనుకుంటారో అని 

మనం తీసుకున్నామనుకోండి

తిన్నామనుకోండి

సందర్భం వచ్చినప్పుడు వాటన్నింటినీ 

మనమేదో అడుక్కునట్లుగా మాట్లాడతారు!

మనం రమ్మన్నా, రమ్మనకపోయినా

మన పనుల్లో ఇన్వాల్వ్ అవుతారు 

మనకు సహాయం చేసినట్లుగా 

మన తోడు కూడా ఉంటారు 

మరలా సమయం వచ్చినప్పుడు 

మనకోసం వాళ్ళేదో త్యాగం చేసినట్లుగా 

బాధపడి పోతారు 

వాళ్ళు చేసిన గొప్ప పనిని

 వాళ్ళు చెప్పిన సలహాలను

 నిరంతరం గుర్తు చేస్తూ

 వాళ్ల వల్లే మనం ఈ స్థితిలో ఉన్నామనే

 భావనలను కలిగిస్తారు 

మన అంతరంగంలో ప్రవేశిస్తారు 

మన కుటుంబంలో ప్రవేశిస్తారు 

మన కుటుంబం కంటే

 వాళ్లే గొప్పగా భావించుకుంటారు 

దానికోసం మన కుటుంబ సభ్యుల్నే

 మన దగ్గర నిందిస్తారు 

మన ఆలోచనల్ని నియంత్రిస్తారు 

ఇతరులతో మన

బంధాల్ని అమాంతంగా తుంచేస్తారు 

తుంచుకునేలా బ్లాక్మెయిల్ చేస్తారు 

నువ్వు మానసికంగా శారీరకంగా అలసిపోతావ్ 

ఆ అలసట నుండి తేరుకోవాలంటే 

నీకు నచ్చిన పని నువ్వు చేసుకోవాలి 

కానీ, వాళ్లు ఆ పని చేయనివ్వరు. 

భయం భయంగా అడుగుపెట్టిన ఆ అడుగులే 

భయాన్ని కలిగించేలా మారతాయి 

భయం భయంగా చూసిన ఆ కళ్ళే

భయం కలిగించేలా చేస్తాయి

నువ్వు మానసికంగా

నువ్వు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే 

అంతరంగాన్ని ఆక్రమించుకునేవాళ్ళ పట్ల తస్మాత్ జాగ్రత్త!

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

26.2.2026



















కామెంట్‌లు లేవు: