నీ దేహమంటే నీకెంత ప్రేమో
నాకు తెలుసు
దేహంపై ప్రేమలేదని చెప్తుంటావు
నీ కులమంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు
కులం లేదని చెప్తుంటావు
నీకు నీ మతమంటే ఎంత ప్రేమో
నాకు తెలుసు
మతభేదాల్లేవంటావు
నీకు నీ ప్రాంతమంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు
ప్రాంతీయ దురభిమానం లేదని చెప్తుంటావు
నీ దేశమంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు
నేనో విశ్వమానవుణ్ణంటావు
వి.ఆర్.దార్ల
8.12.2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి