"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

16 జూన్, 2025

’ నాన్నా..హేపీ ఫాదర్స్ డే ( Based on WhatsApp Status)

 ‘’ నాన్నా..హేపీ ఫాదర్స్ డే ‘’



నాన్న…!

మనిద్దరం ఎప్పుడూ ఒకరికొకరం 

ఆప్యాయంగా మెలగలేకపోయాం. 

నా పరీక్షల ముందు తప్ప,

మనం అంతగా 

మాట్లాడుకున్న సందర్భాలూ అరుదే! 

నేను ఇంటికి రాగానే

అమ్మని హత్తుకున్నట్టు

మీ దగ్గరికి వచ్చీ…మీతో మాట్లాడలేను. 

ఎందుకో కొంచెం మొండిగా మారిపోయాను

నాకు యే ప్రేమాప్యాయతలు లేనట్లు, 

ఎవరి మాటా విననట్టుగా తయారయ్యాను!


ఇదంతా గమనిస్తుంటే 

అది అంతా మీ వల్లే నేమో

నాకు కూడా 

మీలాంటి లక్షణాలే వచ్చాయనుకుంటున్నాను. 

మీ దగ్గరకు వచ్చీ…మిమ్మల్ని పలకరించలేను

మీ పట్ల నాకున్న ప్రేమనూ మీతో వ్యక్తం చేయలేను. 

కానీ…నేను మీ దగ్గరగా ఉన్నప్పుడు, 

లేదా 

నా పరిసరాల్లో మీరున్నప్పుడు

మీరు ఉన్నారన్న ఊహే చాలు

మీరు నాతోనే ఉన్నారని 

నా గుండెల నిండా ఆనందం నింపుకోవడానికి!


మీరు నన్ను నేను

నియంత్రించుకోవడమెలాగో నేర్పారు

మీరు నన్ను నేను

నా కాళ్ళపై నేను నిలబడ్డమెలాగో చూపారు

మీరు నాకు నేనుగా 

బ్రతకడమెలాగో నేర్పించారు


మీరు నన్ను కఠినంగా చూసిన ప్రతిసారీ,

భవిష్యత్తులో.. 

మీరు దూరమై నేను ఒంటరినైనా,

దృఢంగా ఉండాలనుకున్నారేమో

నన్ను మీరు ఏ పరిస్థితిల్లోనయినా

ఆత్మవిశ్వాసం చెక్కుచెదరకుండా 

నిలబెట్టాలనుకున్నారేమో

నన్ను మీరొక స్తంభంలా నిలబడ్డమెలాగో

నేర్పిస్తున్నారేమో

మీ ప్రవర్తనలో ప్రేమానురాగాలున్నా 

బయటకు తెలియనివ్వని సంకల్పాన్నేదో

నాకు అందిస్తున్నారేమో…

ఏమో నాన్నా 

నేను మీ పక్కనున్నా

మీరు నా పక్కనున్నా

మీరు-నేను వేర్వేరు కాదనిపిస్తుంది! 

***

నాన్నా…!

నన్ను మీరెప్పుడూ 

నా ముందు నన్ను మెచ్చుకోకపోయినా

నా విజయం పట్ల 

మీరెంంతో ఆనందపడతారని నాకు తెలుసు.

నేను అనేక విజయాలు సాధించాలని 

గట్టిగా కోరుకుంటారనీ నాకు తెలుసు.

నాన్న…!

నాకీ జన్మిచ్చినందుకు

మీకెప్పటికీ ఋణపడి ఉంటాను 

ఎప్పుడూ మీరు పాటించేనీతి నియమాలను

 ఎప్పటికీ తప్పకుండా నేను కూడా పాటిస్తాను

ఆ మార్గంలోనే ఆ జీవిస్తానని మాటిస్తున్నాను


నేను వేసే ప్రతి అడుగూ 

నేరుగా మీరు చూడకపోవచ్చు

నేను చేసేవన్నీ 

నేరుగా మీరు వినలేకపోవచ్చు

నేను ఎప్పటికప్పుడు అమ్మకి చెప్తూనే ఉంటాను

నేను అమ్మకి చెబితే 

ఏమిటో సగం చెప్పినట్లే అనిపించినా

మిగతా సగం 

అమ్మ చూసుకుంటుందనే భరోసా అనిపిస్తుంది 

ప్రతీ కొడుకు అలానే అనుకుంటాడేమో...

ఈ స్టేటస్ మీరు చూడరని తెలుసు

ఆ సంగతి నాకు తెలిసినా

ఏమో 

పొరపాటునైనా చూస్తారేమో అనే చిరుఆశ!

అసలు నా కాంటాక్ట్ నెంబర్ కూడా 

మీ ఫోన్లో సేవ్ చేసివుండదు.

కానీ, చిత్రమనిపిస్తుంది 

మీరు నా నంబర్ మాత్రం 

కరెక్టుగా ఎలా గుర్తుపెట్టుకుంటారో!


నాన్నా..

మిమ్మల్ని ఎప్పటికీ అత్యంత గౌరవంగా...

మిమ్మల్ని ప్రేమిస్తున్నాను 

మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను 

నాన్నా…హ్యాపీ ఫాదర్స్ డే!


             -ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

               సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ 

               ఫోన్: 9989628049


( ప్రతీ యేడాదీ జూన్ నెలలో మూడవ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా డాక్టర్ గా పనిచేస్తున్న ఒక కొడుకు రాసుకున్న వాట్సాప్ స్టేటస్ కి స్వేచ్చానువాదం.)


కామెంట్‌లు లేవు: