"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

30 సెప్టెంబర్, 2023

జంగారెడ్డిగూడెం కళాశాల అంతర్జాతీయ అంతర్జాల సదస్సు 29.9.2023


సామాజిక మార్పుకి నిదర్శనమే సాహిత్యంలో విభిన్న ధోరణులు

విశాలభారతి దినపత్రిక 30.9.2023  సౌజన్యంతో 

దిశ దినపత్రిక 30.9.2023  సౌజన్యంతో 
నవతెలంగాణ దినపత్రిక 30.9.2023  సౌజన్యంతో 
శుభతెలంగాణ దినపత్రిక 30.9.2023  సౌజన్యంతో 
భూమిపుత్ర దినపత్రిక 30.9.2023 సౌజన్యంతో 



జన ప్రతిధ్వని దినపత్రిక 30.9.2023  సౌజన్యంతో 


1.10.2023 ఆంధ్రప్రభ దినపత్రిక 

తెలుగు న్యూస్ టైమ్స్, 30.9.2023

తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు, విభిన్న ధోరణులు రావడమనేది సమాజంలో వస్తున్న మార్పులకు, ఒక ప్రజాస్వామిక ఆలోచనా ధోరణికి నిదర్శనమని, తెలుగు సాహితీవేత్తల ప్రతిభా పాటవాలకు పాఠకులు పట్టం కట్టడమేనని హెచ్.సి.యు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు జంగారెడ్డిగూడెంలోని ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో భిన్న కోణాలు లు’’ అనే అంశంపై ఒకరోజు అంతర్జాతీయ సదస్సు లో అంతర్జాలం ద్వారా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్యవక్తగా మాట్లాడారు. తెలుగు సాహిత్యం ఒకవైపు భారతీయ సమైక్యతను, సాంస్సృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూనే, తెలుగు వారి అస్తిత్వాన్ని నిలుపుకుంటూ సామాజిక మార్పుని ఆహ్వానిస్తూ వివిధ సాహిత్య ధోరణులు వచ్చాయని ఆయన సోదాహరణంగా వివరించారు. వ్యాసుని భారతాన్ని తెలుగులో కవిత్రయం, వాల్మీకి రామాయణాన్ని వివిధ కవులు తెలుగులోకి అనుసృజన చేయడంతో పాటు, భాగవతం, మహాకవి కాళిదాసు రచనలు, ప్రబంధాలు, కావ్యాలు, తర్వాత కథలు, నవలలు, నాటకాలు, వచన కవిత్వం, మినీ కవిత్వం వంటి అనేక ప్రక్రియలు, రూపాల్లో ఎంతో వైవిధ్యంతో కూడిన సాహిత్యం వచ్చిందన్నారు. ఆధునిక వచన కవిత్వంలో వచ్చిన రూపపరమైన మార్పుల్లో మినీకవిత్వం, హైకూలు, నానీలు, నానోలు, ముక్తకాలు, టుమ్రీలు, మొగ్గలు, రవ్వలు, రెక్కలు మొదలైన ప్రయోగాలు కనిపిస్తున్నాయనీ వాటిని సాహిత్యంలో నూతనత్వానికీ, మార్పుకీ, నూతన అభిరుచులకు ప్రాతినిథ్యాలుగా తీసుకోవాలని ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కమీషన్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమీషనర్ పోలాభాస్కర్ ఈ సదస్సులో సమర్పించబోయే ప్రసంగాలు, పరిశోధన వ్యాసాల సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవఅతిథిగా జాయింట్ సెక్రటరీ డా.ఆర్.డేవిడ్ కుమారస్వామి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ డా.చప్పిడి కృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎన్.ప్రసాద్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావు,ఐక్యుఏసి కోర్డినేటర్ డా.ఎం.మధు, సదస్సు నిర్వాహకులు, తెలుగుశాఖ అధ్యక్షులు డా.జి.వెంకట్ లాల్, సహ నిర్వాహకులు పి.నాగేశ్వరరావు, ప్రధాన వక్తలుగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన నారాయణ స్వామి యోగి (న్యూజెర్సి), డా.తొట్టెంపూడి శ్రీగణేశ్ (జర్మనీ), ఆచార్య కొప్పుల ఈశ్వర్ బాబు (ఇథియోపియా), ఆచార్య విస్తాలి శంకరరావు (చెన్నై), ఆచార్య గోనానాయక్, ఆచార్య చింతకింద కాశీం (హైదరాబాద్), ఆచార్య ఎ.జ్యోతి(వరంగల్), ఆచార్య ఎన్.కృష్ణారావు (గుంటూరు), డా.కెవిఎన్ డి ప్రసాద్, డా.టి. సత్యనారాయణ (రాజమహేంద్రవరం), ఆచార్య జొన్నలగడ్డ వెంకటరమణ (మదురై), డా. బూసి వెంకటస్వామి (విశాఖపట్టణం) తదితరులు పాల్గొని తెలుగు సాహిత్యంలోని విభిన్నధోరణుల గురించి ప్రసంగించారు. 







కామెంట్‌లు లేవు: