కృష్ణరాయవిభునికృషిఫలితమిదియె
తెలుగువైభవంబువెలుగులందె
దేశభాషలందుదివ్యమైవెలుగొందె
మనదితెలుగుభాషఘనతమీర
సహపాటితోడసఖ్యత
సహవాసమిదియెసమానసంతసమందన్
మహనీయగుణములముదా
వహమందెడిమీయుగళమువర్థిల్లునిలన్
జీవన మర్మం తెలియగ
జీవన గమ్యం గతుకుల చీకటి హర్మ్యం
జీవన సౌధం నిలుపగ
జీవనపదములుతడబడచేర్చినయిటుకల్
మనసెరిగినమనిషేలే
మనబాధలుతెలుసుకోగమనషిగతలపున్
మనమననడవడిలోకపు
మనుగడమనిషికిసుఖంబుమానితమగుచున్
కవికోకిల,డా జె వి చలపతిరావు,విజయవాడ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి