నమస్తే దినపత్రిక, 18.4.2022 సౌజన్యంతో
ఆంధ్రజ్యోతి దినపత్రిక, 18.4.2022 సౌజన్యంతో
దిశ దినపత్రిక, 18.4.2022 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక, 18.4.2022 సౌజన్యంతో
తెలుగు వాడుక గల రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో తెలుగు భాష అమలుకోసం తగిన సూచనలు ఇవ్వవలసిందిగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వేంకటరమణగార్ని ఆదివారం నాడు తెలుగు కూటమి అధ్యక్షుడు పారుపల్లి కోదండరామయ్య, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.దాసోజు పద్మావతి తదితరులు కలిసి విజ్ఞాన పత్రాలను సమర్పించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హిందీలో వివిధ స్థాయిల్లో న్యాయస్థానాల్లో తీర్పులిస్తు న్నారనీ, తమిళ నాడు లో కూడా వివిధ న్యాయస్థానాల్లో తమిళంలో తీర్పులిస్తున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని న్యాయ స్థానాల్లో జస్టిస్ రామలింగేశ్వర రావు, జస్టిస్ రాజేంద్రప్రసాద్ వంటివారు తెలుగులో తీర్పులిస్తున్నారని ఈసందర్భంగా కోదండరామయ్య వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి