నమస్తే దినపత్రిక, 22.2.2022 సౌజన్యంతో
పద్మభూషణ్ పురస్కార గ్రహీత బోయి భీమన్న రచనలన్నీ భారతీయ సమైక్యతకు ప్రేరణనిస్తాయని హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. మద్రాస్ మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు సోమవారం (21.2.2022) నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న 'బోయి భీమన్న అంతర్జాల అంతర్జాతీయ సదస్సు *బోయి భీమన్న సాహిత్యం- సమాలోచన* లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు. రాగవాశిష్ఠం, వాల్మీకి, వ్యాసుడు, ధర్మవ్యాధుడు మొదలైన నాటకాల ద్వారా దళిత వర్గాలకు ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా బోయి భీమన్న రాశారని, ఆవిధంగా రామాయణం, భారతం, భాగవతం, పురాణాలన్నీ భారతీయుల జ్ఞాన సంపద అని వెంకటేశ్వరరావు ఆయన అన్నారు.పాలేరు నాటకం ఎంతోమందిని విద్యావంతులను చేసేలా ప్రేరేపించిందనీ, అంబేద్కర్ భావజాలంతో పాటు , అంబేద్కర్ మార్గాన్ని అనుసరి, ప్రజాస్వామ్య బద్దంగా తమహక్కులను సాధించుకోవాలని భీమన్న భావించారని కూలిరాజు నాటకం ద్వారా నిరూపించారన్నారు. కుల నిర్మూలన కు సామరస్య వాతావరణం తో కృషి చేస్తూనే కులాంతర వివాహాల ద్వారా కుల సమస్యను పరిష్కరించవచ్చని భీమన్న అన్నారని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సమావేశంలో బోయి భీమన్న గారి సతీమణి హైమావతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భీమన్న గారి కి రావాల్సిన పేరు రాలేదని ఆయన రచనలన్నీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. ఈ అంతర్జాల అంతర్జాతీయ సదస్సు ని నిర్వహిస్తున్న సంచాలకులు, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య శంకర్రావు గారు అధ్యక్షత వహించారు. సామాజిక మార్పుకోసం కృషి చేశారని బోయి భీమన్న రచనలను ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రారంభ సమావేశంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఆచార్యులు భూక్య తిరుపతి , కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు జ్యోతి , మద్రాసు విశ్వవిద్యాలయం అధ్యాపకులు పాండురంగం కాళీ అయ్యప్ప , శంకర్ బాబు . అతిథులుగా జర్మనీ లోని హైడెల్ బర్గ్ విశ్వ విద్యాలయానికి చెందిన డా. టి శ్రీ గణేష్ , అమెరికా నుండి శ్రీ సీతా రామ్ లంకా , మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య వెంకట రమణ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ తెలుగుశాఖ ఆచార్యులు ఏటూరి జ్యోతి గార్కి, ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు ఆచార్యులు సూసి వెంకటస్వామి, మద్రాస్ క్రైస్తవ కళాశాల, తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య శ్రీపురం యజ్ఞశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి