మొన్న ఒకాయన మా అమ్మాయి పెళ్ళికి కేటరింగ్ కావాలి మన కులం వాడు ఎవరైనా ఉంటే చెప్పు వేరే కులం వాళ్ళు వొండింది తినలెం కదా అలాగే వాళ్ళు వడ్డిస్తే మనం ఎట్లా తింటాం అని అడిగాడు ................ నాకు జాలి + నవ్వు వచ్చింది
1. చెప్పులు కుట్టేవాడిది మన కులం కాదు, కాని వాటిని వేసుకోకుండా నడవలేం
2. పత్తి పండించిన వాళ్ళు , దారం తీసిన వాళ్ళు , దారం నేసేవాళ్ళు బట్టలు కుట్టేవాళ్ళు వీళ్ళెవరూ మన కులం వాళ్ళు కాదు కాని ఆ బట్టలు వేసుకొని తిరుగుతాం
3. పంట పండించే వాళ్ళు, పంట కోసే వాళ్ళు పంట నూరే వాళ్ళు , పంట ఆడించే మిల్లులు నడిపే వాళ్ళు ఆ దినుసులను అమ్మేవాళ్ళు వీళ్ళంతా మన కులం వాళ్ళు కాదు. కాని, వీళ్ళు పండించే వాటిని తినకపోతే మనం బతకలేం
4. జబ్బు పడితే వేసుకొనే మందులు తయారుచేసే వాళ్ళు వాటిని మోసుకొని తిరిగే లారి డ్రైవర్, ఆ మందులు అమ్మే షాప్ వాళ్ళు వీళ్ళంతా మన కులం వాళ్ళు కాదు కాని వీటిని వేసుకోకపోతే మనం బతకలేం
5. మన ఇంటి ముందు వున్న చెత్త ఎత్తేవాడిది మన కులం కాదు.వాడు ఆ ఆపని చెయ్యకపోతే అంటువ్యాదులు వచ్చి చచ్చిపోతం
6. మనం ఎంతో పవిత్రంగా చేసే యజ్ఞం లో వాడె చితికులు తయారుచేసే వాడు మన కులం కాదు అలాగే దానిలో పోసే నెయ్యి కుడా తయారుచేసే వాళ్ళు మన కులం కాదు కాని వాటిని పవిత్రంగా భావించి పూజ చేస్తాం
7.మనం పుట్టినప్పుడు మన బొడ్డు కోసే ఆమె మన కులం కాదు అలాగే మనలను సాగనంపే కాటికాపరి మనకులం కాదు
................... ఎందుకురా ఈ కుల పట్టింపులు అన్నికులాలు పనిచేస్తేనే ఈ సమాజం బతుకుందని తెలుసుకో. ఏ ఒక్క కులం ఒంటరిగా బతకలేని కుడా తెలుసుకో ఏ కులం ఎక్కువా కాదు. ఏ కులం కూడా తక్కువా కాదు ............. నువ్వు తక్కువ కులం అనుకొనే వాళ్ళు తయారుచేసేవస్తువులు /సేవలు లేకుండా మనం బతగ్గలమా అని ఒకాసారి ఆత్మ విమర్శా చేసుకో ................................
(వాట్సాప్ లో పేరు లేకుండా ఫార్వార్డింగ్ అవుతున్న ఒక సందేశం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి