‘వ్యక్తి అభివృద్ధికి కుటుంబమే మూలం
వ్యక్తి మానసిక బలాబలాలకు కుటుంబమే ప్రధాన కారణవుతుందని దాన్ని గోపిచంద్ అసమర్థుని జీవయాత్ర నవల సమర్థవంతంగా నిరూపించిందని ఆచార్య,జి, అరుణ కుమారి అన్నారు. అసమర్ధుని జీవయాత్ర నవల- అరవై దృక్కోణాలు పేరుతో హైదరాబాద్ విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారు ఆదివారం ఒక్కరోజు నిర్వహిస్తున్న విద్యార్థి సదస్సుకు ముఖ్యఅతిథిగా తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య,జి, అరుణ కుమారి విచ్చేసి మాట్లాడి సదస్సును ప్రారంభించారు. ఈ విద్యార్థి సదస్సుకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. అంతర్జాలం ద్వారా ఈ విద్యార్థి సదస్సును నిర్వహిస్తూ విద్యార్థుల్లో వక్తృత్వ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి , ఏదైనా ఒక అంశంపై సమగ్రమైన దృష్టిని అలవర్చుకోవాలని కి ఈ సదస్సు తోడ్పడుతుందని, అందువల్ల విద్యార్థి నిర్వహిస్తున్నట్లు ఆచార్య , దార్ల వెంకటేశ్వరరావు తెలియజేశారు.
ఈ సదస్సులో సుమారు అరవై అంశాలతో త్రిపురనేని గోపిచంద్ జీవితం,రచనల పరిచయం, సాహిత్య దృక్పథం, 'అసమర్థుని జీవయాత్ర నవలలో ప్రతిఫలించిన వివిధ కోణాలను ఈ సదస్సులో చర్చించారు. కందుకూరి వీరేశలింగం, విశ్వనాథ సత్యనారాయణ,గుర్రం జాషువా, సి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, శ్రీ శ్రీ, పి శ్రీ దేవి, కేశవరెడ్డి మొదలైన సాహితీవేత్తల పేరుతో వివిధ సమావేశాలకు పేర్లు పెట్టి విద్యార్థులే సమావేశాలకు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ ఈ సదస్సును నిర్వహించారు.ఈ సదస్సులో పరిశోధక విద్యార్థి నలసాని రాంప్రసాద్ తన సహకారాన్ని అందించారు.
ఈ సదస్సులో హిమబిందు,సాయిస్వాతి,త్రిపురాంజనేయులు,రాజు,నవనీత్,తులసీ, శిరీష మొదలైనవారు వివిధ సమావేశాలకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
ముగింపుసమావేశంలో డా.భుజంగరెడ్డి గారు పాల్గొని అభినందనలు అందజేశారు.
ఈ విద్యార్థి సదస్సు ద్వారా సదస్సును నిర్వహించడం,పత్ర సమర్పణ చేయడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులన్నారు. గ్రూపు సమన్వయకర్తలు హిమబిందు, నవనీతారెడ్డి, రాజు, రమణ, త్రిపురాంజనేయులు, శ్రీకాంత్, తులసి, శిరీష, సాయిస్వాతి సమర్థవంతంగా సమావేశాల్ని నిర్వహించారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి