10 జూన్, 2018
సునీత కొడుకు (మా మనవడు) పై పద్యాలు
నీదుబొజ్జపైన నిదురించెపాపాయి
జోలపాట వినుచు సుఖముగాను
హాయి కూర్చె మీకు ఆనందమునుపంచి
పరవశింపచే సె ప్రాకటముగ
-గోవిందుని గోవర్ధన్
9జూన్ 2018
ఏడాదికి యెదుట నిలిచె
వాడా గూడూ సిరులను వర్షించెను యే
నాడా బంధము పడెనో
నేడానందంబు కలుగనేగెను శిశువే!
తల్లి బంగారువర్ణంబు, తండ్రి మోము,
కాళ్ళుచేతుల పొడవులు కాదనకుండ
వచ్చె మేనమామలవోలె వరుసకట్టి
కోరుకున్నరీతి'సునీత' కొడుకు పుట్టె!
కలిసి మెలిసియు కలలను కనినజంట
కుల మతాతీత దృష్టితో కలిసినారు
ఇద్దరొకటైన ముచ్చట కిదియె బిడ్డ
కలిగె చంద్రయ్య కళ్యాణి కనుల పంట!
కలలు ఫలియించి ధైవము కనికరించి
సత్యనారాయణ సునీత సంబరపడ
పుత్రరత్నము తొలిబిడ్డ పుట్టినాడు
పడుచు వాళ్ళనీ తాతని పలకరించె!
నవ్వినంతయిల్లు నవరత్న భరితంబు
గుక్కపెట్టువేళ గుండెకోత
ఉంగ ఉంగ యనుచు ఊసులేచెప్పునే!
శిశువు చేష్టలన్ని చిత్రమౌర!
పాలుతాగుగాని బాలభీముడతడు
భాషరాదుగాని ఊసులాడు
రాజుకాదుగాని ఆజ్ఞలిచ్చునతడు!
శిశువు చేష్టలన్ని చిత్రమౌర!
మాటలాడకున్న మాటలన్నివినును
తనకుతానెనవ్వు తానెయేడ్చు
తనకునచ్చినట్లు తానుండుపసిపాప!
శిశువు చేష్టలన్ని చిత్రమౌర!
పెరుగు నేల బొజ్జ పెద్దవయసురాను?
పుట్టిన పసిపాపకెట్టిదూది
పరుపుకన్న పొట్ట పదిలంబునుండురా
దారి పూల తోట దార్ల మాట!
పసిపిల్లలనెత్తుకొనుట
పసిపిల్లలసైగలన్నిపసిగట్టుటయున్
ముసిముసి నవ్వులు పంచెడి
పసిపిల్లలతో గడుపుటవరమేదార్లా!
కదిలినమెదిలినచిత్రము
వదిలినపసివాడుచేయుబాల్యపుచేష్టల్
మదినిపులకించునెప్పుడు
అదియంతామనకుచెప్పిఅమ్మేమురిసెన్!
-దార్ల వెంకటేశ్వరరావు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి