"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

30 ఆగస్టు, 2017

జననాంతర సౌహృదాని...


మబ్బులు మనకంతుచిక్కవు
గడియగడియకో రూపాన్నిస్తాయ్ 
మబ్బుల పయనమెటో 
మనమూహించలేం!
ఏమబ్బు ఏమబ్బులో 
ఎందుకు కలిసిపోతుందో 
ఎవరికి తెలుసు ?
పంచేంద్రియాలకందని 
మనసు చేసే మాయాజాలమంతా 
మబ్బులూ చేస్తుంటాయో 
ఆకాశానికీ అర్ధంకాని 
ఆ మబ్బులు చేసే మర్మాలన్నీ 
మనసూ చేస్తుందో! 
మబ్బు కీ మనసుకీ
ఆకాశానికీ దేహానికీ 
ఆయెడతెగని బంధమేంటో ?
- దార్ల
28 ఆగస్టు 2017

కామెంట్‌లు లేవు: