రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

స్వచ్ భారత్ అభియాన్ కార్యక్రమానికి అభినందనలు

భారతప్రభుత్వం 2 అక్టోబరు 2014 గాంధీజీ జయంతిసందర్భంగా చేపట్టిన స్వచ్  భారత్ అభియాన్ కార్యక్రమం  మంచి ఆలోచనతో కూడింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా స్వచ్ఛమైన భారతదేశాన్ని తయారు చేసుకోవడానికి అందరూ నడుము కట్టడానికి ఇదొక ప్రేరణగా నిలవాలి. అలాగే రోడ్లు ఊడ్చడం, పరిశుభ్రత గురించి చేసే పనులు ఎంత విలువైనవో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాలి. నేడు మా సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతోంది. ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించినవారందరికీ అభినందనలు. ... డా.దార్ల వెంకటేశ్వరరావు, అసిస్టెంటు ఫ్రొఫెసరు, తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం. హైదరాబాదు.

No comments: