"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

29 డిసెంబర్, 2008

కృతఙ్ఞతలు

ప్రియమైన బ్లాగర్స్ అండ్ ఆత్మీయులకు అందరికీ కృతఙ్ఞతలు!కేశవ్ ... ఒక ఆత్మీయుడు ... నా దగ్గర చదువుకున్నవాడు, నా దగ్గరే రీసెర్చ్ చేయాలని ఆశించిన వాడు...ప్రాంతం... కులం ... భావజాలం... వ్యక్తిగత జీవితం.... వీటి కేమీ సంబంధం లేకుండా స్వచ్చంగా మాట్లాడుకునే వాళ్ళం. అనేక మంది సీనియెర్స్ ఉన్నా, నా దగ్గరే రీసెర్చ్ చేస్తానని మొండి పట్టు పట్టి మరీ చేరాడు. అతనితో మాట్లాడుతున్నంత సేపూ నాకూ ఏదో దగ్గర బంధువనిపించేది. అలాంటి వ్యక్తి లేడనే ఊహే తట్టుకోలేకపోతున్నాను. ఈ సమయంలో మీరెంతో ఆత్మీయంగా అతనెవరో తెలియని వారు కూడా సంతాపాల్ని తెలిపారు. చాలా మంది ఫోను చేశారు. మరికొంతమంది వ్యక్తిగతంగా మెయిల్ ఇచ్చారు. కొంతమంది కలిసి చెప్పారు.

మీ అందరికీ నాకృతఙ్ఞతలు!

అతనికి దేవునిపై నమ్మకం ఉంది. దేవుని నమ్మేవాళ్ళంతా అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిద్దాం.
కొంచెం నా మనసు కుదుటపడిన తర్వాత, మీరు రాసిన వ్యాఖ్యలు కూడా కలిపి అతని ఇంటర్నెట్ రచనలన్నీ కనీసం ఈ-బుక్ గా నైనా సంకలనం చేసి, ఒక కాపీని అతని తల్లిదండ్రులకు ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఆర్కుట్ లో రాసిన వ్యాఖ్యల్ని కూడా ఒక చోటకు చేర్చాలనుకుంటున్నాను. అలాగే దొరికినంత వరకూ అతను రాసిన ప్రతి అక్షరాన్నీ సేకరించి ఒక చోటికి చేర్చాలనుకుంటున్నాను. చూద్ధాం... ఎలా ఉంటుందో!
నా బ్లాగులో రాసిన వ్యాఖ్యలు రాసిన వాటిని ఇక్కడ జతపరుస్తూ, వీరందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు తెలుపుతున్నాను.
వచ్చే సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ...
మీ
దార్ల

.................................
కేశవ్ మరణానికి స్పందిస్తూ సంతాపాన్ని తెలిపిన వారు :

oremuna said...

అయ్యో
ఇలా జరక్కుండా ఉంటే బాగుండేది.

నేస్తం said...

చాలా బాధాకరమైన వార్త చెప్పారండి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అయ్యయ్యో,దారుణం,దార్ల గారు చాలా విషాదాన్ని పంచారు మీరు.ఎందుకిలా జరుగుతుంది.ముఖ్యంగా మీ హెచ్సీయూ నుంచి?ఆమధ్య నాగప్ప గారి సుందరరాజు ఇవ్వాళ ఈ కేశవాచారి?సృజనాత్మకతతో మరింత సున్నితత్వం వస్తుందా??వాస్తవాలను ఒంటరిగా ఎదుర్కోల్లేని బేలతనమా.ఎందుకీ దుర్మరణాలు.దార్ల గారు ఇకనుంచన్నా మీలాంటి వారు ఈ బలవన్మరణాలను ఆపాలి.అతని బ్లాగులు చదివాను గతంలో.మంచి వ్యక్తీకరణ ఉన్నా భావావేశం దాన్ని అధిగమిస్తుందని,కాలంతో పాటు రాటు తేలతాడనీ ఊహించా పాపం.ఇప్పుడా తల్లిదండ్రుల వ్యధను మనమెవ్వరం తీర్చలేము.కేశవాచారికిదే నా శ్రద్ధాంజలి.

శరత్ 'కాలం' said...

My condolences to you and to his family :(

జ్యోతి said...

అయ్యో! నా బ్లాగు ప్రారంభించిన మొదట్లో కామెంట్లు రాసేవాడు. చాలా రోజులనుండి కనపట్టంలేదు అనుకుంటున్నా. ప్చ్.. మరీ ఇంత సున్నిత మనస్కుడా??దేవుడు అతని ఆత్మకు శాంతి కలిగించాలని, ఆ తల్లితండ్రులకు తట్టుకునే శక్తినివ్వాలని ప్రార్దిస్తున్నాను.

బొల్లోజు బాబా said...

అరరె.
కేశవాచారి నాకవిత్వం బ్లాగుకు నేను రెగులర్ రీడర్ ని.
ఈ మధ్య వ్రాయటం లేదు. ఆ బ్లాగులో నేను కొన్ని కామెంట్లు చేసాను కూడా.
మంచి కవి.
బ్లాగులోకంలో మంచి పదచిత్రాలను సృష్టించగలిగిన కవి.
అతని కవిత్వంలో ఒక నిరాశ చాయ తొంగిచూస్తుంటుంది.
అదే అతన్ని ఒకటి రెండు సార్లు ప్రశ్నించాను కూడా.

భగవంతుడు అతని ఆత్మకు శాంతి కలిగించాలని వేడుకొంటున్నాను.
దార్ల గారికి
శిష్యుని తలచుకోవటం, అతనిపై ఉన్న అభిమానాన్ని టపా కట్టటం మీ సహృదయత కు తార్కాణం.

Sravya said...

so sad !
My condolences to his family

srinivasa rao said...

my deep condolences to his family&friends.

దేవన అనంతం said...

మనం ఒక మంచి బ్లాగర్ ని కోల్పోయాం.

రాధిక said...

అయ్యో...ఆయన నన్ను చాలా బాగా ప్రోత్సహించేవారు.అప్పట్లో నా ప్రతీ కవితని చక్కగా విశ్లేషించేవారు.ఆయన కవితలు నాకు చాలా నచ్చేవి.ఆయన లేరంటే నమ్మాలనిపించట్లేదు.సున్నితత్వం చచ్చేఅంత ధైర్యాన్నిస్తుందా?

చింతా రామకృష్ణారావు. said...

so sad !
My condolences to his family,near&dear.

చింతా రామకృష్ణారావు. said...

so sad !
My condolences to his family

Vamsi M Maganti said...

అయ్యో, చాలా బాధాకరమయిన విషయం...

కళాకారుడు said...

naku telugulo rase samayam kuda ledu na avedana alantidi, kesava chari ledu annavishayanni eppatiki nammaleka eppude tana mitrulaku phone chesi,vishayam telusukunnanu chari naku manchi snehitududu, nenu HCU theater arts chestunnapudu na eduru room a hostel-227 lo parichayam, kalalalo nannu eppudu prothsa histundevadu, university lo ugadi sambaralaki eddaram mamidi akulu chetlekki koyatam naku eppatiki gurthe.... betavolu rama bramham garini tane naku parichaam chesadu, kalmasham leni vyakthi, anniti ki minchi naku manchi mitrudu aptudu, orkut lo msg dwara matrame touch lo unnam.... kanisam phone no kuda unchukoleka poyanu durdrushtavatudini... naku cinema shooting chupistava anna korikanu tercheleka pyanu.... kshaminchu chari.... nuvuu pedda natuduvi ayyaka mamalni marichipoku ani tana roomments to kalisi ata pattinche vadu .... na dialouges ardham telekapothe me telugu dept.vallake phone chesta ani cheppevadini, ekkadavunna ne atmaku santi chekuralani asistu.... darla gariki krutagnatalu telupukuntu....

cbrao said...

చావు సమస్యను పరిష్కరిస్తుందా?

కృష్ణుడు said...

My sincere condolenses to you and his family.I used to read his blog though never left a comment.
So ...Saaaaaaaaaad after hearing the reason of his death.

సుజాత said...

కేశవాచారి వ్యాఖ్యలతో నాకు పరిచయం లేదు గానీ, అతడి మరణం, మరణానికి కారణం నన్ను కలచి వేస్తోంది. ఇలా జరగకుండా ఉంటే బాగుండేదనిపిస్తోంది. రైలు కింద పడి తన జీవితాన్ని చిదిమి వేసుకునేంత వేదన కలిగించిందా భగ్న ప్రేమ? తల్లిదండ్రులెంత క్షోభిస్తున్నారో? బలవంతంగా ప్రాణాలు తీసుకునే వారు ఒక్క క్షణం తల్లి దండ్రుల గురించి ఆలోచించగలిగితే ఎంత బాగుండు!

అతడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

కత్తి మహేష్ కుమార్ said...

చాలా బాధాకరమైన విషయం.

కత్తి మహేష్ కుమార్ said...

చాలా బాధాకరమైన వార్త.

శివ - teluguratna.com said...

చాలా బాధాకరమయిన విషయం

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాధాకరమైన విషయం, ఇలా జరిగి ఉండాల్సింది కాదు.

SIRAPANGI SANTHI SWAROOP said...

It's so heart rendering to know on opening the blog of Dr. Darla Venkateswara Rao.

I know Keshav during 2006 - 2007, while inmate in Men's Hostel B, in the Univeristy of Hyderabad. We became close during this period, later on though we were still staying on the same University campus, due to varied reasons, like staying in different hostels we used to meet occassionally.

I know Keshav, as a sincere Telugu Department student, with good academic record, and as a activist in Telangana Student related activities and Akhil Bharatiya Vidharthi Parishad (ABVP).

I felt Keshav as a bold person, but on knowing the reason for his sucide, known how sensitive human beings are!

I lost a friend on the University campus, who used to talk intimately.

I share my heart rendering condolence with Keshav's beloved one's like his family members, friends and Dr. Darla Venkateswara Rao.

May his soul rest in peace.

Hemalatha said...

డియర్ దార్ల గారూ!
మీ బ్లాగ్ లో కేశవ్ వార్త చూసి చాలా బాధ కలిగింది.అంతకు ముందు మీ ఫొటోలలో చాలా చోట్ల కేశవ్ ని చూశాను.మీరు పడ్డ ఆవేదన మీ అక్షరాలలో కనిపించింది.మీ అనుబంధం గురు శిష్యుల కంటె గొప్పది.సరిగ్గా చెప్పాలంటే తండ్రి కొడుకుల బంధం అనిపించింది.
కాలం అన్నిటి కంటె గొప్పది.దేవుడు మీకు ,కేశవ్ తల్లిదండ్రులకి ఓదార్పు నివ్వాలని కోరుకుంటున్నాను.

హేమలత పుట్ల
రాజమండ్రి

2 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చాలా బాధాకరమైన వార్త.వ్యక్తిగతంగా మాకెవరికీ పరిచయంలేకపోయినా వార్త తెలిసి మేమే తట్టుకోలేకపోతున్నాము.గురువుగా మీరెలా తట్టుకున్నారో!వారి తల్లిదండ్రులకు ఎంత పుత్రశోకాన్ని కలిగించారాయన.ఆయన ఆత్మకుశాంతి కలగాలని,వారి తల్లిదండ్రులకు తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ....

Society and Education చెప్పారు...

ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం కావడం వెనుక మన విద్యావ్యవస్థ, తల్లిదండ్రుల ఆలోచనా దృక్పథం కారణమవుతుంది.మన విద్యావ్యవస్థ సమూలంగా మారవలసిన అవసరం ఉంది. కేవలం డబ్బు సంపాదన మాత్రమే విద్య ధ్యేయం కాకూడదు.
www.societyandeducation.org