"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

20 డిసెంబర్, 2008

పోలాప్రగడ వారి సాహిత్య సభ విశేషాలు!

ఈనాడు హైదరాబాదు ఎడిషన్‌ లో 20-12-2008 న ప్రచురించిన విశేషాలు


సమయం: సాయంత్రం ఆరు గంటలు
తేదీ: 20 డిసెంబరు 2008
స్థలం: త్యాగరాయ గాన సభ, హైదరాబాదు
విషయం: గ్రంథావిష్కరణ సభ
ఎప్పటిలాగే ఒక అరగంట ఆలస్యంగానే కార్యక్రమం ప్రారంభమైంది.
మొదట పద్యాలతో సంబోధిస్తూ వివి సత్యప్రసాద్ గారు అతిధులను వేదిక పైకి పిలిచారు. ఙ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా//సి.నారాయణ రెడ్డి, హైదరాబాదు దూరదర్శన్‌ డైరెక్టర్ డా.పాలకుర్తి మధుసూధనరావు, హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ లో ఆచార్యులు , ప్రొ. శరత్ జ్యోత్స్నారాణి, డా// జి.అరుణకుమారి,డా//దార్ల వెంకటేశ్వరరావు(అంటే నన్నూ), విశ్వసాహితీ అధ్యక్షులు డా//పోతుకూచి సాంబశివరావు, ప్రముఖవిమర్శకుడు డా//ద్వానాశాస్త్రి, ప్రముఖ రచయిత్రి ముక్తేవి భారతి, పసిద్ద అనువాదకులు డా//డి.రంగారావు, ప్రముఖ రచయిత్రి పోలాప్రగడ రాజ్య లక్ష్మి , పరిశోధన పుస్తక రచయిత డా//ఎం. సంగీతరావులను వేదిక పైకి పిలిచారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.
ఆ తర్వాత పోలాప్రగడ సత్యనారాయణ మూరి గారి రచనలు : సమగ్ర పరిశీలన గ్రంథాన్ని డా//సి.నారాయణ రెడ్డి, పోలాప్రగడ రాజ్య లక్ష్మి గారు రాసిన కథలను The Travellers Bunglow and other stories విష్కరించారు. పేరుతో అనువదించిన గ్రంథాన్ని డా//పాలకుర్తి మధుసూదన రావు లు ఆవిష్కరించారు.
పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు రాసిన వలలు, కథల గురించి డా//జి.అరుణ కుమారి విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు.
నవలలో పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు రాసిన '' పొత్తుల బావి" గురించి నేను మాట్లాడాను. ( దీన్ని ఈ బ్లాగులోనే త్వరలో వ్యాసరూపంలో అందిస్తాను.)
మిగతావారు పోలాప్రగడ వారి రచనల్లోని విశేషాలను సమీక్షించారు.
త్వరలోనే పోలాప్రగడ వారి సాహిత్యంపై సెమినార్ నిర్వహిస్తానని పోలాప్రగడ రాజ్య లక్ష్మి ప్రకటించారు. సభలో రచయితలు డా//సంగీతరావు, పోలాప్రగడ రాజ్య లక్ష్మి గార్లు తమ స్పందనను తెలిపారు. సినీ నటుడు జెన్నీ వందన సమర్పణ చేశారు.
సభలో ప్రేక్షకులు గా డా//అద్దేపల్లి రామమోహన రావు, హైమవతీ భీమన్న, శీలా సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు.

3 కామెంట్‌లు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

"pottula bAvi" meeda mee vyAsam ko~raku eduru cUstU..tvaralO andistAru ani aaSistunnAnu..

Vamsi

vrdarla చెప్పారు...

వంశీ గారూ!
నా బ్లాగుని రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నందుకు థాంక్స్.
అంతే కాకుండా నిస్సందేహంగా అభిప్రాయాలు రాస్తున్నందుకు కూడా సంతోషంగా ఉంది. మన అభిప్రాయాలు ( మన రచనలు ) అందరికీ నచ్చాలనేమీ లేదు. బహుశా అలా కోరుకోవడం కూడా అత్యాశే అవుతుందేమో. అలాగే కామెంట్స్ రావడం లేదనో, రాయడం లేదనో రచనలు చేయడం కూడా ఆపకూడదనుకుంటాను. అనేక మంది వ్యక్తిగతంగా చర్చిస్తుంటారు. వాళ్ళకి పేరుతో రాయడం ఇష్టం ఉండక పోవచ్చు. అలాగే మన రచనలు కూడా కేవలం ఇప్పటికే కాకుండా భవిష్యత్తు తరాల వారికి కూడా ప్రేరణగానో, పరిశోధనకు ఉపయోగ పడే విధంగానో ఇంకా రకరకాల ప్రయోజనాలు కలిగి ఉండాలను కునే వాళ్ళలో నేను ఒకడిని.
త్వరలోనే మీరు అడిగిన పొత్తుల బావి వ్యాసం అందుబాటులో ఉంటుందని తెలుపుతూ... ఎప్ప్ట్టటికీ మీ నిర్మాణాత్మక అభిప్రాయాలను కోరుతూ
మీ
దార్ల

prasadam చెప్పారు...

nenu pottulabavi serial ga vachhinappudu sagam paina chadivanu. mee purthi patham kosam yeduruchustumtanu