"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

18 డిసెంబర్, 2008

తెలుగుబ్లాగర్లకో ఉత్తరం!


ప్రియమైన మన తెలుగు బ్లాగర్లకు నమస్తే,
ఈ మధ్య కాలంలో మన తెలుగు బ్లాగులను చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. తమ తమ భావజాలాల్ని కొనసాగిస్తూనే అవసరమైనప్పుడు అందరూ ఒకే అంశంలో బాగా కలుస్తున్నారు. ఈ-తెలుగు సమావేశాల పట్ల మీరు చూపుతున్న శ్రద్ద నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. అంతే కాదు ... కొన్ని బ్లాగులు చూస్తుంటే ఒకరినొకరు పలకరించుకొన్నట్లుండే వ్యాఖ్యలు. కొంతమందైతే పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలుపుకోవడం... మొన్నామధ్య ఒక పత్రిక లో ఫోటో చూశాను. తెలుగు బ్లాగర్లు ఊరేగింపుగా వెళ్ళిన దృశ్యాన్ని ... ఆ దృశ్యంలో నవ్వుతూ కనిపించే మన బ్లాగర్లనీ! ఎంత సంతోష పడ్డానో! నేను కూడా వాళ్ళ మధ్య పసిపిల్లాడిలా కేరింతలు కొడితే ఎంతబాగుణ్ణనిపించింది. అప్పుడప్పుడూ మన బ్లాగుల గురించి పత్రికల్లో రాస్తే వాళ్ళని అభినందించడమూ, వెంటనే అభినందనలు తెలిపిన వాళ్ళకు మళ్ళీ వినయంగా కృతఙ్ఞతలు చెప్పుకోవడం ఎంత బాగుంది. చక్కటి అనుబంధాల్ని కొనసాగిస్తున్నారనిపించింది. పేరెందుకు గానీ, సందేహాలకు స్పందించి వెంటనే పరిష్కారాల్ని సూచిస్తుండంటం... అడగక ఇచ్చిన సలహా ముద్దు అన్నట్లు సాంకేతిక సహాయాన్ని ఉచితంగానే సోదాహరణంగా వివరిస్తుండటం... బ్లాగుల్ని సమీక్షించడం, తమ బ్లాగుని పట్టించుకోవట్లేదని నిలదీసి అడగపోయినా అనానిమస్‌ కామెంట్స్ తో తమ చిలిపి కోపాల్ని ప్రకటించడం... వారిని కొంతమంది మళ్ళీ సముదాయించడం... ఇదంతా మన తెలుగు బ్లాగుల కుటుంబ వాతావరణాన్ని తెలుపుతుందనిపించింది.
మన తెలుగు బ్లాగర్లలో చాలా మందిలో నేను గమనించిన మరో మంచి గుణం తమ హోదా, వయసుల్ని కూడా పక్కకు పెట్టి కలిసి పోతున్నారు. ఇవ్వ వలసిన వారికి ఇవ్వవలసినంత గౌరవం కూడా ఇస్తున్నారు.
ఎందుకో నాకీ అభిప్రాయాలు రాయాలనిపించింది... సరదాగా మీతో పంచుకోవాలనిపించింది.
ఈ అనుబంధాల్ని ఇలాగే కొనసాగించుకుందాం...
ఉంటాను.
మీ
దార్ల

9 కామెంట్‌లు:

Rajendra Devarapalli చెప్పారు...

నిజం దార్ల గారు మీ పరిశీలన నిజం,

నేస్తం చెప్పారు...

నా మనసులో మాటే చెప్పారు అండి

జ్యోతి చెప్పారు...

నిజం చెప్పారు. ఈ అంతర్జాలంలో ఎవరెక్కడుంటారో తెలీదు. ఎలా ఉంటారో తెలీదు. కాని ఎటువంటి భేషజాలు లేకుండా వసుధైక కుటుంబంలా ఆత్మయ సంబంధంతో ఉంటున్నారు.

vrdarla చెప్పారు...

వెంటనే స్పందించిన రాజేంద్ర కుమార్ దేవరపల్లి గార్కి, నేస్తం గార్కి,జ్యోతి గార్కి నా మాటల్తో జతకలిపినందుకు కృతఙ్ఞతలు
మీ
దార్ల

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

పరిశీలన good

vrdarla చెప్పారు...

జాన్‌హైడ్ కనుమూరి గారూ! థాంక్యూ!

vrdarla చెప్పారు...

జాన్‌హైడ్ కనుమూరి గారూ! థాంక్యూ!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చక్కటి పరిశీలన. మీ బ్లాగ్, మీ వ్యక్తీకరణ, ఉద్దేశ్యం అన్నీ బాగున్నాయి. ధన్యవాదములు.

vrdarla చెప్పారు...

థాంక్యూ వనజ వనమాలి గారూ