"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

24 December, 2008

తెలుగు బ్లాగరు...ఎం.ఫిల్ విద్యార్ధి కేశవాచారి ఆత్మ హత్య : పత్రికల కథనాలు


సూర్య దిన పత్రిక 25-12-2008 న కరీనగర్ ఎడిషన్‌ లో ప్రచురించిన వివరాలు


సాక్షి దినపత్రిక 25-12-2008 న కరీనగర్ ఎడిషన్‌ లో ప్రచురించిన వివరాలు

సాక్షి దినపత్రిక 25-12-2008 న కరీనగర్ ఎడిషన్‌ లో ప్రచురించిన వివరాలు


ఈనాడు దినపత్రిక 25-12-2008 న కరీనగర్ ఎడిషన్‌ లో ప్రచురించిన వివరాలు




కేశవాచారి రాసుకున్న ఒక కవిత : ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో….

ఓ ప్రభూ!

ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను,

ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో….

నా స్వామీ!

నన్ను నీలో చేర్చుకోవూ!

నీ గుండెల నిండా అదుముకోవూ!

నీవు విహరిస్తున్న సత్యలోకపు ఛాయలకైనా నన్ను తీసుకెళ్ళవూ!!

ఈ అశాంతి జ్వలిత విశ్వం నుండి ప్రశాంతికై కలవరిస్తున్న అంధుడిని.

నీ అమృత వాక్కుల వెలుగుల బాటలోకి నన్నూ పయనింప చేయవూ!

ఓ యోధుడా!

నీ కళ్ళల్లో కాంతిని చూసాను.

ఎన్ని వెలుగులు విరజిమ్మితేనేం,

ఆ చుక్కలన్నీ నీ ముందు తల దించుకోలేదా!

విశ్వ మర్మమెరిగిన నీ నవ్వును చూసాను.

ఏ మోనాలిసా నా కళ్ళకు తట్టలేదే!

అది చిత్తరువైతేనేం,

ప్రాపంచిక వాంఛలతో నిండిపాపపు పనులెన్నో చేసిన

ఈ అపవిత్రపు చేతులతో నీ బుగ్గలను తాకాను,

అంతే!ఇన్నాళ్ళ నా మోసం,స్వార్థం,ద్వేషం,కుట్ర….

అన్నీ వేళ్ళతో సహా లాగేస్తున్నట్లు

ఒళ్ళు జలదరించిన అనుభవం ఎలా మరిచిపోగలను.

ఓ వీరుడా!

భయపడొద్దంటావ్.

ఓ గురువా!

బాధ్యతలన్నినా పైనే వేస్తావ్.

ఓ నిత్య ప్రేరకా!

నను నిరంతరం మేల్కొలుపుతుంటావ్.

ఓ యోగీ!

ధ్యానమే నీ జీవనయానమంటావ్.

ఓ మౌనీ!

నిశ్శబ్దమే బంగారమంటావ్.

వేలకోట్ల సంవత్సరాల నా సంస్కృతి శక్తులు

మూర్తీభవించిన ఓ సంపూర్ణ భారత యువకా!

నీవు నాడు దేశదేశాల్లోనాటిన నా భారత కీర్తి పతాక

నేటికీ విశ్వ వినీలాకాశంలోగర్వంగా రెపరెపలాడుతూనే వుంది.

విశ్వ మతాల సారాన్ని గ్రహించి,

దివ్యతేజస్సుతో ప్రకాశించిన ఓ ప్రవర్తకా!

నీవు నాడు ప్రతి భారత యువకుని గుండెల్లోనింపిన అమృత సందేశాలు

నేటికీ కడలి తరంగాలైఅనునిత్యం ఘోషిస్తూనే వున్నాయి.

ఓ మహాత్మా! మహితాత్మా!!

ఓ వ్యక్తీ!శక్తీ!!

ఓ నరేంద్రుడా! వివేకానందుడా!!

మళ్ళీ రావా!

నా సంస్కృతి గొప్పదనాన్నిఈ విశ్వ జనులందరికీ చాటడానికి.

మళ్ళీ రావా!

నా సంస్కృతి వృక్షాన్నిఈ చెదలు బారినుండి రక్షించడానికి.

అందుకే నా దైవమా!

ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను

ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో…."



వడ్లూరి కేశవాచారి ఫోటో


కేశవాచారి ... పూర్తి పేరు వడ్లూరి కేశవాచారి. ఈ రోజు హఠాత్తుగా అతను ఆత్మ హత్య చేసుకున్నాడని ఇప్పుడే ఫోను వచ్చింది.


కేశవాచారి తెలుగు బ్లాగులోకానికి తక్కువ సమయంలోనే ఎక్కువ పరిచయమై అనేక వ్యాఖ్యల ద్వారా వివాదాస్పదుడయ్యాడు. అతడు వీర తెలంగాణా వాది. తెలంగాణా గురించి ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేక పోయేవాడు. అతడు నాతెలంగాణ ( http://natelangana.blogspot.com/, ) బడి పిల్లగాడు naakavitvam/నా కవిత్వం నా తెలంగాణా వడ్లూరి కేశవా చారి మా ఊరు మంథని సాహితి (http://keshavachary.wordpress.com/ మొదలైన బ్లాగులు రాసుకున్నాడు.



కేశవాచారి సృష్టించుకున్న బ్లాగు " బడిపిల్లగాడు "


మీరు సహకరిస్తే ఒక వెబ్ మాగ్జైన్ ని కూడా నడిపుతానన్నాడు. సరేనని నా కంప్యూటర్ నిచ్చి సహకరించాను. దానికి తెలుగుసాహిత్య వేదిక అని పేరు పెడితే బాగుంటుందని సూచించాను. ఎందుకంటే దానిలో సాహిత్యమే ప్రధానం కావాలని సూచించాను. అలాంటిదే అన అభిప్రాయం అని కూడా అన్నాడు. అలాగే కొన్నాళ్ళు దాన్ని నడిపాడు. చాలా మంచి పేరు వచ్చింది. ఈలోగా తన ప్రేమాయణంలో మునిగిపోయి అనేక విషయాలను విస్మరించినట్లే తెలుగు సాహిత్య వేదికనూ పట్టించుకోలేదు. సరే చదువులో పడ్డాడని సంతోషించాను.

కేశావాచారి కొన్నాళ్ళు ఎంతో అంకిత భావంతో నడిపిన తెలుగుసాహిత్య వేదిక వెబ్ మాగ్ జైన్‌ ముఖ చిత్రం



కేశవాచారి...

సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.., తెలుగు చదివి, ప్రస్తుతం ఎం.ఫిల్ చేస్తున్నాడు.

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా బి.ఏ పూర్తి చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఎం.., తెలుగు ఎంట్రెన్స్‌లోనూ, ఎం.ఫిల్ ఎంట్రెన్స్‌లోనూ ఫస్ఠ్ ర్యాంక్ సాధించాడు. కానీ ఎప్పుడూ మార్క్సు గురించి పెద్దగా పటించుకొనేవాడు కాదు.

ఈలోగా ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మొదట్లో ఆ అమ్మాయి ఇతను లేకుండా జీవించలేనని చెప్పిందట. "అయితే నాకోసం నువ్వు ఎం.ఫిల్ రాయకుండా ఉండు చూద్దాం" అన్నాడట. ఆమె అలాగే చేసింది. ఇలా చాలా విషయాల్లో నమ్మకం కలిగించిందట. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అయితే కులాలు అడ్డు వచ్చాయి. దానితో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోలేదు. తర్వాత ఇతనూ ఆ అమ్మాయి కలిసి ఒక ప్రైవేటు టీ.వి.చానల్ లో ట్రైనీస్ గా చేరారట. అక్కడ ఆమె అనేక మందితో పరిచయం పెంచుకొని ఇతనిని నిర్లక్ష్యం చేయడాన్ని తట్టుకోలేక ఒకసారి యూనివర్సిటీ కాంపస్ లోనే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కానీ, విద్యార్ధుల వెంటనే ఆదుకొని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్ళి బతికించారు.

ఇవన్నీ నాకు చెప్పాడు. నాదగ్గరే అతను రీసెర్చ్ చేయడంతో నాదగ్గర కొన్ని విషయాలు చెప్పేవాడు. ఓ టీ.వీ. లో ట్రైనీగా చేరినా ఆర్కుట్ లో కనిపిస్తుండేవాడు. ఈ మధ్య నే నాదగ్గరకొచ్చి కొత్తగా వీడియో సెల్ కొనుక్కునానని చూపి నా ఫోటో తీసుకుంటానని అన్నాడు. దాన్ని తన ఆర్కుట్ లో కూడా పెట్టుకున్నాడు.

కేశవ్ ఆర్కుట్ పేజీ.

ఇక ఇటువంటి వాటి జోలికి వెళ్ళకుండా మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటానని అన్నాడు. 'తెలివైన విద్యార్ధిని ఏ యూనివర్సిటీ వదులుకుంటుంది. వీలైతే జె ఆర్ ఎఫ్ కూడా సాధించి మళ్ళీ డాక్టరేట్ లో చేర'మని చెప్పాను. చాలా సంతోషించాడు. "జెఆరెఫ్ కి ప్రిపేర్ అవుతున్నాను. పైగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు కూడా ప్రకటించారు కదా చదువుకుంటా"నని అన్నాడు. ఈ మధ్యనే యూనివర్సిటీ ఫెలోషిప్ కి కూడా సంతకం పెట్టాను. ఇంతలోనే ఇలాంటి వార్త రావడం చాలా బాధాకరంగా ఉంది.



కేశవ్ నన్నింత మోసం చేస్తావా...

మీరు నాకో రీసెర్చ్ గైడ్ మాత్రమే కాదు

నా జీవితానికే గైడ్ అన్నావే.
..

మీ తో గడిపితే ఏదో సాధించాలనే వాడివే

మీతో ఉంటే నా బాధలన్నీ చెప్పుకొని ఏడ్వాలనుంటుందన్నావే...

"మీరు నాకో నాన్న, మీరు నాకో అన్న .... మీరు నాకో గొప్పు ఫిలాసఫర్ ...

నాకిప్పుడే ఒంటరితనమూ లేద"న్నావే...

మరిప్పుడు నేను ... ఇలాంటి మాటలెవరినోటి నుండి వినాలి ...

రైలు కింద పడిపోయేటంత కష్టమేమొచ్చింది నాయనా,,,, కేశ వా...

నేను కనబడలేదా...

మనం మాట్లాడుకొనే ఒక్క మాటా గుర్తుకి రాలేదా...

ఏమై పోయావు.., ఎలా వెళ్ళిపోయావు... ఇప్పుడా కంప్యూటర్ ఎలా ఆన్‌ చేయమంటావు

ఎటెల్లి పోయావు

ఎక్కడని వెతకను ...
ఎప్పుడో ఒకప్పుడు నువ్వే
నా గురించి రాస్తావను కుంటే ...

నీ గురించే నే
నే రాయాల్సొచ్చిందే...

ఎంతమోసం చేశావ్ కేశవ్ ...

చెప్పకుండానే ... ఎటో వెళ్ళిపోయావ్.........


అతని మరణానికి సంతాప సూచకంగా అశృనయనాలతో నా బ్లాగును కొన్నాళ్ళు మూసేస్తున్నాను.

--దార్ల వెంకటేశ్వరరావు


23 comments:

oremuna said...

అయ్యో
ఇలా జరక్కుండా ఉంటే బాగుండేది.

నేస్తం said...

చాలా బాధాకరమైన వార్త చెప్పారండి.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ

Rajendra Devarapalli said...

అయ్యయ్యో,దారుణం,దార్ల గారు చాలా విషాదాన్ని పంచారు మీరు.ఎందుకిలా జరుగుతుంది.ముఖ్యంగా మీ హెచ్సీయూ నుంచి?ఆమధ్య నాగప్ప గారి సుందరరాజు ఇవ్వాళ ఈ కేశవాచారి?సృజనాత్మకతతో మరింత సున్నితత్వం వస్తుందా??వాస్తవాలను ఒంటరిగా ఎదుర్కోల్లేని బేలతనమా.ఎందుకీ దుర్మరణాలు.దార్ల గారు ఇకనుంచన్నా మీలాంటి వారు ఈ బలవన్మరణాలను ఆపాలి.అతని బ్లాగులు చదివాను గతంలో.మంచి వ్యక్తీకరణ ఉన్నా భావావేశం దాన్ని అధిగమిస్తుందని,కాలంతో పాటు రాటు తేలతాడనీ ఊహించా పాపం.ఇప్పుడా తల్లిదండ్రుల వ్యధను మనమెవ్వరం తీర్చలేము.కేశవాచారికిదే నా శ్రద్ధాంజలి.

శరత్ కాలమ్ said...

My condolences to you and to his family :(

జ్యోతి said...

అయ్యో! నా బ్లాగు ప్రారంభించిన మొదట్లో కామెంట్లు రాసేవాడు. చాలా రోజులనుండి కనపట్టంలేదు అనుకుంటున్నా. ప్చ్.. మరీ ఇంత సున్నిత మనస్కుడా??దేవుడు అతని ఆత్మకు శాంతి కలిగించాలని, ఆ తల్లితండ్రులకు తట్టుకునే శక్తినివ్వాలని ప్రార్దిస్తున్నాను.

Bolloju Baba said...

అరరె.
కేశవాచారి నాకవిత్వం బ్లాగుకు నేను రెగులర్ రీడర్ ని.
ఈ మధ్య వ్రాయటం లేదు. ఆ బ్లాగులో నేను కొన్ని కామెంట్లు చేసాను కూడా.
మంచి కవి.
బ్లాగులోకంలో మంచి పదచిత్రాలను సృష్టించగలిగిన కవి.
అతని కవిత్వంలో ఒక నిరాశ చాయ తొంగిచూస్తుంటుంది.
అదే అతన్ని ఒకటి రెండు సార్లు ప్రశ్నించాను కూడా.

భగవంతుడు అతని ఆత్మకు శాంతి కలిగించాలని వేడుకొంటున్నాను.
దార్ల గారికి
శిష్యుని తలచుకోవటం, అతనిపై ఉన్న అభిమానాన్ని టపా కట్టటం మీ సహృదయత కు తార్కాణం.

Sravya V said...

so sad !
My condolences to his family

Unknown said...

my deep condolences to his family&friends.

దేవన said...

మనం ఒక మంచి బ్లాగర్ ని కోల్పోయాం.

రాధిక said...

అయ్యో...ఆయన నన్ను చాలా బాగా ప్రోత్సహించేవారు.అప్పట్లో నా ప్రతీ కవితని చక్కగా విశ్లేషించేవారు.ఆయన కవితలు నాకు చాలా నచ్చేవి.ఆయన లేరంటే నమ్మాలనిపించట్లేదు.సున్నితత్వం చచ్చేఅంత ధైర్యాన్నిస్తుందా?

చింతా రామ కృష్ణా రావు. said...

so sad !
My condolences to his family,near&dear.

చింతా రామ కృష్ణా రావు. said...

so sad !
My condolences to his family

మాగంటి వంశీ మోహన్ said...

అయ్యో, చాలా బాధాకరమయిన విషయం...

కళాకారుడు R@M said...

naku telugulo rase samayam kuda ledu na avedana alantidi, kesava chari ledu annavishayanni eppatiki nammaleka eppude tana mitrulaku phone chesi,vishayam telusukunnanu chari naku manchi snehitududu, nenu HCU theater arts chestunnapudu na eduru room a hostel-227 lo parichayam, kalalalo nannu eppudu prothsa histundevadu, university lo ugadi sambaralaki eddaram mamidi akulu chetlekki koyatam naku eppatiki gurthe.... betavolu rama bramham garini tane naku parichaam chesadu, kalmasham leni vyakthi, anniti ki minchi naku manchi mitrudu aptudu, orkut lo msg dwara matrame touch lo unnam.... kanisam phone no kuda unchukoleka poyanu durdrushtavatudini... naku cinema shooting chupistava anna korikanu tercheleka pyanu.... kshaminchu chari.... nuvuu pedda natuduvi ayyaka mamalni marichipoku ani tana roomments to kalisi ata pattinche vadu .... na dialouges ardham telekapothe me telugu dept.vallake phone chesta ani cheppevadini, ekkadavunna ne atmaku santi chekuralani asistu.... darla gariki krutagnatalu telupukuntu....

cbrao said...

చావు సమస్యను పరిష్కరిస్తుందా?

krishna said...

My sincere condolenses to you and his family.I used to read his blog though never left a comment.
So ...Saaaaaaaaaad after hearing the reason of his death.

సుజాత వేల్పూరి said...

కేశవాచారి వ్యాఖ్యలతో నాకు పరిచయం లేదు గానీ, అతడి మరణం, మరణానికి కారణం నన్ను కలచి వేస్తోంది. ఇలా జరగకుండా ఉంటే బాగుండేదనిపిస్తోంది. రైలు కింద పడి తన జీవితాన్ని చిదిమి వేసుకునేంత వేదన కలిగించిందా భగ్న ప్రేమ? తల్లిదండ్రులెంత క్షోభిస్తున్నారో? బలవంతంగా ప్రాణాలు తీసుకునే వారు ఒక్క క్షణం తల్లి దండ్రుల గురించి ఆలోచించగలిగితే ఎంత బాగుండు!

అతడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

Kathi Mahesh Kumar said...

చాలా బాధాకరమైన విషయం.

Kathi Mahesh Kumar said...

చాలా బాధాకరమైన వార్త.

Shiva Bandaru said...

చాలా బాధాకరమయిన విషయం

వేణూశ్రీకాంత్ said...

చాలా బాధాకరమైన విషయం, ఇలా జరిగి ఉండాల్సింది కాదు.

S Swaroop Sirapangi said...

It's so heart rendering to know on opening the blog of Dr. Darla Venkateswara Rao.

I know Keshav during 2006 - 2007, while inmate in Men's Hostel B, in the Univeristy of Hyderabad. We became close during this period, later on though we were still staying on the same University campus, due to varied reasons, like staying in different hostels we used to meet occassionally.

I know Keshav, as a sincere Telugu Department student, with good academic record, and as a activist in Telangana Student related activities and Akhil Bharatiya Vidharthi Parishad (ABVP).

I felt Keshav as a bold person, but on knowing the reason for his sucide, known how sensitive human beings are!

I lost a friend on the University campus, who used to talk intimately.

I share my heart rendering condolence with Keshav's beloved one's like his family members, friends and Dr. Darla Venkateswara Rao.

May his soul rest in peace.

Hemalatha said...

డియర్ దార్ల గారూ!
మీ బ్లాగ్ లో కేశవ్ వార్త చూసి చాలా బాధ కలిగింది.అంతకు ముందు మీ ఫొటోలలో చాలా చోట్ల కేశవ్ ని చూశాను.మీరు పడ్డ ఆవేదన మీ అక్షరాలలో కనిపించింది.మీ అనుబంధం గురు శిష్యుల కంటె గొప్పది.సరిగ్గా చెప్పాలంటే తండ్రి కొడుకుల బంధం అనిపించింది.
కాలం అన్నిటి కంటె గొప్పది.దేవుడు మీకు ,కేశవ్ తల్లిదండ్రులకి ఓదార్పు నివ్వాలని కోరుకుంటున్నాను.

హేమలత పుట్ల
రాజమండ్రి