"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

మిత్రుల రచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మిత్రుల రచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

06 సెప్టెంబర్, 2020

దార్ల గురించి మిత్రుడు వెలగా ఈశ్వరరావు అభిప్రాయం ( 5.9.2020, వాట్సాప్ గ్రూపులో)

 


మిత్రులారా  మన దార్ల గురించి మీకు తెలియని నిజాలు 

తమ్ముడు రవి ని శ్రద్దగా చదివించి  తెలుగు ఉపాధ్యాయ గా  తీర్చి దిద్దాడు 

చెల్లెలు విజయ కుమారి ని  బాధ్యత గా 

చదివించి, తెలుగు ఉపాధ్యాయురాలు గా చేసాడు 

వీరందరూ,  చదువు కోవడం కోసం,  కష్టపడిన అన్న కొడుకు ను  తన దగ్గర 

ఉంచుకొని చదివించి  ఉద్యోగస్తునిగా 

చేసాడు 

ఏ అవసరం అయినా కుటుంబం కు నేను ఉన్నాను అనే భరోసా ఇస్తాడు 


మా మిత్రునికి జన్మ నిచ్చిన ఆ తల్లితండ్రులు ఎంత పుణ్యాత్ములు 

ఇలాంటి కొడుకు ఉంటే ఏ కుటుంబం అయినా సంతోషం గా ఉంటుంది. 

  

మిత్రునిగా  నాకు భోజనం పెట్టిన రోజులు నేను మరచి పోలేను 


అర్ధాంగి అయిన భార్య మంజు  మన దార్ల ను  చిన్నా  అని పిలుస్తుంది అంటే 

ఆ   అను  బంధం... అద్భుతం 


ఈ విధంగా  ఓ మంచి కొడుకు గా, తమ్ముని గా, అన్న గా, భర్త గా, 

మిత్రుని గా........ 


చిన్న , సింహం ఎలా అయ్యాడో  మీకు 

తెలియాలి కదా 🙏🏼

18 మే, 2016

అనాథల మానసిక సంఘర్షణే ‘మాతృక’ నాటిక

రావినూతల ప్రేమకిషోర్ రాసిన ‘మాతృక’ నాటికను నిన్న (17 మే 2016) రాత్రి 9 గంటలకు బిహెచ్ యిఎల్ కమ్యూనిటీ హాలులో  ప్రదర్శించారు. దీన్ని సరిగ్గా గతేడాది ఇదే తారీఖున (17.05.2015)  నంది నాటక పరిషత్ వారు ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ నాటిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు.  దీనికి ఎం. భజరప్ప 
నాటికలో  తల్లి నిర్మలాదేవి మరలా అనాథాశ్రమానికి వెళ్ళి సేవచేయాలనుకున్నదృశ్యం
దర్శకత్వం వహించారు. సురభి కళాకారిణి ప్రభావతీదేవి ‘నిర్మలాదేవి’ పాత్రలో జీవించారు. అనాథ అయిన నిర్మలాదేవి  ఒక అనాథాశ్రమంలో పెరుగుతుంది.  తాను వివాహం చేసుకోకుండా అనాథాశ్రమం నుండి  ఒక బాలుడిని తెచ్చుకొని పెంచి పెద్ద చేస్తుంది. ఆ యువకుడు (సుజన్)  ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ విషయాన్ని తల్లికి చెప్తాడు. కానీ, తల్లి  ఆ ప్రేమవివాహం జరుగుతుందో లేదోనని సందేహిస్తుంది.  ఈ లోగా ఒక ధనవంతుడైన యువకుడు (మోహన్) నిర్మలాదేవి అందాన్ని చూసి  ఆమెను అనుభవించాలనుకుంటాడు. కానీ, ఆమె లొంగదు. పెళ్ళి చేసుకుంటానంటాడు. తాను పెళ్ళి చేసుకోనని, తన కొడుకుని పెంచుకుంటూ బతకాలని భావిస్తున్నట్లు చెప్తుంది. ఎలాగైనా ఆమెను తనదానిగా చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తాడా ధనవంతుడైన యువకుడు. కానీ ఆమె లొంగదు. ఈ లోగా నిర్మలాదేవి కొడుకు తాను ప్రేమించిన యువతి తండ్రి (బేస్ రఘురామ్)ని   ఇంటికి తీసుకొస్తాడు. అతడు సమాజంలో గౌరవప్రదంగా జీవించే  ఒక అగ్ర కులానికి చెందిన ధనవంతుడు. నిర్మలాదేవి దగ్గరకొచ్చి ఆమె పూర్వాపరాలను తెలుసుకోవాలనుకుంటాడు. కానీ, తాను అనాథనని చెప్తుందామె. కొడుకేమో తన తండ్రి నాయుడు కులానికి చెందిన వానిగా చెప్తాడు. తల్లి దానికి అంగీకరించదు. అదంతా నిజం కాదంటుంది. అనాథలంతా చేరిన ఈ కుటుంబంలో తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి ఇష్టపడకపోగా, మరలా తన కుమార్తె దగ్గరకొచ్చిన ఆ యువకుణ్ణి కొట్టించి పంపేస్తాడు. తన కులమేమిటో, తన తండ్రెవరో తెలియని ఆ సుజన్ మానసిక సంఘర్షణకు లోనవుతాడు. ఏలోటూ తెలియకుండా పెరిగిన ఆ యువకుడు తెలుగు పత్రిక చదవడానికి కూడా ఇష్టపడని మనస్తత్వం కలిగినవాడు. తన తల్లిని మరొకరు అమ్మ అని పిలిస్తే కూడా సహించలేక తన ఇంట్లో పనిమనిషిని కూడా కొడతాడు. తన తల్లి ప్రేమ తనకే చెందాలని తపిస్తుంటాడు. తల్లేమో తన పుట్టిన రోజుని కూడా రెండువందల మంది అనాథబిడ్డలతో కలిసి పుట్టినరోజు చేసిన సంఘటనల్నే గుర్తుచేసుకుంటుంటాడు.
నిర్మలాదేవిని వివాహం చేసుకుంటానని అడుగుతున్న ధనవంతుడైన యువకుడు మోహన్ 
 ఈలోగా ధనవంతుడైన యువకుడు నిర్మలాదేవిని పెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమై, చివరికి ఆమె కుమారుడిని కూడా దత్తత తీసుకుంటానని, అలాగైన తనని పెళ్ళిచేసుకోమంటాడు మోహన్. దానికీ ఆమె అంగీకరించదు. ఒకరోజు సుజన్ ఇంట్లోలేని సమయంలో మరలా ఆ మోహన్, నిర్మలాదేవిని పెళ్ళిచేసుకోమని, తనకీ కొన్ని ఆదర్శాలున్నాయనీ, అందుకే ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని వివరిస్తున్న సమయంలో కొడుకు సుజన్ ఇంటకొస్తాడు. వాళ్ళిద్దరినీ ఇంట్లో చూసి అపార్థం చేసుకుంటాడు. ఆ విషయాన్ని తల్లి  దాస్తుందనుకొని ఆమెను నిందిస్తాడు. తన సర్టిఫికెట్స్ లో తండ్రి పేరు స్వామి నాయుడు అని ఉన్నా, తన తండ్రిని ఏనాడూ చూపించకుండా తన తల్లి నాటకమాడుతుందని మాట తూలనాడతాడు. జరిగిన సంఘటనకు, తన కొడుకే తనని అనుమానించినందుకు తల్లి నిర్మలాదేవి మరలా అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. నిర్మలాదేవి గతమంతా తెలిసిన ముసలాయన (బాబాయి) ఇంటికొచ్చి ఆ కొడుక్కి వివరిస్తాడు. నిజానికి నిర్మలాదేవి పెళ్ళి చేసుకోలేదనీ, ఒక అనాథపిల్లాడ్ని పెంచుకొని, అతనే సర్వస్వంగా పవిత్రంగా జీవించాలనుకుందనీ తెలిసి సుజన్  కుమలిపోతాడు.
నాటిక అంతా అనాథల జీవిత సంఘర్షణలెలా ఉంటాయో అద్భుతంగా చిత్రించింది. ధనవంతుడైన యువకుడు తొలుత నిర్మలాదేవిని అనుభవించడానికే ప్రయత్నించినా, ఆమె జీవితం అంతా తెలిసిన ఆ యువకుడు ఆదర్శయువకుడిగా మారిన వైనాన్ని మూర్తి చక్కగా పోషించాడు. కేవలం కొన్ని పాత్రలతోనే లోతైన సామాజిక సమస్యను ప్రతిభావంతంగా చిత్రించాడు రచయిత రావినూతల ప్రేమకిషోర్.  పాత్రధారులంతా చాలా బాగా చేసారు. బేస్ రఘురామ్ పాత్ర పోషించిన రామకృష్ణారావు తన నెల్లూరు యాసతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ పాత్ర ఉన్నంతసేపూ ప్రేక్షకుల్లో నవ్వులు విరుస్తూనే, అనాథల జీవితాల గురించి అతని మాటలు బాణాల్లా గుచ్చుకునేలా చేస్తాయి. కుటుంబానికి మూలాలెంత అవసరమో, అవి లేనివాళ్ళెంత సంఘర్షణకు గురవుతూ,  ఎలాంటి ప్రశ్నలనెదురుకోవాలో ఆలోచనలో పడేస్తుందా పాత్ర. ధనవంతుడైన మోహన్ పాత్రను మూర్తి బాగా పోషించాడు. పాత్రపోషణలో క్రమపరిణామాన్ని బాగా కనపరిచాడు. కొడుకుగా వేసిన మంజునాథ్ యువకుడిగా ఉండాల్సిన అన్ని లక్షణాల్ని అవగతం చేసుకున్నాడు. అనుభవశాలిగా కనిపించే బాబాయిగా రామశర్మ పొందికగా నటించారు. ఇంటిలో పనివాడు వాసు పాత్రలో అశోక్ తగిన న్యాయాన్ని చేశాడు. 
  బిహెచ్ యి ఎల్ కమ్యూనిటీ హాలు అంతా జనంతో నిండిపోయారు. నాటిక అయ్యేంతవరకు జనం కదల్లేదు. నాటిక ఆలోచనాత్మకంగా ఉంది.
నాటిక రాయడంలో రచయిత మొదటి నుండీ చివరిదాకా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సంభాషణలు తెలుపుతున్నాయి. నాటిక ప్రారంభంలో కొడుకు సుజన్ తల్లితో మాట్లాడుతూ తనతో బయటకొస్తే అమ్మ అనుకోవడం లేదనీ, అక్కలా కనిపిస్తుందని అంటున్నారనీ అంటాడు. ఆ సంభాషణ తర్వాత నాటికకు జీవాన్నిచ్చింది. మోహన్ మరోసారి నిర్మలాదేవి ఇంటికొచ్చి పెళ్ళిచేసుకోమని బ్రతిమలాడే సందర్భంలో కొడుకు సుజన్ చూస్తాడు. తన తల్లి చాటుమాటు పనుల కోసమే అంత అందంగా తయారవుతుందనీ, అందుకేవయసు మీదపడకుండా చూసుకుంటుందనే భావనతో సుజన్ మాట్లాడతాడు. ఇదొక చక్కని రచనా నైపుణ్యం. అలాగే తల్లి తన కొడుకు అనాథ అనుకోకుండా ఏలోటూ లేకుండా పెంచినా, తన తండ్రెవరో చెప్పమని నిలదీస్తాడు. పైగా సుజన్ కి అనాథలంటే చిరాకు. చిత్రంగా చివరకు తాను కూడా అనాథే అని తెలిసేసన్నివేశం చాలా బాగుంది.
ఈ కథ రాయడానికి ప్రేరణేమిటని రచయిత రావినూతల ప్రేమకిషోర్ ని అడిగితే, వాస్తవ సంఘటనే కథకు మూలమని చెప్పారు. తాను హైదరాబాదు ఎస్.ఎస్.సి.బోర్డులో ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు ఒకామె విశాఖపట్టణం నుండి తన కొడుకు టెన్త్ క్లాసు సర్టిఫికెట్ లో పొరపాటుగా పడిన పేరుని సరిచేయించుకోవడానికి వచ్చిందట. నిజానికి ఆమెకీ, ఆమెకున్న ఇద్దరు కొడుకులకూ వయసులో పెద్దతేడా లేనట్లనిపించి, ఆవిషయాన్నే అడిగితే తానొక అనాథనని చెప్పిందట.  తాను నిజంగానే ఇద్దరు పిల్లల్ని పెంచుకుంది. ఆమెను ఒకాయన పెళ్ళిచేసుకుంటానంటే, ఆ తెలిసీ తెలియని వయసులో పెళ్ళిచేసుకున్నా, మళ్ళీ అనాథను కోడలిగా గౌరవించక నిరాదరించారట. అప్పుడు మరలా అనాథాశ్రమానికి చేరుకుందట. ఈ వాస్తవిక జీవితాన్ని కొన్ని మలుపులతో మార్పులు చేసి ‘మాతృక‘ నాటిక రాశానని రచయిత నాకు వివరించారు. 

12 మే, 2016

Prabhakar Boinepally గారి పిహెచ్.డి. బహిరంగ మౌఖిక పరీక్ష దృశ్యాలు


‘తెలుగునాట ప్రసిద్ద కవి పండిత కుటుంబాలు- సాహిత్య సేవ’ అనే అంశంపై నా పర్యవేక్షణలో పరిశోధన చేసిన Prabhakar Boinepally గారి పిహెచ్.డి. బహిరంగ మౌఖిక పరీక్ష 11 మే 2016 వతేదీన తెలుగు డిపార్టుమెంటు సమావేశ మందిరంలో ఉదయం గం.11-30 నిమిషాలకు జరిగింది. పరీక్షకులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రొఫెసర్ గోగినేని యోగప్రభావతిదేవి గారు వచ్చారు.పలువురు పరిశోధక విద్యార్థినీ విద్యార్థులు ఈ మౌఖిక పరీక్షలో పాల్గొన్నారు. మౌఖిక పరీక్ష అనంతరం Prabhakar Boinepallyగార్కి డాక్టరేట్ పట్టా ఇవ్వవచ్చని హైదరాబాదు విశ్వవిద్యాలయం వార్కి కమిటీ సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా Prabhakar Boinepally గార్కి పలువురు అధ్యాపకులు, పరిశోధకులు శుభాకాంక్షలు తెలిపారు. నేను కూడా
Prabhakar Boinepally గార్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఈ రంగంలో విశేషమైన కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను...డా.దార్ల వెంకటేశ్వరరావు
తన పరిశోధనాంశాన్ని వివరిస్తున్న Prabhakar Boinepally,  వేదికపై తెలుగుశాఖాధ్యక్షులు, మౌఖిక పరీక్ష కమిటీ అధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ,పరీక్షకులుగా విచ్చేసిన  ఆచార్య గోగినేని యోగప్రభావతీదేవి పరిశోధన పర్యవేక్షకులు  డా.దార్ల వెంకటేశ్వరరావు ఉన్నారు.

పరీక్షిస్తున్న  ఆచార్య గోగినేని యోగప్రభావతీదేవిగారు

బహిరంగ మౌఖికపరీక్షలో పాల్గొన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు

(ఫోటోలు: బడిగె ఉమేశ్ సౌజన్యంతో...)

28 ఏప్రిల్, 2016

మే 2వతేదీన ‘కువ్వ’ కవితాసంకలనం ఆవిష్కరణ సభ




బోధించు! సమీకరించు! పోరాడు!!!
వర్గీకరణ సంఘీభావ కవిత్వం కువ్వ
ఆవిష్కరణ సభ
తేది: 02-05-2016 : సాయంత్రం 5 గం.లకు సోమవారం
ఆహ్వానం : మాతంగి చిరంజీవి
సభాధ్యక్షులు : డా. దార్ల వెంకటేశ్వరరావు
పుస్తక ఆవిష్కర్త : ఆచార్య కొలకలూరి ఇనాక్
వక్తలు : ఆచార్య గుండెడప్ప కనకయ్య 
జి. లక్ష్మీ నరసయ్య
జూపాక సుభద్ర
గోగు శ్యామల
డా.కోయి కోటేశ్వరరావు 
డా.పసునూరి రవీందర్
జి.మల్లయ్య
స్థలం : షోయబ్ హాల్ 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం,
బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.
బహుజన సాంస్కృతిక వేదిక. తెలంగాణ


22 ఏప్రిల్, 2016

పరిశోధక వ్యాసాలకు ఆహ్వానం

పరిశోధక వ్యాస సంకలనం ప్రచురణ 

'
విహంగ' సాహిత్య పత్రిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య పరిశోధక సాహిత్య వ్యాస సంకలనం( తెలుగు / ఇంగ్లీష్ )  ప్రచురించబడుతున్నది .

నిబంధనలు :
1.
మీకు నచ్చిన అంశం మీద
*
పేజ్ మేకర్ 7 (ఓపెన్ ఫైల్) లో 5 పేజీలకు మించకుండా ,అక్షరదోషాలు లేకుండా వ్యాసాలను పంపాలి .
*
ఫాంట్ ప్రియాంక
ఫాంట్ సైజు -14
*
వ్యాసాన్ని పిడిఎఫ్  ఫార్మేట్ లో కూడా పంపాలి .

2.
మీ వ్యాసాలను ఏప్రెల్ 30 లోపు vihangamagazines@gmail.com కి  పంపాలి.

*
పరిశోధన పత్రంతో పాటు  'ఈ రచన  మీ స్వంతం అనీ , దేనికీ అనువాదం లేదా కాపీ  కాదని ' హామీ పత్రాన్ని జత చేయాలి .

*
భవిష్యత్తులో  వ్యాసాలపై  ఏవైనా  పిర్యాదులు వస్తే  వాటికి  రచయితలే బాధ్యులు .

3 .
పుస్తకం అచ్చు ఖర్చులో  మీ భాగస్వామ్యం 1000 రూపాయలు. ఒకరికి ఒక పుస్తకం మాత్రమే పోస్టులో పంపబడుతుంది .

4.
మీ రుసుముని ఈ క్రింది బ్యాంకు ఖాతాలో జమ చేయవలెను .

Putla Hemalatha
A/c number-010010011018775 0100
Andhra Bank
Danavai peta branch,
branch ph:0883-2442314
rajahmundry. east godavari dist

5.
చివరి తేదీ : ఏప్రెల్ 30 , 2016

6.
అన్ని రకాల సందేహాలకు vihangamagazines@gmail.com  మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు . 
phone number :8500496117

- డా. పుట్ల హేమలత , ఎం .ఎ. పిహెచ్ .డి    
సంపాదకురాలు 


18 మార్చి, 2016

మానవ సంబంధాల పునర్నిర్మాణానికి స్వాగతం (కత్తి పద్మారావు పుస్తకానికి రాసిన ముందుమాట)


                                  -డా॥దార్ల వెంకటేశ్వరరావు,
అసోసియేట్‌ ప్రొఫెసరు, తెలుగుశాఖ,
స్కూల్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌,
హైదరాబాద్‌ -500 046, 
దళిత సాహిత్య, సామాజిక ఉద్యమాలలో పరిచయం అక్కర లేని నాయకుడు డా॥ కత్తి పద్మా రావు గారు. సంస్కృతాంధ్ర సాహిత్యాలలో లోతైనా అవగాహన ఉన్న సాహితీ వేత్త పద్మా రావు గారు. డా॥ బి. ఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని తెలుగు నేలపై నాలుగు వైపుల వ్యాపింపజేసిన ఉద్యమకారుడు. జ్యోతి బాపులే, పెరియార్ రామస్వామి నాయకర్ భావాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో పద్మా రావుగారి పాత్ర అనిర్వచనీయం. అంబేద్కర్ సాధించిన హక్కులను ప్రసరించిన భావాలను సామాన్యులకు కూడా తమ రచనల ద్వారా తీసుకొచ్చిన పరిశోధకుడు పద్మారావు గారు.
డా॥కత్తి పద్మారావు గారి ప్రసంగం ఒక జలపాతం ఉంటుంది. పరిశోధన శాస్త్రీయంగా ఉంటుంది. ఈయన కవిత్వం మట్టి పరిమళాల్ని అందిస్తున్నట్లుంది. ఈ మధ్య ఈయన కవిత్వాన్ని విస్తృతంగా రాస్తున్నారు. దీనిలో భాగంగా ‘‘ఈ యుగం మాది’’ పేరుతో ఒక కవితా సంపుటిని ప్రచురిస్తూ, నా అభిప్రాయాన్ని  రాయమన్నారు. అలా నన్ను అడగడం ఆయన నన్ను గౌరవించడంగా భావిస్తున్నాను.
దళితులంతా వ్యవస్థీకృతమై, ఒకే కంఠంగా కవి రూపంలో ‘‘ఈ యుగం మాది’’ అని ఆత్మ గౌరవంతో ప్రకటిస్తున్న దానికి ప్రతీకగా ఈ కవితల్ని చెప్పుకోవచ్చు. ఆదిమ సమాజం నుండి నేటి ఆధునిక సమాజం వరకు భూమికోసం పోరాటం జరుగుతూనే ఉంది. మత్స్య న్యాయం భూమిని వశం చేసుకుంటుంది. భూమిని నమ్ముకొన్న వాడికంటే, అమ్ముకున్న వాడే జీవన సంఘర్షణతో మిగులుతున్నాడు. చాలామంది నీతికి, న్యాయానికి వక్ర భాష్యాలు చెప్తున్నారు. పునర్నిర్మాణం పేరుతో ప్రపంచీకరణను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మానవ సంబంధాల కంటే వ్యాపార సంబంధాలే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. దీన్ని కవి ‘‘భూమిని తవ్వుతున్న వాడికి/ రంగు రాళ్లు దొరుకుతున్నాయి/భూమిని నమ్ముకున్నవాడికి/అస్థికలు మిగులుతున్నాయి/ అప్పు ఒక్కటే/ఇప్పుడు దేశాభివృద్ధి సూత్రం ’’ అని ప్రపంచీకరణ ప్రభావ పాలనను, వాటి తీరు తెన్నులను వ్యంగ్యంగా తూర్పార పడుతున్నాడు కవి. ఈ స్థితిలో దేశ పునర్నిర్మాణంలో కూడా మానవ సంబంధాల పునర్నిర్మాణమే ముఖ్యమని ప్రబోధిస్తూ ‘ప్రేమ, కరుణ ఒక్కటే/ మనిషిని పునర్నిర్మిస్తాయి/ అదే నిజమైన పునర్నిర్మాణం.’  అని ప్రబోధించిన కవితతో ‘ఈ యుగం మాది’  కవితా సంపుటి ప్రారంభమవుతుంది.
మానవ సంబంధాల పునర్నిర్మాణంలో సామాజికీకరణ (socialization) ప్రక్రియ ముఖ్యమైంది. అది కుటుంబంలో మొదలవ్వాలి, మాతృభాషతో అంకురించాలి. భాష ఒక చైతన్య వాహిని. పర భాషలో ఎంత ప్రావీణ్యం ఉన్నా ఏదేశ ప్రజలకైనా ఆ దేశ స్థానిక భాషలే శక్తివంతమైన భావవాహిక సాధనాలు. ఆ సాధనాల్ని అందుకునేది తల్లి ద్వారానే మొదలవ్వాలి. అప్పుడే ప్రజల్లో నిజమైన చైతన్యం విల్లవిరుస్తుంది. లేక పోతే ప్రజలకు అర్థం కాని భాషల్లో చట్టాలు వచ్చి, సామాన్య ప్రజల్ని అయోమయంలో పడేస్తాయి. అందువల్ల మాతృ భాషలో మాట్లాడటం, విద్యాభ్యాసం కొన సాగించటం, చట్టాలు ఆ మాతృ భాషలోనే వెలువడటం మొదలైన పనులు జరగాలి. అలాంటప్పుడే ఆ సమాజం నిజంగా చైతన్యవంతమవుతుంది. అందుకే కవి ‘ప్రతి తల్లి భాష శాస్ర్తవేత్త/ బిడ్డకు నేర్పేటప్పుడు తల్లి భాష  సజీవమవుతుంది/ తల్లిది కొత్త భాష/ ప్రతి ముళ్ల దారిని పూల దారి చేస్తుంది/ ఆ  సౌగంధ్య  పరిమళం నన్ను నడిపిస్తుంది.’ అని భాష గొప్పతనాన్ని చెప్తూనే మాతృభాష మనిషిని పునరుజ్జీవింపజేస్తుందంటాడు కవి. ఈ కవితను లక్ష్యార్థంలో చూసినప్పుడు ప్రేమాను రాగాలు వెల్లివిరిసే మానవుణ్ణి ప్రభవవింప జేసే శక్తి ఆధునిక భాషలోనే ఉందని, అది మమతానుబంధాల భాషగా అర్థం చేసుకోవాలి. అందుకనే కవి ‘సహచర్యంలోని భాష/మనిషిని ప్రజ్వలితం చేస్తుంది/ సమకాలీనమైంది/ప్రతీది రాగ బంధమైతే ఎన్ని సముజ్వల కాంతులు/ ఉజ్వలించాలన్న మనిషికి సచేతనంలోనే సాధ్యం.’  అనడం ద్వారా నిరంతర మమ తాను బంధాల సృజనాత్మక అభివ్యక్తులు కవిత్వ శక్తిగా జాతిని ఉత్తేజితం చేయాలంటాడు కవి.
పద్మా రావు గారు చాలా కవితల్లో తాత్వికాంశాలను భావ చిత్రాలుగా అందిస్తారు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని వర్ణింస్తున్నట్లే ఉంటారు కానీ, వాటి ద్వారా తాత్త్విక అర్థాన్ని మన ముందుంచుతారు. ‘కడలి సుడులు సుడులుగా/ తిరుగుతున్నప్పుడు/ మనం కన్నార్పకుండా  చూస్తాం/ అందులో అలజడి ఉంది/ అనేక ప్రకృతిలో తీవ్రతలు/ మనల్ని ప్రకంపనలకు గురిచేస్తాయి’  ఇది సముద్రం ఒడ్డునున్న ప్రతి ఒక్కరికీ కనిపించే దృశ్యమే. కానీ, ఆ కడలి సుడి అలజడిని, ప్రకృతిని కవి తన హృదయ స్పందనతో వర్ణించటం గొప్ప భావ చిత్రం. దాని కీలకాంశాన్ని తర్వాత వర్ణిస్తాడు కవి. ‘మంచు కరుగుతున్నట్టు/ కనిపిస్తూ వుంటుంది/ దాని అంతరంగం ఇనుముకంటే కఠినమైనది’’ ఇలా వర్ణించుకుంటూ                            ‘‘ మనసులో నుండి వచ్చే ఒక నవ్వు/ చెట్టు పూసినంత పరిమళంగా ఉంటుంది/దాని అంతరంగం /ఇనుముకంటే కఠినమైంది/ ఇనుమును పరికరం చేయడానికి/ఒక కొలిమి కావాల్సి వుంటుంది’’ ఎక్కువ మంది ప్రతి స్పందించాల్సినంత స్పందించరు/ ప్రతి స్పందన యాదృచ్ఛికం/ స్పందన హృదయ గతమైంది’’ అంటాడు కవి.
కవి ప్రకృతిలోని అంశాలను అంటే కడలి, సుడులు వంటి మూర్త పదార్థాలను అమూర్తమైన వస్తువులతో కవిత్వీకరించాడు. కవి  స్పందన కడలి స్పందన లాంటిది. మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ, అది అందరికీ కనిపించదు. ఇలా ప్రకృతిలోని అనేక అంశాలను ఇంద్రియానుభూతితో మనకి తాత్వికంగా రుచి చూపిస్తాడు కవి. చివరికి అంటాడు ‘ప్రక్తలందరు మాటల్ని సంక్షిప్తంగా పలికారు/కవులంతా విస్తృతంగా పలికారు/ మాటలన్నీ మారుతూ వస్తున్నాయి/ భావం మారడం లేదు/తడి, అలజడి/ అవ్వక్తమైనవే అయినా / అనంత జీవన స్రవంతికి ఈ సంఘర్షణే ఆయువు’ అనడం కవిత్వాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళడమే. నిరంతరసంఘర్షణే ఈ ప్రపంచమంతా ఇంతసుందరంగా ఉండడానికి కారణం. అదొక చైతన్యం. ఆ ఆచైతన్యాన్ని అందుకోవాలనీ, ప్రతి మనిషీ నిత్యచైతన్యశీలాన్ని కలిగుండాలంటాడు. ప్రకృతినే దీనికి ఉదాహరణగా చూపిస్తాడు. ప్రకృతి ఒక్కక్షణం ఆగిపోతే ఏమవుతుందో ఆలోచించండి. అన్నీ స్తంభించిపోతాయి. వాటి పని అవి చేసుకుంటూనే పోతున్నాయి. అలా మానవుడు కూడా నిత్య ప్రవాహినిలా మారాలంటాడుకవి.  ఇదంతా ప్రకృతి నుండి పండిన తాత్వికార్థం. పద్మా రావు గారి కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక తాత్త్విక లోకంలో విహరించాలి. తాత్త్విక లోకంలో వివహరిస్తూ, సమాజచైతన్యాన్ని నింపే తాత్త్వికమైన కవిత్వం అవుతాడు. అందుకనే ఈయన విడివిడిగా రాసిన కవితాఖండికలన్నీ ఒక మహా అర్థాన్ని స్ఫురించే కావ్యాల్లా  ఉంటాయి. కాకపోతే వాటిని దేని వెనుక ఏది ఉండాలో జాగ్రత్తగా అమర్చుకోగలగాలి. అప్పుడు ఇవి కవిత ఖండికలు కావని, తాత్త్విక కావ్యంలోని బాగాలేనని అర్థమవుతుంది.
మార్పు అంటే ఏమిటని తనను తాను ప్రశ్నించుకోవాలి. అదే చేశాడీకవి ‘విజేతలంతా దీర్ఘయాత్రికులే’’ కవితలో. బుద్ధుడు తన విద్యను జ్ఞానంగా మార్చాడు. కనకనే, కరుణ, హింసల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలిగి, వాటన్నింటినీ జయించగలిగి, తర్క,మీమాంసలకంటే ఆచరణాత్మకమైన ప్రేమముఖ్యమని చాటగలిగాడు. అదే విద్య. అదే జ్ఙానం. ‘‘ఈ తొలకరిలో /విత్తుమీద కురిసిన వర్షం /ఒక ప్రభవానికి మూలమైతే/ భావోజ్జ్వనం కూడా మార్పుకి సంకేతమే’’ అని భావించాలంటాడు కవి. అయితే ఆ మార్పు తాత్కాలిక, వ్యక్తిగత ప్రయోజనాలతో కూడిందా? శాశ్వతమైన, వ్యవస్థీకృత ప్రయోజనాలను ఆశించిందా అనేదీ ముఖ్యమే. అందుకే అంటాడు కవి ‘‘పిడికెడు అన్నం కోసమే అయితే/నాలుగు అడుగులు వేస్తేచాలు/ పిడికెడు ప్రేమకోసమే అయితే/ఎక్కవలసింది హిమాలయాలే’’ నని ప్రకటిస్తాడు. అలా చేసినవాడే ఒక బుద్ధుడు. అలా చేసినవాడే సోక్రటీసు. వీళ్ళంతా విజేతలు. విజేతలు అలిసిపోకూడదంటూ‘‘ ప్రతి సంఘర్షణ ఒక ప్రకంపనం/ ప్రతి ప్రయాణం ఒక అనుభూతే’’ అని ప్రవచించడంలో గొప్ప తాత్త్విక స్ఫూర్తి ఉంది.
 తను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించడం కోసం అంబేద్కర్ చూపుడు వేలు ఒక చుక్కానిలా దారి చూపిస్తుందని చెబుతూ సమాజంలో అంతరాంతరాల్లో దాగిన ఆత్మీయతను మానవులందరికి పంచటానికి ప్రేమను, కరుణను అందించాల్సిన అవసరాన్ని ప్రబోధిస్తాడు కవి. అందుకే ‘ఒక దీక్ష ఒక తపన ధర్మావేశంలో చూపుడు వేలు చుక్కాని వైపే నా ప్రయాణం’ అని తన లక్ష్యాన్ని కవిత్వం ద్వారా ప్రకటిస్తాడు కవి.
కవి సమాజంలో జరుగుతున్న అనేక అన్యాయాలకు స్పందించాడు. ఆ స్పందన వ్యక్తిగతంగా కాకుండా ఒక అభ్యుదయవాదిగా, ఒక ఆత్మగౌరవనినాదంగా సామాజికీకరణలో భాగంగా కవిత్వమై స్పందించాడు. ఒక వైపు ముంచుకొస్తున్న ప్రపంచీకరణ, దాని దుష్ఫలితాలను గుర్తిస్తూనే వాటిని దీటుగా ఎదుర్కొనటానికి కావాల్సిన ఆలోచనలను అందించే ఒక యోధుడుగా మానవుడు మారాలంటాడు కవి. భిన్న వైరుధ్యాలు ఉన్న సమాజంలో జీవిస్తూ, ఆ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి సమకాలీన సమాజాన్ని దర్శించాలి. అప్పుడు మాత్రమే ఆ సమాజంతో నిత్య చైతన్యవంతమైన మనిషి ‘ఈ యుగం నాది’ అంటాడు. అతడు చైతన్యవంతంగా లేకపోతే ఒక పలాయన వాదిగా మిగిలి పోతాడు. అలా మిగలిపోవడానికి ఇష్టం లేని వాళ్ళంతా స్పందించాలి. అలాంటి వాళ్ళే ఈ యుగం నాదంటారు. ఆ భాగాల్ని తాత్త్వికార్థంలో అందించిన  డా॥ కత్తి పద్మారావు గారు అందరికి అర్థమవుతారని నేను అనుకోను. అలా చాలా వరకు అర్ధం కాని వారిలో నేను ఒకణ్ణి కూడా కావచ్చు. అయితే, కత్తి పద్మారావుగారి కవిత్వాన్ని నాకు అర్థమైనంతవరకు నా అభిప్రాయాలను చెప్పడానికి ప్రయత్నించాను.


హైదరాబాదు,                                                                                         డా॥దార్ల వెంకటేశ్వరరావు,

18 మార్చి 2016.

17 మార్చి, 2016

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులతో దార్ల

(ది.16 మార్చి 2016 వతేదీన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో పరిశోధక విద్యార్థి శ్రీ పవన్ కుమార్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ను సీనియర్ రీసెర్చ్ ఫెలోషిఫ్ గా అప్ గ్రేడ్ చేసేందుకు విషయ నిపుణుడిగా వెళ్లాను. అక్కడ ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి పర్యవేక్షణలో శ్రీ పవన్ కుమార్ ‘తెలుగు కవిత్వంపై ప్రపంచీకరణ ప్రభావం’ అనే అంశంపై పిహెచ్.డి, పరిశోధన చేస్తున్నాడు. ఆ సందర్భంగా  ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారితో పాటు తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య మునిరత్నమ్మగారు, ఆచార్య రాజేశ్వరమ్మగార్లతో దిగిన ఫోటో కింద గమనించవచ్చు. )

13 జనవరి, 2016

‘నెమలికన్నులు’తో అస్తిత్వానంతర కవిత్వంలోకి డా. దార్ల -డా. కృష్ణ కదిరె

అస్తిత్వానంతర కవిత్వంలోకి డా. దార్ల
మిత్రుడు దార్ల వెంకటేశ్వరరావు‘నెమలికన్నులు’ పేరుతో తనఖాతాలోకి మరోకావ్యాన్ని చేర్చారు. సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదులో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దార్ల అదే యూనివర్సిటీలో తన ఉన్నత విద్యనంతా పూర్తి చేశారు. విగతదేహి నాగప్పగారి సుందర్రాజు బృందంతో కలిసి విద్యార్థి దశ నుండీ సాహిత్య, సామాజిక ఉద్యమాల్లో దార్ల పాల్గొన్నారు. దళిత తాత్త్వికుడిగా పేరుపొందిన దార్ల, పరిశోధన రంగంలోనూ విశేషంగా కృషిచేశారు. ఇటీవలే బహుజన సాహిత్య దృక్పథాన్ని ఒకపుస్తక రూపంలో గొప్పగా అందించారు. సహృదయుడు, సాత్వికుడు, సూక్ష్మపరిశీలనా దృష్టి గల దార్ల లోకాన్ని నెమలికన్నులతో ఎక్సరేతీస్తూ ఈ కవితా సంపుటి రూపంలో అనుభూతుల ఐక్యతా సమ్మేళనాల రిపోర్టుని అందిస్తున్నాడు. తన దర్జాకు, తన గౌరవానికీ కారకులైన తన తల్లిదండ్రులతో పాటు, తాను పుట్టి పెరిగిన సమాజాన్నీ అమితంగా ప్రేమించే మంచి స్నేహితుడు నాకు లభించడం నాకెంతగానో గర్వంగా ఉంది.
హృదయం కరిగిపోయే కవితాపంక్తులు దార్ల కవిత్వంలో అలవోకగా వచ్చిచేరిపోతాయి. ఆలోచన, భయం, విస్మయం కలగలిసిన ఈ కవితాపంక్తులు గమనించండి.
‘‘నాకు తెలీదు
అమ్మ గర్భంలోనైనా
అవమానానికి దూరంగా ఉన్నానో లేదో’’  ఈ మాటలు చదువుతున్నప్పుడు జీవితంలో అనుభవించిన అవమానాల తీవ్రత కళ్ళముందు కదలాడింది. కొద్దిసేపు స్తంభించిపోయాను. తల్లిగర్భంలో ఉండగానే అవమానాలు పురుడుపోసుకునే దేశంలో పుట్టానా అనిపించింది. లోకంమీద పుట్టిన తర్వాత మనిషి తెలుసుకోవాలనుకోవడంతోనే జీవితం ప్రారంభమవుతుంది.కడుపు నింపుకోవడానికి తల్లి స్తనాన్ని వెతుక్కోవడం, జన్మనిచ్చిన స్త్రీని ఏమని పిలవాలో తెలుసుకోవడం/నేర్చుకోవడం ఇలాంటివెన్నో.అలాగే విద్య నేర్చుకోవడం కూడా.కానీ, అది కొందరికి ఇక్కడ నిషిద్ధం! కొన్ని చోట్లకి ప్రవేశమే ఉండదు. అది గుడి, బడి కావడమే దుర్మార్గం. కొన్నివేల సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బిసి, ప్రజల్లో చదువుపట్ల తపన ఎలా గూడుకట్టుకుపోయిందో  ఈ కవి సరళాత్మక, కవితాత్మక పంక్తులు తెలియజేస్తున్నాయి.
‘‘ఏదైనా మాయో మంత్రమో,
యంత్రమోవుంటే బావుణ్ణు
తొందరగా గ్రంథాలయంలోని
పుస్తకాలన్నీ ఔపోసన పట్టేసేవాణ్ణి!’’ ఈ గాఢమైన తృష్ణ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా తీరింది. ఇప్పుడు దార్ల విద్యావేత్త, పండితుడు. అన్నింటికీ మించి ఒక బాధితుడు. అందుకే ఆకలి జయించి పండితుడైతే కన్నతలి, ఆ నేలా పులకించక మానతాయా? కనుకనే ‘‘మాడ్చుకుని తిన్న ఆకలి/మా అమ్మ పాదాలపై పడి ఏడుస్తుందిప్పుడు’’ అంటున్నాడు కవి. డా. అంబేడ్కర్, ఫూలే ఇదే కోరుకున్నారు. తన తండ్రి కష్టం, తన తాత ( అంబేడ్కర్) శ్రమ ఫలించింది.  తన కుటుంబంలో ఆనాడు తిష్టవేసి కూర్చొన్న వేదనను ‘‘ ఆ చీకట్లో అర్జునుడు /అన్నం ముద్ద సరిగ్గా తిన్నాడో లేదో గానీ/ కాళరాత్రుల్లోనూ మానాన్న వేసే గునపం పోట్లకి/పెరుగుగడ్డలా విరిగిపడే మట్టిబెడ్డల’’ బరువును దించేశాడు. కథ సుఖాంతం కాలేదు. తల్లి తండ్రుల తీరని తీరని  రుణం కొంత చిర్నవ్వు చిలకరించినా తాను పుట్టి పెరిగిన సమాజం కోసం ఆలోచించినప్పుడే బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి రుణం తీరుతుంది. ఆయనిచ్చిన చైతన్యంతో డా.దార్ల ‘‘ ఎన్నిసార్లు చంపుతావంటూ /దేవుణ్ణే కాలర్ పట్టుకొని’ అడుగుతున్నాడు. మతం ముసుగులో జాతులు విధ్వంసాన్ని చూపుడువేలుతో ప్రశ్నిస్తున్నాడు. ‘‘వంశపారంపర్యంగా దళిత కుటుంబాలవాళ్ళే /దేవుడి పెళ్ళాలుగా’’ మారాల్సిన దుస్థితి సమాజంలో నెలకొనడాన్ని దుర్మార్గమని గొంతువిప్పి, పిడికిలి బిగించి హెచ్చరిస్తున్నాడు. ధైర్యం కేవలం పిరికితనాన్నే కాదు; పీడనను కూడా పారద్రోలుతుంది. అది విద్యవల్ల అబ్బుతుంది. అది అంబేడ్కర్, ఫూలే, పెరియార్, కాన్సీరామ్ లకు పుష్కలంగా ఉంది. అదే ఆనవాలు దార్లలోను కనిపిస్తుంది సహజంగానే!
డా.దార్ల వెంకటేశ్వరరావు అస్తిత్వానంతర కవి. విప్లవం తర్వాత జరిగే పరిణామాలు మరో విప్లవాన్కి దారితీస్తాయి. విప్లవంలో ఎన్నో విప్లవాలు పుట్టాల్సి ఉంటుంది. సమాజం తుది రూపుదిద్దుకొనేవరకు ప్రారంభవిప్లవం నుండి విజయోత్సవ పలుకుల వరకు ఎన్నోదశలు ఉంటాయి. పరిపూర్త విప్లవం ఇంకా చరిత్ర అనుభవంలోని రాని విషయం. ఈ దరిమిలా పరిశీలిస్తే అస్తిత్వంలో పుట్టి, నిర్మాణంలో పాత్రధారిగా డా.దార్ల దర్శనమిస్తాడు. బహుజన సాహిత్య దృక్పథం దీనిలో భాగమే. కవితాసౌందర్యం కేవలం బ్రాహ్మణసాహిత్యంలో ఉంటుందన్న అబద్దపు ప్రచారాన్కి డా.దార్ల అడ్డుకట్టవేశాడీ కవిత్వంలో. చూడండి నావైపు ‘‘పొద్దున్నే భుజాన్నెక్కుతున్న సూర్యుడు /రైలు దిగినప్పుడు వెన్నెలవుతాడు’’ అంటాడు. సూర్యుడు చంద్రుడు కావడమేంటి? అదే ఈస్తటిక్స్. పొద్దస్తమానూ పోరాటాలు, ఆరాటాలతో గడిపినా సాయంత్రం కలిసిమెలిసి ఉన్నదాంతోనే సుఖసంతోషాలతో గడిపే ఎస్సీ,ఎస్టీ, బిసి కులాల జీవన సౌందర్యమంతా దీనిలోఒక చక్కని భావచిత్రంలా అందించాడు కవి. పొద్దస్తమానం పనిచేసిన శ్రామికురాలు సాయంత్రం ఆ ‘గాయాల చేతుల్తోనే కారం పచ్చడి నూరుతున్న తల్లి  వదనంలో ’’ నిజమైన ఈస్తటిక్స్ ని చూడమంటున్నాడు. ‘సింహదరహాసనమయ్యే కుక్కపిల్ల’, ‘సూర్యకిరణ స్నానం’ వంటి వాక్యాలు ఈ కవితాసంపుటిలో కోకొల్లలు. ‘‘నాపుట్టుమచ్చమాత్రం/నాకు రక్షణ కవచమేన’’నడంలో కవితాత్మకతను చూడండి. ‘పుస్తకమై పుట్టాలనే కోరిక’లో ఎంత సౌందర్యం ఉందో తరతరాలుగా అక్షరాలకు దూరమైన వారి వేదన తెలసినప్పుడు ‘ఆహా!’ అనకుండా ఉండగలమా? సామాజిక రుగ్మతలు, మూఢవిశ్వాసాలు, కులాధిపత్యాలను ఎదుర్కోవడానికి చారిత్రకంగా జరుగుతున్న యుద్ధంలో ఒరిగిపోయిన వీరుల సమాధులు అడిగే ప్రశ్నల భాషను పరిష్కరించడానికి ఈ కవి చేసే ప్రయత్నం కొత్తభాషనూ పుట్టించొచ్చేమో!  ఎంతైనా ఒక తెలివైన మాదిగోణ్ణుండి ఒక బహుజన శిల్పకారుడిగా మారిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వైయక్తికత నుండి వ్యవస్థీకృతంవైపు పయనించడంలోనే బహజన హితాయం, బహుజన సుఖాయ అనేది సార్థకం కానుంది. దార్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలతో... సబ్బమంగళం!!

-
డా. కృష్ణ కదిరె, మొబల్ : 09505251975 

10 జనవరి, 2016

నా కవిత్వం ‘‘నెమలికన్నులు’’ కవితా సంపుటిగా రాబోతోంది

ఈ వారంలో నా కవిత్వం ‘‘నెమలికన్నులు’’ కవితా సంపుటిగా రాబోతోంది.నా కవిత్వం గురించి చాలా మంది గతంలో రాసిన అభిప్రాయాలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించాను.  దీనికి ముఖచిత్రంగా  ప్రసిద్ధ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ గారు అర్ధవంతమైన కవర్ పెయింటింగ్ వేసిచ్చారు.  ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



. నెమలికన్నులు  ముఖచిత్రం పై ఉన్న పెయింటింగ్ అంతరార్థమేమై ఉంటుందనే దానికి  డా.మల్లెగోడ గంగా ప్రసాద్ తన ఫేస్ బుక్ లో ఇలా వ్యాఖ్యానించారు. దాన్నిక్కడ పునర్ముద్రిస్తున్నాను. 
డా. మల్లెగోడ గంగా ప్రసాద్ Facebook లో రాసిన వ్యాఖ్యలను కింద పునర్ముద్రిస్తున్నాను.


భారతీయ సామాజిక వ్యవస్థ ప్రధానంగా చాతుర్వర్ణమూలాల్ని కలిగి నిర్మితమైంది. దానికి అనుబంధంగా వచ్చిందే పంచమవర్ణం. వీటిని ప్రతీకాత్మకంగా చిత్రకారుడు జంతువుల్ని చిత్రించి ఉండొచ్చు.
  • చాతుర్వర్ణం నుండే రకరకాల ఉపకులాలు మళ్ళీమళ్ళీ పుట్టుకొచ్చినా, వాటిలో ‘ పంచమవర్ణం’ సమాజానికి దూరంగా నెట్టివేయబడింది. దీన్ని విడిగా దూరంగా ఉన్న జంతువు ప్రాతినిథ్యం వహిస్తుందనుకుంటున్నాను.
  • భారతదేశంలోని సాంఘికహోదానీ, ఆర్థిక, రాజకీయాధికారాలను అనుభవిస్తూ విలాసవంతంగా జీవించే లక్షణాలున్న వర్ణాలవారిని నాలుగు జంతువుల్లోను చిత్రకారుడు చిత్రించి ఉండొచ్చు. వీటిని వాటి కొమ్ములకున్న రకరకాల రంగుల ద్వారాను, వాటి శరీరఛాయ, వాటి హావభావాల ద్వారా గమనించేలా చేశాడనుకుంటున్నాను.
  • నాలుగు బలిసిన దున్నపోతులు అలంకరించుకొని సమాజాన్ని ఆక్రమించుకొన్నస్థితి చిత్రంలో కనిపిస్తుంది. ఒకటి మాత్రమే విడిగా ఉంది. దానికి ఎలాంటి అలంకరణా లేదు. దాని కళ్ళల్లో విషాదం తొణికిసలాడుతున్నట్లుంది.
  • ఒక బాలుడు కర్రపట్టుకొని మార్గానికి అడ్డంగా నిలబడిన ఆ పశువుల్ని విదిలిస్తున్నాడు.
  • ఆ బాలుడు నీలిరంగు నిక్కరు , ఎరుపురంగు చొక్కాలను ధరించాడు. నీలిరంగు అంబేద్కరిజానికీ, ఎరుపురంగు కమ్యూనిజానికీ ప్రతీకలుగా చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్నవాళ్ళు కమ్యూనిస్టులైతే, ప్రజాస్వామిక పంథానే ప్రధానం చేసుకొని ఉద్యమాలు చేస్తున్నవాళ్ళు అంబేడ్కరిస్టులు.
  • అడ్డంగా నిలబడిన పశువుల్ని బాలుడు తన చేతిలో ఉన్న కర్రతో విదిలిస్తున్నాడు.
  • దూరంగా కనిపిస్తున్న ఊరు, ఇళ్ళు, పక్కన పచ్చనిపొలాలు... వాటివైపు ఈ నాలుగు పశువులు దృష్టిని కేంద్రీకరించాయి. వాటిని కర్రతో కొడుతూ బాలుడున్నాడు. భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు రాజకీయాల ద్వారా ఆ గ్రామాన్నీ, ఆ ఇళ్ళనీ, ఆ పచ్చదనాన్నీ తామెలా స్వాధీనం చేసుకోవాలో ఆలోచిస్తున్న నాలుగు వర్ణాల వారు ఆలోచిస్తున్నట్లుంది. దాన్ని నెరవేరనివ్వనన్నట్లు బాలుడి చేతిలోని కర్ర కనిపిస్తుంది.
  • తాగడానికి కొన్నినీళ్ళు, కట్టుకోవడానికి బట్ట ఉన్న ఆ బాలుడు తినడానికి భుజాన తువ్వాల్లో ఏదొక ఆహారపదార్థం మూటకట్టుకున్నాడు.
  • ఆ బాలుడు చదువుకున్న కవి, రోడ్డుకడ్డంగా నిలబడ్డ పశువులు ఊరుని నాశనం చేయాలనుకునే ఆధిపత్యవర్ణాలు, వర్గాలు గా చెప్పుకోవచ్చుననుకుంటున్నాను. నెమలికన్నులు కవిత్వంలో ఉన్న వస్తువు అంతా దీన్ని ప్రతీకాత్మకం చేసేలా చిత్రకారుడు చిత్రించాడనుకుంటున్నాను. 

07 అక్టోబర్, 2015

ఉమేశ్, సుమలతలకు శుభాకాంక్షలు

ఎం.ఏ.తెలుగులో గోల్డ్ మెడల్ సాధించిన సుమలతకు శుభాకాంక్షలు. సుమలత  ప్రస్తుతం నాదగ్గర ‘మను-వసు చరిత్రలపై వచ్చిన విమర్శల గురించి పరిశోధన చేస్తుంది. 

బడిగె ఉమేశ్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ పీఠికలపై నా పర్యవేక్షణలో ఎం.ఫిల్ చేసి డిగ్రీ అందుకున్న సందర్భంగా నాశుభాకాంక్షలు

నేను, చంద్రమౌళి, సుమలత, నా భార్య డా. మంజుశ్రీ



29 జులై, 2015

స్కైబాబా సాహిత్యంపై సదస్సు (27-28, ఆగస్టు 2015)

సభాధ్యక్షత వహించిన డా. దార్ల వెంకటేశ్వరరావు, పత్రసమర్పణ చేస్తున్న డా.షాజహానా, వేదికపై పత్ర సమర్పకులు డా.గాదె వెంకటేశ్, బి.నారాయణ మూర్తి, పెద్దింటి అశోక్ కుమార్, సమావేశ కర్త డా.పసునూరి రవీందర్ తదితరులు వేదికపై ఉన్నారు. నాటి అధ్యక్షోపన్యాసాన్ని 
ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా చదవగలుగుతారు.

సదస్సులో పాల్గొన్న కొంతమంది పరిశోధకులు, విద్యార్థులు

24 ఏప్రిల్, 2015

ఆచార్య నాంచారయ్యగార్కి వీడ్కోలు సభ-సన్మానం

ఆచార్య నాంచారయ్యగార్ని ఎస్.సి. ఎస్.టి. టీచర్స్ ఫోరమ్ తరపున సత్కరిస్తున్న ఆచార్య చంద్రశేఖరరావుగారు, ఆచార్య ప్రకాశ్ బాబుగార్లు. చిత్రంలో ఆచార్య నాంచారయ్యగారితో పాటు వారి సతీమణి కూడా ఉన్నారు.

ఆచార్య నాంచారయ్యగార్ని ఎస్.సి. ఎస్.టి. టీచర్స్ ఫోరమ్ తరపున సత్కరిస్తున్న ఆచార్య చంద్రశేఖరరావుగారు, ఆచార్య ప్రకాశ్ బాబుగారు, బుద్దుని ప్రతిమను బహుకరిస్తున్న డా. నాగేశ్వరరావుగార్లు. చిత్రంలో ఆచార్య నాంచారయ్యగారితో పాటు వారి సతీమణి కూడా ఉన్నారు.

సభాధ్యక్షత వహించిన ఆచార్య ప్రకాశ్ బాబు గారు

మాట్లాడుతున్న ఆచార్య శ్రీపతిరాముడుగారు

మాట్లాడుతున్న డా. నాగేశ్వరరావుగారు

ఆచార్య నాంచారయ్య గారితో  డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. నాగేశ్వరరావు గార్లు చిత్రంలో ఉన్నారు


మాట్లాడుతున్న ఆచార్య కె.వై.రత్నంగారు
ఆచార్య నాంచారయ్య గారితో ఆచార్య చంద్రశేఖరరావుగారు, డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. నాగేశ్వరరావు, డా. రామదాస్ గార్లు


స్పందన తెలుపుతున్న ఆచార్య నాంచారయ్యగారు

స్పందన తెలుపుతున్న ఆచార్య నాంచారయ్యగారు

స్పందన తెలుపుతున్న ఆచార్య నాంచారయ్యగారు

వీడ్కోలు పలుకుతున్న అధ్యాపకవర్గం
ఆచార్య నాంచారయ్య గారితో  డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. నాగేశ్వరరావు, డా. రామదాస్ గార్లు

గ్రూపుఫోటో

గ్రూపు ఫోటో

భోజనాల సమయంలో

( ఫోటోలు తీసిన డా. వసంత శ్రీనివాసరావుగార్కి కృతజ్ఞతలతో...)

06 మార్చి, 2015

శెహబాస్ సూర్య పత్రిక యాజమాన్యం....

సాధారణంగా కొన్ని పత్రికల్లో పనిచేసేవాళ్ళు చనిపోతే ఆ పత్రికలో  ఆ వార్తకు కూడా నోచుకోని వాళ్ళెంతోమంది ఉన్నారు. కొన్ని పత్రికలు మాత్రం పనిచేసే సిబ్బంధి క్యాడర్ ని బట్టి ప్రాధాన్యాన్నిస్తుంటాయి. సూర్య పత్రిక మాత్రం నిన్న చనిపోయిన ఎడిట్ పేజీ ఇన్ చార్జి శ్రీ హరనాథ్ గారి మరణానికి చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. రెండవపేజీలో కలర్ ఫోటోలతో వార్తను రాసింది. 

అంతేకాకుండా  పత్రిక చైర్మన్ , ఎడిటర్, డైరెక్టర్ తదితర సిబ్బంది వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన వార్త కూడా వేశారు. అంతేకాకుండా ఇంటర్నెట్ ఎడిషన్ లో శ్రీ హరనాథ్ గారికి నివాళి అర్పిస్తూ ఫోటో పెట్టారు. 
ఇంటర్నెట్ ఎడిషన్ లో శ్రీ హరినాథ్ గారికి నివాళి అర్పిస్తూ పెట్టిన ఫోటో
తమ పత్రికకోసం పనిచేసిన వ్యక్తి చనిపోతే ఈ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా వాళ్ళకిచ్చే నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. సూర్య పత్రిక యాజమాన్యాన్ని, సిబ్బందినీ అభినందిస్తున్నాను....