"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

పద్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పద్యాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

08 జూన్, 2026

జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం (National Best Friends Day) జూన్, 8.

 జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం (National Best Friends Day) జూన్, 8.


కపట బుద్ధి లేక కలుషంబు లరయక

మనసు విప్పి మాటలాడువాడు

ధనము కన్న మిన్న ధరణిలో మిత్రుడు

నమ్మదగినవాడు నరుడు గాడె.


కష్టకాలము నందున కాచి నిలిచి

తోడు నీడగ నిలిచెడి తోడబుట్టు

మదిని దాచక కూరిమి బంచువాడు

ఇలను జూడగ నాతడె యిష్టుడౌను.


ధనము పోయిన మల్లీయు దక్కవచ్చు

కీర్తి పోయిన నెమ్మది గెలువ వచ్చు

మంచి స్నేహితు డొక్కడు మళ్లి రాడు

తిరిగి రాడయా జగతిని తెలియ గనుమ.


ఆశ లూరక నెల్లెడ కాచి నిల్చి

కోప తాపము లున్నను గూర్మి జూపు

తప్పు లన్నిటి మన్నించి దరిని జేర్చు

ఒప్పు లొలికెడి స్నేహమె గొప్ప దయ్య.


గాంధ మలయజ మంటిన కట్టె కైన

పరిమ ళమ్ములు నబ్బును బరగ నవని

మంచి వారల మైత్రిని మనుజు డెపుడు

ఉత్త ముడుగాను మారును నుర్వి నందు.


అంత రమ్ములు జూడక ఆద రించి

అటుకు లైనను మెసవెను అచ్యు తుండు

సఖుని ప్రేమకు లొంగెడి స్వామి నాడు

నేడు జూడగ గలమొకో నిఖిల మునను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 8.6.2026

25 మే, 2026

ఆధునిక భారతీయ దేశభక్తి పద్యాలు

 ఆధునిక భారతీయ దేశభక్తి పద్యాలు 


మ్యాగి తినుచును, నెస్కఫె మధురమనుచు,

సోని ఫోనున మాట్లాడు సొగసుకాడు,

హోండ బైకుపై తిరుగుచు నుల్లసమున,

కోకు తాగుచు మురియును గూఢముగను!


అన్ని వస్తువు లన్యుల వాడుకొనుచు,

డాలరును జూసి యేడ్చును డాబు లొలుక

రూప్య విలువలు పడిపోయె రోత యనుచు,

భారతీయుల తెలివికి బండ తిట్టు!


మెక్కి మెక్డొనాల్డున, భార్య మేలు కొరకు

డోమి నోసున పిజ్జాలు తోడు దెచ్చి,

ఆపి లనెడి కంప్యూటరు నలరి జూచు,

రాడొ వాచీన సమయముల్ రమ్యముగను!


జూసి డాలరు, నేడ్చును జూడ వింత!

రూప్య విలువలు పడిపోయె రోత యనుచు,

అన్ని వస్తువు లన్యుల వాడుకొనుచు,

భార తీయుల తెలివికి బండ తిట్టు!



వలద నంచును మనదైన వస్తువులను,

కోరి కొనుచుండు నన్యుల కూర్పు లన్ని,

డాల రనగనె గుండెలు డాల్చు నతడు,

భార తీయుల వింతైన భ్రమల జూడ!


లేవి ప్యాంటును దొడిగియు, లీల తోడ

రేబ నను కళ్ళజోడును వేయు నతడు,

వోడ ఫోనున ముచ్చట్లు నొద్దికగను

చాటు చుండును దనదైన చంద ములను!


వాడు నొల్డుస్పరై సను వాసనలను,

వేడ గిల్లెటు బ్లేడున వింత జేసి,

పేర్సు సబ్బున మేనును బెంచి నాడు,

నేటి కాలపు యువకుడు నిఖిల జగతి!


డా.దార్ల వెంకటేశ్వరరావు 

25.5.2026


21 మే, 2026

అంతర్జాతీయ తేనీటి దినోత్సవం

 అంతర్జాతీయ తేనీటి దినోత్సవం 


వాన కురిసియు ధరణిని వలచు నట్లు

వేడి తోడను దనువును వేడ్క సేయు

చాయె యెప్పుడు నలసట చాల ద్రోసి

జీవ గర్రయ నగుచును జెంత నిల్చు!


మందు తినియును రోగము మాను నట్లు

మాయ జేయును దలనొప్పి మమత తోడ

తేట తేనీరు జగతికి దివ్య మౌచు

కంటి పాపగ నిల్చును గార వమున!


కూర్మి తోడను నెచ్చెలి గూడి నట్లు

కష్ట కాలము నందున గాచు నెరన

బుద్ధి కెప్పుడు నిచ్చును బొసగ శక్తి

మెచ్చు లోకము దీనిని మేటి యనగ.


దివ్య మౌనట్టి యమృతము దేవ తలకు

దీర్చి నట్టుల యలసట దిశల యందు

భూరి శ్రమలను జేసెడు బుధుల కెల్ల

భూరి తృప్తిని నిచ్చును బొసగ జాయె!


మంచి పసరును ద్రావియు మనుజు డెంతొ

మరల నూపిరి బొందుచు మహిమ గనగ

మంద భాగ్యుల కలసట మాన్ప జేయు

మధుర తేనీరు జగతికి మందు వలెను!


బాట సారికి నెండలో భాను తాప

బాధ నంతయు గాలియు బాపినట్లు

కంటి నిద్రను ద్రోయుచు గాచు నెరన

కమ్మ నైనట్టి తేనీరు గాంతి తోడ!


దాహ మొందిన వానికి దయను మేఘు

దమృత మును బోలు నీరిచ్చి యాదు నట్లు

సార శ్రమలను జేసెడు జనుల కెల్ల

సత్తు వను నిచ్చు తేనీరు జగతి యందు.


వాడి పోయిన తీగకు వనజ మాలి

వెల్లువగ నీరు బోసియు వెలుగు నిడున

దనువు నందలి బడలిక దరమ గలదు

కమ్మ నైనట్టి తేనీరు గాంతి తోడ!


అలసి వచ్చిన బిడ్డను నమ్మ యెపుడు

ఆద రము తోడ లాలించి యాదు నట్లు

మను జులకు నున్న యలసట మాన్ప జేయు

మధుర తేనీరు జగతికి మందు వలెను!


డా.దార్ల వెంకటేశ్వరరావు 21.5.2026

13 మే, 2026

ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవం- 2026

 ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవం

(World Ego Awareness Day)


అహంకారం -నష్టం:

నేను ననుచును తిరుగుచు నింగి ముట్టు

గర్వ మనెడిది కన్నుల గప్పి వేయు

దారి తెలియక మనిషియు తడబడెడిని

వినయమొకటె ప్రకాశించు వెలుగు బాట.

(భావం: "నేను" అనే అహంకారంతో ఆకాశాన్ని తాకుతున్నట్లు గర్వపడే మనిషికి, ఆ గర్వం కళ్లకు గంతలు కడుతుంది. దీనివల్ల సరైన దారి తెలియక జీవితంలో తడబడతాడు. వినయం మాత్రమే మనిషికి సరైన మార్గాన్ని చూపే వెలుగు.)


అహంకారం - పతనం: 

కొండ నెక్కిన వాడైన కూలి పోవు

అహము నెత్తిన కెక్కిన యధము డగుచు

నిజము నెరుగని వాడును నీచ మందు

శాంతి చేకూరు గర్వము చచ్చినపుడె.

(భావం: భౌతికంగా ఎంత ఎత్తైన కొండను ఎక్కిన వాడైనా, ఒక చిన్న అడుగు తడబడితే కిందకు కూలిపోక తప్పదు. అలాగే, నేను అనే గర్వం మనిషి నెత్తిన కెక్కితే, అతడు ఎంతటి గొప్పవాడైనా సరే, తన విచక్షణను కోల్పోయి అధముడిగా మారిపోతాడు. ఈ లోకంలోని శాశ్వతమైన సత్యాన్ని గ్రహించలేని వాడు తన గర్వం వల్ల సమాజంలో నీచత్వాన్ని, అవమానాన్ని పొందుతాడు. మనిషి తనలోని ఆ గర్వాన్ని చంపుకున్నప్పుడు మాత్రమే మనసుకి నిజమైన శాంతి లభిస్తుంది.)


అస్థిరమైన సంపద:

కలిమి గలిగిన గర్వము గలుగ నేల?

నీటి బుడగ వంటిది గద నిఖిల సిరియు

గాలి వీచిన యంతనే గలసి పోవు

నమ్రతయె నిల్చు నెప్పుడు నవని పైన.

(భావం: సంపద కలిగినప్పుడు అహంకారం ఎందుకు? ఈ లోకంలోని సిరి సంపదలన్నీ నీటి బుడగ వంటివి. గాలి వీచినప్పుడు నీటి బుడగ ఎలాగైతే అదృశ్యమవుతుందో, సంపద కూడా అలాగే పోతుంది. కానీ మనిషి చూపే వినయం మాత్రమే ఈ భూమిపై శాశ్వతంగా నిలిచి ఉంటుంది.)

అల్ప విద్య - అహంకారం:

అల్ప విద్యను నేర్చిన అహము పెరుగు

నిండు కుండయు తొణకదు నెమ్మదిగను

జ్ఞాన వృద్ధుడు వంగును గరిమ తోడ

గర్వ మజ్ఞాన చిహ్నము గాదె చూడ.

(భావం: తక్కువ విద్య నేర్చుకున్న వాడు గొప్పలు చెప్పుకుంటూ అహంకరిస్తాడు. కానీ నిండు కుండ తొణకనట్లుగా, పరిపూర్ణ జ్ఞాని ఎంతో నిమ్మదిగా, వినయంగా ఉంటాడు. పండ్లతో నిండిన కొమ్మ నేల వైపు వంగినట్లు, జ్ఞాన వృద్ధుడు గౌరవంతో వొంగుతాడు. అహంకారం అనేది అజ్ఞానానికి గుర్తు మాత్రమే.)


స్నేహము - అహంకారం:

కన్ను గానని వాడౌను గర్వ మన్న

నెత్తి కెక్కిన యంతనే నిక్క చూచు

ప్రక్క నున్నట్టి మిత్రులే పగతు లౌదు

అహము వీడిన కలుగును హాయి జూడ.

(భావం: అహంకారం తలకెక్కిన మనిషి కళ్లుండి కూడా చూడలేని వాడవుతాడు. అందరినీ తక్కువగా చూస్తూ గర్వంతో నిక్కడం వల్ల, తన మేలు కోరే మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు. ఆ అహంకారాన్ని వదిలేస్తేనే జీవితంలో హాయి, సుఖం లభిస్తాయి.)


అధికార గర్వం:

నేడు ఉన్నట్టి అధికార మెల్ల కాల

ముండ దెప్పుడు మన తోడ నుర్వి పైన

నిలిచి యుండును కేవల నిర్మలత్వ

మహము వీడితే దొరకును నమృత సుఖము.

(భావం: ఈ రోజు మన చేతిలో ఉన్న అధికారం గానీ, హోదా గానీ ఎప్పటికీ మనతోనే ఉండవు. కాలం మారుతున్న కొద్దీ అవి పోయేవే. కానీ మనలోని నిర్మలమైన స్వభావం, వినయం మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటాయి. గర్వాన్ని విడిచిపెడితేనే అమృతం లాంటి తీపి కలిగిన సుఖం దొరుకుతుంది.)

డా.దార్ల వెంకటేశ్వరరావు 12.5.2026



12 మే, 2026

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 



తల్లి వోలెను రోగిని తనివి దీర

ఆదరించును నర్సమ్మ యమిత ప్రేమ

కష్ట కాలాన దీపమై కాంతి నిచ్చు

వందనములివే సేవకుల్ ధన్య చరిత!


రోత నొందక నెప్పుడు రోగి సేవ

నవ్వు తోడనె చేయుచు నయము పంచు

ధాత్రి పైనను దేవతల్ ధన్య జీవు

లిలను నర్సుల త్యాగము లెన్న తరమె?


శ్వేత వస్త్రము ధరియించి శాంతి మూర్తి

వలెను కన్పించి కరుణను కురియు చుండు

అమ్మ వోలెను దీవించు నాదరమున

నర్సు లందరి కర్పించు నతులు భక్తి.


మందు లిచ్చుచు రోగికి మమత తోడ

ధైర్య మును నూరి పోయుచు తన్మయమున

ప్రాణ రక్షణ జేసెడు భవ్య చరిత

లైన నర్సుల కెప్పుడు నంజలు లివి.


రేయి బవలును నిద్దుర రేచ కుండ

వ్యాధి పీడిత జనులకు వగపు దీర్చి

ఓర్పు తోడను సేవలు నేర్పు గాను

చేయు నర్సుల కీర్తియు చెరిగి పోదు.


తనువు అలసట చెందిన తడబడకను

అనుదినంబును రోగికి నండ నిలుచు

కరుణ నిండిన హృదయాన కాంతి పంచె

నట్టి నర్సుల సేవలు నవని మిన్న.


సేవ యనియెడి మార్గాన సిద్ధ పడెడు

సుగుణ మూర్తులు నర్సులే సుఖము నిత్తు

రొడలు కదలని వేళను ఓర్పు తోడ

కంటి రెప్పగ కాపాడి కరుణ చూపు.


మొగము పైనను చిరునవ్వు మోము నిండ

మమత తోడను రోగికి మాట నిచ్చు

గుండె లోపల ధైర్యంబు గూడ జేయు

నర్సు దీవెన అమృతంబు నమ్మ వలయు.


సొంత సుఖముల నన్నిటి వంత వీడి

చెంత నిలబడి రోగికి సేవ జేయు

చింత లేకను దీవించు చిత్ర మూర్తి

వంద నములివె నర్సమ్మ వనజ నేత్రి!


కరుణ జూపుచు రోగికి కాంతి నిచ్చు

తరుణి యయ్యెను నర్సమ్మ ధాత్రి పైన

మమత తోడను నిత్యము మంచి పనుల

జేయు నర్సుల కీర్తియు చెరిగి పోదు.



కంటి రెప్పగ నిలిచియు కాచు నెపుడు

వంట బట్టిన మందుల వరుస దెలిసి

మంచి మనసున సేవలు మెండు గాను

నెలవు నర్సులే యీ ధర నిత్య వెలుగు.


వేచి యుండును రోగికి మేలు జేయ

ఓర్చి కష్టము నెప్పుడు నోర్పు తోడ

అమ్మ వోలెను దీవించు నాదరమున

నవని నర్సుల త్యాగము లమిత మయ్యె.


దరికి జేరును భయమును దరిమి వేయ

కరుణ జూపుచు రోగికి కాంతి నిచ్చు

శాంతి మూర్తులు నర్సులే జగతి లోన

ధన్య చరితలు వారలే ధరణి పైన.


అమ్మ వోలెను కరుణను నమిత మగను

చూపు నర్సుల పట్లన క్షుద్ర బుద్ధి

చూపు వారలు జెందురు ఘోర నరక

మవని వారలు పశువులే యనగ నగును.


డా.దార్ల వెంకటేశ్వరరావు 

12.5.2026


10 మే, 2026

మాతృ దినోత్సవం 2026

 


మాతృ దినోత్సవం 

ఆకలిని దీర్చి బిడ్డల నరయు నమ్మ
జోల పాటలొ మురిపెము చూపు నమ్మ
ధాత్రి పైనను దైవము తల్లి యొకతె
మాతృ రుణమును తీర్చుట మహిని తగునె?

అమ్మ ప్రేమయే ఈజగమందు మిన్న
చల్లనైనట్టి దీవెన శాంతి నొసగు
సృష్టి కర్తకు రూపమ్ము శ్రేష్ఠ మాత
అమృత తుల్యము మాతృత్వ మధుర సేవ.

పాప పాదాల నడకలు పలికె నమ్మ
భాష నేర్పిన గురువమ్మ బ్రతుకు లోన
నీతి సూక్తుల నేర్పెడి నిత్య దీప్తి
మాతృ ప్రేమకు సాటియు మరియు లేదు.

కష్ట కాలాన తోడుగా గన్న తల్లి
కంటి పాపగ మనలను గాచు నెపుడు
అమ్మ దీవెన లున్నచో నన్ని జయము
ధాత్రి లోపల మాతృత్వ తత్వ మదియె.

అమిత వాత్సల్య మొలికెడి అమ్మ ప్రేమ
కోరినంతనె దొరకును కొండ యంత
త్యాగ శీలత కమ్మయే తగిన రూపు
మాతృ మూర్తిని కొలుచుట మంచి దగును.

కలత నొందిన వేళల కాచు నమ్మ
ధైర్య మొసగుచు నడుపును దారి లోన
అమ్మ చదువుల తొలి గురు వనుట నిజము
ఎన్న గలుగునే త్యాగము ఏమి చెప్ప?

అమ్మ దీవెన లొసగును అమిత ముగను
ఇల్లు నందన వనముగా ఇపుడు మార్చు
వరుస తప్పక దిద్దును వారి నడక
అమ్మ ప్రేమను వర్ణించ నలవి కాదు.

నీతి సూక్తుల తోడనే నిలుపు నెపుడు
భావి భారత పౌరుల బలము అమ్మ
చదువు నేర్పిన గురువమ్మ చల్లగాను
మాతృ ప్రేమయే జగతికి మకుట మగును.

తల్లి ప్రేమకు సాటియు దాపు లేదు
ధాత్రి లోపల మాతృత్వ తత్వ మదియె
మమత తోడను పెంచెడి మాతృ మూర్తి
పూజ సేయగ వలయును పుడమి పైన.



అమ్మ దీవెన లెప్పుడు అండ మనకు
ఆపదల వేళ రక్షగ అరుగు దెంచు
చిన్న నాటి నుండియు మన చేయి పట్టి
నడక నేర్పిన దైవము నమ్మ వలెను.

వేద నాదమ్ము కంటెను వేగ మమ్మ
అక్షరమ్ములు దిద్దించు ఆది గురువు
చల్లనైనట్టి మమతను చాటు నమ్మ
మాతృ మూర్తికి మ్రొక్కుట మంచి దగును.

కోర్కె లన్నియు తీర్చెడి కొమ్మ యమ్మ
అనునయమ్మున పెంచును అర్భ కులను
శాంతి మార్గము చూపును సద్గుణముల
మనసు నిండుగ గొల్వుము మాతృ మూర్తి.



ముద్దు మాటల మురిపెము ముచ్చటగను
తప్పు నడకల దిద్దును తనయు లకును
చదువు లనెడిటి విజ్ఞాన చవుల నొసగు
జగతి లోపల మాతృత్వ జయము గనుము.

రేయి పగలును కష్టించు తేట మనసు
ఇల్లు చక్కగ దిద్దును ఇంతి యగుచు
పరుల మేలును కోరును పరవశమున
అమ్మ దీవెన లొసగును అధిక సుఖము.

అమ్మ కన్నను త్యాగము అవని లేదు
ముద్దు తోడను పెంచును ముదము తోడ
కంటి పాపగ కాపాడు కరుణ తోడ
మాతృ మూర్తికి మ్రొక్కుటే మంచి జన్మ.

అమ్మ దీవెన లెప్పుడు అండ మనకు
మనకు నిచ్చును మమతను మాతృ మూర్తి
మూర్తి యందున దైవము మురియు చుండు
మురియు చుండును మాతయే ముక్తి గాన!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 10.5.2026.



09 మే, 2026

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 2026

 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 2026


మనుల గావగ మహిమతో మంచి తలపు

ధరణి వెలసెను ధర్మము ధన్య మగుచు

అమల శాంతిని అందము అమర జేయు

వంద నములిడు వారికి వరుస గాను.


వ్యాధి పీడిత వారల వాసి తోడ

ప్రేమ తోడను పిలిచెను పేర్మి నపుడు

ఆదు కొనుటకు అందము ఆశ నిచ్చి

మేలు నిచ్చును మహిమతో మేటి గాను.


అమల శాంతిని అందము అమర జేయు

త్యాగ శీలిగ తరణిని తనరు నెపుడు

నమ్మ కమ్మున నయమున నాణ్య ముగను

కీర్తి నొందును కరుణతో కీర్త నీయ.


మాన వత్వము మహిమతో మంచి తలపు

ధరణి వెలసెను ధర్మము ధన్య మగుచు

ఆప దందున అండగా అరుగు దెంచు

శాంతి దూతగ సమయము చాటి చెప్పు.



వీర కృత్యము వెలయగా విమల మూర్తి

దీన జనులను దేరును దివ్య గతిని

మేలు జేయును మహిమతో మిగుల దయను

వంద నములిడు వారికి వరుస గాను.


ప్రాణ దానము పరమని పరగు చుండ

రక్త దానము రమ్యమై రాణ కెక్కు

ధన్య చరితుడు ధరణిని ధన్య మగును

ప్రణతి జేతుము పావన భావ మెరిగి.


హెన్రి డ్యూనాంటె రిగెనయ్య హెచ్చు దయను

కష్ట కాలము కలతను కాన నపుడు

నొప్పు లన్నియు నయముగ నొనర జేయు

వాపి చూపును వారధి వరుస గాను.


ఎర్ర సిలువయు ఎల్లెడ ఎనరు తోడ

జాతి భేదము జగతిని జాట నీక

మైత్రి భావన మహిమతో మాన్య గతిని

చాటు నప్పుడు శక్తిని చాడ్పు తోడ.


తోటి వారల తొనరుచు తోడ్ప డగను

చిన్న చూపును జగతిని చేర నీక

సాటి లేనట్టి సాహస సాధి తముగ

దీన జనులకు దేరును దీప్తి నొసగి.


దీన జనులను దేరును దీప్తి తోడ

కంటి పాపగ కరుణను కాన జేయు

అండ దండలు అమరగ అలరు చుండ

పరమ శాంతిని పంచియు పావ నముగ.


శ్రద్ధ తోడను సమ్మతి స్రావ్య ముగను

 వ్యాధి బాధలు వాపియు వాసి గన్న

దివ్య మూర్తులు దేజము దీప్తి నింప

వన్నె తెచ్చును విమలమై వరుస గాను.


సాటి వారల సాయము సాధ్య మవగ

అమల చిత్తము అందము అమర జేసి

భావ నందున భాగ్యము భాసు రముగ

ప్రణతి జేతుము పరమని పాలి తముగ.


ఆద రమ్మున అండగా అలరు చుండ

చక్క నైనట్టి చెలిమితో చాటు నపుడు

నమ్మ కమ్మున నయమున నాణ్య గతిని

మేలు జేయును మహిమతో మేటి గాను.


వాడి రేఖల వెలయగా వాసి కెక్కు

దీన రక్షణ దేరును దీప్తి తోడ

 ప్రేమ తోడను పిలిచెను పేర్మి నపుడు

వన్నె తెచ్చును వలనగ వాసి తోడ.


అమల శాంతిని అందము అమర జేసి

సాటి వారల సాయము సాధ్య మవగ

పరమ ధర్మము పరమని పాలి తముగ

వింత చిత్రము వెలయగ వీడు నపుడు.


కరుణ కలిగిన కమ్రత కాన వచ్చు

జాలి గుండెతో జగతిని జేర దీయు

అశ్రు ధారల అణచును అలరు తోడ

 ప్రణతు జేతుము పరమని పావ నముగ.


-డా.దార్ల వెంకటేశ్వరరావు 9.5.2026










06 మే, 2026

అంతర్జాతీయ ఆహార నియంత్రణ దినోత్సవం

 అంతర్జాతీయ ఆహార నియంత్రణ దినోత్సవం 



ముందు వడ్డించు కూడును ముక్కజేసి

వృథగ జేయుట పాపమౌ విశ్వమందు

ఎండ వానల కోర్చియు నిలచి రైతు

పంట పండించు రీతిని మరువ తగదు!


మెతుకు లేకను మాడెడు పేద గనక

పళ్లె మందున విడచుట పాడి కాదు

దాహ మైనట్టి వేళను దరికి జేరు

నీటి చుక్కను వదలని రీతి జూడ!


వండ వలయును తిండిని వలయు నంతె

పార వేయుట పుడమికి భార మగును

తేనె టీగలు గూడున తేనె నిట్లు

దాచు కొనెడి యా వింతను తలచు మయ్య!


తినెడి తిండిని హద్దుల తీర్చు కొనక

రోగ రాశులు జేరును రొంపి రీతి

మేర మీరిన నదిలోని నీరు మెరసి

ముంచు చందాన ఒప్పును మోద మబ్బ!


కూడు నెక్కువ వడ్డించి కుమ్మరించి

పార వేయుట పాపమౌ భరత భువిని

దాచు కొనెడిట్టి చీమల ధర్మ మచట

గాంచ వలయును బుధులును గారవమున!


విందు లందున వృథజేయు విందు నార

పేద కడుపును నింపును పెన్నిధిగను

పారు నీటిని నిలిపియు పరుల కొరకు

నడక జేసెడి కాల్వల నయము రీతి!


వండినట్టిది మిగిలిన వ్యర్థ మేల

ఆకలి గొనిన వారికి నర్పణమిడు

మేఘ మందలి నీరును మేది పైన

జల్లు కురిసిన చందాన చల్ల గనగ!


అల్ప మాహార మెప్పుడు నారగించు

మేను నందున నిలచును మిగుల శక్తి

దీప మందున చమురును దీప్తి నిడగ

దగిన రీతిన వెలుగును ధరణి లోన!

పంట పండించు కర్షకు ప్రాణ మెరిగి

మెతుకు వదలక తినుమమ్మ మేదినీన

ఒలిచి ముత్యాల హారమ్ము నుర్వి పైన

వదులు కొనెడిట్టి వింతను వదల వయ్య!


మితము మీరిన తిండియు మేను నందు

రోగ రాశుల దెచ్చును రొంపి రీతి

కట్ట తెగిపారు నీరంత కడలి జేర

పంట పొలముల ముంచెడు పగిది తోచు!


డా.దార్ల వెంకటేశ్వరరావు 6.5.2026




05 మే, 2026

ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవం-2026

 ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవం



హాస్య రసమును అతిశయ ఆకృతులతొ

చక్క నైనట్టి చిత్రము చాల్చు నెపుడు

లోక రీతిని లొసగును లోలు డతడు

వంద నములిడు వారికి వరుస గాను.


వ్యంగ్య చిత్రము వెలయగ వయ్య రమున

హాస్య రసమును అతిశయ ఆకృతులకు

మేలు జేయును మహిమతో మిగుల దయను

వంద నములిడు వారికి వరుస గాను.


కుంచె నైపుణి కొమరున కూరి మమర

చతుర మైనట్టి జగతికి చాటు నపుడు

మనసు మెచ్చెడి మహిమతో మంచి రీతి

కీర్తి నొందును కరుణతో కీర్త నీయ.


రమ్య రేఖల రశ్మితో రాణ గుల్కు

బొమ్మ గీయును బుధుడును పొగడ దగిన

కుంచె నైపుణి కొమరున కూరి మమర

ధన్య చరితుడు ధరణిని ధన్య మగును.


వ్యంగ్య చిత్రము వెలయగ వయ్య రమున

చక్క నైనట్టి చిత్రము చాల్చు నెపుడు

మనసు మెచ్చెడి మహిమతో మంచి రీతి

కీర్తి నొందును కరుణతో కీర్త నీయ.


రంగు లద్దియు రమ్యమై రాణ గుల్క

మేలి రేఖలు మేటియై మిగుల మెరయ

చాటు నతడును చతురత చాడ్పు తోడ

కీర్తి నొందును కరుణతో కీర్తనీయ.


నిప్పు రవ్వల నిశితమై నిలచు కుంచె

తప్పు లొప్పుల తర్కము తనివి తీర

వ్యాప్త మగునట్టి వయ్యార వైఖరిగను

మెచ్చె దరుగదా మేటిగ మెలకువలను.


బొమ్మ గీయును బుధుడును పొగడ దగిన

హాస్య రసమును అతిశయ అమర జేయు

లోక రీతిని లొసగును లోలు డతడు

వంద నములిడు వారికి వరుస గాను.


కుంచె నైపుణి కొమరున కూరి మమర

చతుర మైనట్టి జగతికి చాటు నపుడు

మేలు జేయును మహిమతో మిగుల దయను.


హెచ్చు తగ్గులు ఎరిగెడి ఏక దృష్టి

నిరత మెప్పుడు నిలచును నీతి తోడ

నవ్వు రప్పించు నయమున నాణ్య ముగను

వీర యోధుని వినయము వెలుగు నిచ్చు.


నిరత మెప్పుడు నిలచును నీతి తోడ

సత్య మెప్పుడు సరియైన శక్తి నిచ్చు

భావ చిత్రము భువినిది భాగ్య మమర

ప్రణతి జేతుము పావన భావ మెరిగి.

నవ్వు రప్పించు నయమున నాణ్య ముగను

బుద్ధి నిచ్చును బుధుడును పొగడ దగిన

చక్కనైనట్టి చిత్రము చాల్చు నెపుడు

వందనములిడు వారికి వరుస గాను.


కంటి కింపైన కలలతో కవిత లల్లు

వింత చిత్రము వేడుకై వెలుగు నిచ్చు

నేర్పు తోడను నిరతము నిపుణ గతిని

వన్నె తెచ్చును వాడియై వరుస గాను.


కంటి కింపైన కలలతో కవిత లల్లు

నల్ల రేఖల నయమున నవ్వు లొలుకు

త్యాగ మూర్తిగ తరణిని తనరు నెపుడు

సాటి లేనట్టి సాహస శక్తి తోడ.


నేర్పు తోడను నిరతము నిపుణ గతిని

మేటి నైపుణి మహిమతో మిగుల దయను

వన్నె తెచ్చును వాడియై వరుస గాను

ధన్య చరితుడు ధరణిని ధన్య మగును.


చిక్కు వీడును జయమును జేర నపుడు

చక్క నైనట్టి చిత్రము చాల్చు నెపుడు

బుద్ధి గరపును బుధుడును పొగడ దగిన

మేటి చిత్రము మెప్పును మిగుల నిచ్చు.

నల్ల రేఖల నయమున నవ్వు లొలుకు

కల్ల నిజముల కాంతిని కాన జేయు

లోక మంతట లోతుగ లోలు డతడు

త్యాగ మూర్తిగ తరణిని తనరు నెపుడు.


కుంచె మునకలు కొమరున కూరి మమర

రంగులద్దియు రమ్యమై రాణ గుల్క

మేటి నైపుణి మహిమతో మిగుల దయను

వన్నె తెచ్చును వాడియై వరుస గాను.

దార్ల వెంకటేశ్వరరావు 5.5.2026

04 మే, 2026

అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం -2026

 అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం 


ప్రాణ రక్షణ పరమని పరుగు దీయు

అగ్ని కీలల నణచును అపుడు వీడు

ధైర్య వంతుడు ధరణిని ధన్య మూర్తి

వంద నములిడు వారికి వరుస గాను.


ఆప దందున అండగా అరుగు దెంచు

శాంతి దూతగ సమయము చాటి చెప్పు

మేలు జేయును మహిమతో మిగుల దయను

వీర యోధుని వినయము వెలుగు నిచ్చు.


ప్రాణ రక్షణ పరమని పరుగు దీయు

మంట లణచును మహినిని మహిమ తోడ

ధైర్య వంతుడు ధరణిని ధన్య మూర్తి

వంద నములిడు వారికి వరుస గాను.


సాహ సమ్మది సరిలేని శక్తి నిచ్చు

దీన జనులను దేరును దివ్య గతిని

అగ్ని కీలల నణచును ఆప్త వృత్తి

వీర యోధుని వినయము వెలుగు నిచ్చు.


కష్ట మెంచక కరుణతో గమ్య మునను

నిప్పు రవ్వల నెదిరించు నిపుణ గతిని

ఆప దందున అండగా అరుగు దెంచు

శాంతి దూతగ సమయము చాటి చెప్పు.


వీర యోధుని వినయము వెలుగు నిచ్చు

దీన జనులను దేరును దివ్య గతిని

మేలు జేయును మహిమతో మిగుల దయను

ధైర్య సాహస ధరణిని ధన్య మగును.



అగ్ని కీలల నణచును అపుడు వీడు

నిప్పు రవ్వల నెదిరించు నిపుణ గతిని

వీర కృత్యము వెలయగా విమల మూర్తి

కీర్తి నొందును కరుణతో కీర్త నీయ.


కరుణ తోడను కష్టము గెలుచు నతడు

మేలు జేయును మహిమతో మిగుల దయను

శాంతి దూతగ సమయము చాటు నపుడు

ప్రణతి జేతుము పావన భావ మెరిగి.




సాహ సమ్మది సరిలేని శక్తి నిచ్చు


నిరత మెప్పుడు నిలచును నీతి తోడ


ప్రజల గాచును బహుమాన భావ మమర


వంద నములిడు వారికివరుస గాను.


దార్ల వెంకటేశ్వరరావు 

4.5.2026



తమిళనాట విజయ్ విజయం

 తమిళనాట విజయ్ విజయం 


తమిళ నాటను తనదైన తళుకు జూపి

ప్రజల హృదయాన ప్రేమతో పదవి నొందె

వరుస గా నత డరుదెంచె వాసి గనగ

విజయ దుందుభి విశ్వము వినగ మ్రోగె.


అగ్ని పర్వత మందలి అగ్ని వలెను

నివురు గప్పిన నిప్పుగా నిలిచి యుండి

తగిన సమయాన వెలువడె తమిళ నాట

ప్రజల హితమును గోరుచు ప్రభలు చింద.


తార కప్రభు మార్గాన తనదు అడుగు

వరుస తప్పక వేసెను వాసి గనగ

రంగు లోకపు మోహము రమ్యముగను

వీడి వచ్చెను ప్రజలకు వెలుగు నీయ.


రంగు లోకాన రాణించు రంజు వీడి

నీతి తోడను నిలిచెను నిక్కముగను

తమిళ నాటను తనదైన తళుకు జూపి

వరుస గా ప్రజ వాణియై వన్నె కెక్కె.


అణచి పెట్టిన ప్రజల యీ ఆశ లొకటె

ఉప్పె నై నేడు వచ్చెను ఉన్నతముగ

తమిళ జాతినే మేల్కొల్పు తరుణ మిదియె

విజయ బావుటా నెగరెను విశ్వ మందు.


తార కప్రభు జూపిన తావు కనియె

వరుస తప్పక నిలిచెను వాసి గనగ

రంగు లోకపు మోహము రమ్యముగను

వీడి వచ్చెను ప్రజలకు వెలుగు నీయ.


అచల మైయున్న ఆగ్నేయ అచల మట్లు

శక్తి యుతుడైన శాసకు డరుగుదెంచె

తమిళ భాగ్యము తానే గ తలచి నేడు

వింత యగు రీతి విజయంబు విస్తరించె.


నంద మూరి విలాసాల నైజ మెంచి

రాజ కీయాన నిలిచెను రామ విభుడు

రంగు లోకపు మాయను రట్టు జేసి

వీడి వచ్చెను ప్రజలకు విలువ లొసగ.


అగ్ని కొండల లోపల ఆగి యున్న

లావ ధారలు ఉప్పొంగి లాగు నట్లు

తమిళ జాతినే మేల్కొల్పి తనదు శక్తి

విశ్వ మందున చాటెను విజయు డిపుడు


పేద ప్రజలకై నిలబడె పేర్మి తోడ

న్యాయ మార్గాన సాగెను నవ్య రీతి

తార కప్రభు వాంఛిత తత్త్వ మిదియె

వరుస గా ప్రజ సేవయే వరము గాను.


దార్ల వెంకటేశ్వరరావు, 4.5.2026


03 మే, 2026

ప్రపంచ నవ్వుల దినోత్సవం- 2026

 ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు!

(ప్రతి ఏటా మే నెలలో మొదటి ఆదివారం.)


కం.

నవ్వులె వెలుగులు జగమున

నవ్వులె సిరిసంపదలును నయముగ చూడన్

నవ్వుట నైజము గావలె

నవ్వుల తోడనె జయించు నరుడును దార్లా!


కం.

నవ్వులె మనిషికి ధనమును

నెవ్వరి నైనను మురియుచు నింపుగ జేయున్

నవ్వుటె యోగము ధరలో

నవ్వుచు గెలువగ నవకము నందవె దార్లా!




కం.

చిరునవ్వులె ఇల వెలుగులు

పరులన్ నవ్వుచు నడపగ పదమున నిచ్చున్

మరువక నవ్వుము నెప్పుడు

పరగుచు నవ్వున గెలువగ పసనగు దార్లా!

కం.

నవ్వుటె మనిషికి అందము

నవ్వుల నడచెడి పనులును నలమును నిచ్చున్

నవ్వులె ధైర్యము నిచ్చును

నవ్వుచు గెలువగ వశమగు నమ్మగ దార్లా!


కం.

నవ్వులె ధైర్యము నిచ్చును

నవ్వుల నడచెడి పనులును నలమును నిచ్చున్

నవ్వుటె మనిషికి అందము

నవ్వుచు గెలువగ వశమగు నమ్మగ దార్లా!


కం.

నవ్వుట నలుబది రోగము

లివ్వున నశియించు దనువు నింపగు నెపుడున్

నవ్వుము నవ్వించు జగము

నవ్వుల పువ్వులనుజల్లు నయముగ దార్లా!



కం.

నవ్వుచు పలికిన మాటలు

నవ్వుచు నడచెడి పనులును నలమును నిచ్చున్

నవ్వులె నందన వనమున

నవ్వులు రువ్వెడి సుమములు నవకము దార్లా!


కం.

నవ్వులె మనకును రక్షలు

నవ్వులె కైవల్య పదము నయముగ చూడన్

నవ్వుటె యోగము ధరలో

నవ్వులు చిందగ జయమును నందవె దార్లా!


కం.

నవ్వుచు బ్రతికెడి మనిషికి

నవ్వుచు దీవించు నెపుడు నలువయు భువిలో

నవ్వుటె గొప్పదగు ధనము

నవ్వుల తోడనె సుఖమును నందవె దార్లా!


నవ్వులె మనిషికి ధనమును

నెవ్వరి నైనను మురియుచు నింపుగ జేయున్

నవ్వుటె యోగము ధరలో

నెవ్వగ నవ్వుచు గెలువగ నెలవగు దార్లా!


కం.

నవ్వుచు సాయము జేయగ

నవ్వుచు దీవించు నెపుడు నరుడును సుమతీ

నవ్వులె నయముగు మందులు

నవ్వులె శాంతికి నిలయము నమ్మగ దార్లా!


కం.

నవ్వని ముఖమున కాంతియు

నవ్వని హృది యందు శాంతి నానాటికగున్

నవ్వుటయే యోగము సుమి

నవ్వులు చిందేటి బ్రతుకు నందన వనమే.


నవ్వులె వెలుగులు ధరలో

నవ్వుల నడచెడి పనులును నలమును నిచ్చున్

నవ్వుటె మనిషికి అందము

నవ్వుచు గెలువగవశమగు నమ్మగ దార్లా!


ఆ.వె.

నవ్వు మనిషి కొసగు నవకాంతి రేఖలు

చింత నణచివేసి చెంత జేర్చు

నవ్వు లేని బ్రతుకు నడి సంద్రమున నావ

నవ్వు నవ్వుమయ్య నరుడ నీవు.


తే.గీ.

నవ్వు చిందించ ముఖమున నవకమబ్బు

నవ్వు లేకున్న బ్రతుకది నట్టడవియె

నవ్వు నలుగురి జేర్చును నమ్మకముగ

నవ్వులే గద మనిషికి నవనిధులును.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 3.5.2026

పత్రికా స్వేచ్ఛా దినోత్సవం-2026

 పత్రికా స్వేచ్ఛా దినోత్సవం

 (World Press Freedom Day


లోకమందున జరుగుటె ల్లోకమందు

పత్రికలు జూపు గన్నుల భవ్య రీతి

సత్య వాక్కును వెలుగించు సమయ మిదిగొ

ప్రగతి బాటల నడుపును ప్రాజ్ఞు లెన్న!


భీతి బాసియు నిజమును భీష్మ రీతి

చాటి చెప్పెడి కలమున చాకచక్య

మొప్పు గలిగిన పత్రిక లున్న చోట

న్యాయమనెడిది వెలుగును నలు దిశలను!


అక్షరమ్మె ప్రచండమౌ ఆయుధమ్ము

అవని లోపల వెలుగెడు నధిక శక్తి

కలమునందున దాగున్న కడిమి జూడ

ప్రజల పక్షాన నిలుచును ప్రగతి గనగ.


నిజము దాచక లోకాన నిలచి యుండి

వార్త లన్నియు దెలిపెడి వారు నేడు

సత్య మార్గము వీడక సమత తోడ

ప్రజల మేలును గోరుచు ప్రబల వలెను!


లోక హితమును గోరెడి లోగిలిదిగొ

ప్రజల నాలుక యనదగు ప్రక్రియలివి

న్యాయ రక్షణ జేసెడి నమ్మకమ్ము

పత్రికా స్వేచ్ఛ జగతికి ప్రాణ మగును!


కలము పట్టిన యోధులు కదన మందు

నిలిచి గెలిచెడి ధీరులు నిశ్చయముగ

కినుక తోడను తప్పుల గెలుచు వారు

ధర్మ రక్షణ జేయగ ధన్య మగును


లోక వృత్తము దెల్పుచు రూఢిగాను

సత్య మార్గము జూపుచు సాగుచుండు

జాతి గౌరవమును నిల్పు జగతి యందు

పత్రికా స్వేచ్ఛయే కదా ప్రాణమౌను!



వార్త లందున సత్యము వరుస నిలిపి

ప్రజల పక్షాన నిరతము ప్రశ్న వేసి

న్యాయ మెప్పుడు కాపాడు నమ్మకముగ

పత్రికా స్వేచ్ఛ రాజ్యమున్ ప్రబల జేయు.


చీకటిని చీల్చు వెలుగుల చిత్రమగుచు

నీతి మార్గము దెల్పుచు నిరతమందు

అర్క బింబము వోలెను నవని యందు

పత్రికా స్వేచ్ఛ భాసిల్లు ప్రగతి నిడగ.



ఎల్ల ప్రజలకు కన్నుగా నిలచి యుండి

ఏలు వారల తప్పుల - నెత్తి జూపి

స్వేచ్ఛ గలిగిన వార్తలే - క్షేమ మొసగు

లోక చైతన్య దీప్తియే - లోక మమ్మ.


ఖడ్గ ధారల కన్నను గరిమ గలిగి

అక్షరమ్ములు ఆయుధ మ్మవగ నిలచి

దుష్ట శిక్షణ జేయుచు పావనముగ

పత్రికల స్వేచ్ఛ నిలుపును ధరణి శాంతి.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

3.5.2026

02 మే, 2026

అంతర్జాతీయ ఖగోళ దినోత్సవం- 2026

 అంతర్జాతీయ ఖగోళ దినోత్సవం


విజ్ఞాన నేత్రం (టెలిస్కోప్):

అంబరములోని వింతల నరయుటకును

దూరదర్శిని సాయాన దొరకు జ్ఞాన

మద్భుతములెన్నొ కనబడు నవని పైన

సాధ్యమగునుగ శాస్త్రమ్ము శక్తి తోడ!


అంబరములోని వింతల నరయుటకును

దూరదర్శిని సాయాన దొరకు జ్ఞాన

మద్భుతములెన్నొ కనబడు మహిని పైన

సాధ్యమగునుగ శాస్త్రమ్ము సత్య మెరిగి.


మానవ జిజ్ఞాస:

నింగి లోగిలి వింతల నీక్షణింప

ప్రజ్ఞతోడను జేసెడి ప్రక్రియలివి

జ్ఞాన దీపమ్ము లోకాన జైత్రయాత్ర

చీకటులు బాసి వెలుగును చిన్నె లలర.


విశ్వం - ఒక అద్భుతం:

అంతరిక్షాన వెలిగేటి నంతకోటి

తారకలు జూడ గన్నుల తాపమారు

వింతలెన్నొ దాగున్నట్టి విశ్వమందు

శాస్త్రవేత్తల కృషినిల శాశ్వతమ్ము.


నక్షత్ర మండలం:

మిలమిలమ్మని మెరిసెడి మిత్రులంత

గగన వీధిని వెలుగుచు గనుల విందు

తారకల రూపములనున్న ధన్య జీవు

లనగ నొప్పెడి చుక్కల నరయ వలయు.


సూర్య చంద్రులు

భాను డెప్పుడు వెలుగుచు భాసరిల్లు

చంద్ర బింబము రేయిని చల్ల నగును

గ్రహములన్నియు తిరుగుచు గతిని జూపు

సృష్టి లోపలి వింతల సృష్టి గనగ.


పాలపుంత (Milky Way):

పాలపుంతయు వెలుగుల పథము జూపు

వేల కోటుల తారల వెల్లి విరిసి

రంగు రంగుల వింతల రాశి యగుచు

చూడ జక్కని వింతల చోద్య మిదియె!


గ్రహాంతర అన్వేషణ:

చందమామను చేరగ చక్ర మెక్కి

మౌన వీధిని సాగెడి మార్గ మిదిగొ

నందనంబుగ మార్చును నరుని ప్రజ్ఞ

వింత లోకపు గుట్టుల విప్ప గలుగు!


భూమి - ఒక అద్భుతం:

నీలి గోళము నింగిని నిలచి యుండు

జీవ రాశికి నిలయమై జెలువ మొందు

భాను కాంతిని పొందుచు భవ్య రీతి

పుడమి తల్లియు తిరుగును పొల్పు మీర.


గెలాక్సీల సమూహం:

విశ్వ వీధిని తిరిగెడి వింత లొకటె

చూడ గననేక ములనిను చూపు నింప

రంగు రంగుల చుక్కల రాశులన్ని

గూడి యుండెడి వింతలు గొప్ప వగును.


తోకచుక్క (Comet):

తోక చుక్కయు నింగిని దూసి పోవ

జూడ గన్నుల కింపైన జోక్య మిదిగొ

వంకరైనట్టి గీతగా వరుస వెలుగు

సౌర మండల వీధిని చాటు వింత.


కాల ప్రవాహం:

కాల చక్రము తిరుగును గగన మందు

వేగ మెంతయో యున్నను వెలికి గాదు

భాను చుట్టూర తిరుగుచు భాసిరిల్లు

మార జేయును రుతువుల మహిని పైన.


శాస్త్రీయ దృక్పథం:

మూఢ నమ్మకమ్ముల బాసి ముందు కెళ్లి

నింగి మర్మము గనుగొన నీతి తోడ

ప్రాజ్ఞులందరు దెలిపెడి పద్ధతులివి

విశ్వ విజ్ఞాన భావము విరియు నెపుడు.


నింగి లోపలి వింతల నీక్షణింప

శాస్త్ర విజ్ఞాన దృష్టియు సాయపడును

విశ్వ మర్మము దెలిపెడి విధము నేడు

భావి తరముల కిచ్చును భాగ్య మెలమి.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

2.5.2026








01 మే, 2026

బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు

 


ఆశలే దుఃఖ మూలమం చనెను విభుడు

శాంతి మార్గము జగతికి చాటి చెప్పె

హింస వీడియు కరుణను ఇలను నింపె

బుద్ధ దేవుని గొలుతుము పొగడి యెపుడు.


ముక్తి మార్గము వెదకెను మొనసి యతడు

కామ క్రోధము లణచెను ఘనత తోడ

సత్య శోధన జేసెను శాంతి కొరకు

బుద్ధ రూపుడు వెలిగెను పుడమి యందు.


దీన జనులను గాచిన దివ్య మూర్తి

గోత ముడనెడి పేరున గొప్ప వాడె

ఆత్మ జ్ఞానము జూపిన అనఘ చరితు

పరమ శాంతిని గూర్చెను ప్రజల కెపుడు.


దీన జనులను గాచిన దేవ దేవు

డక్క జంబుగ నెంచెడి యార్య గుణము

కరుణ తోడను జగతిని గాచు నెపుడు

బుద్ధ పూర్ణిమ నిచ్చును పుణ్య ఫలము.



లోక మెల్లను మెచ్చిన లోలు డతడు

కామ మేలన దుఃఖము గలుగు ననియె

శాంతి మార్గము జూపెను చాక చక్య

మొనసి ముక్తిని గాంచెను మోద మలర.


వైర మణచును కరుణతో వసుధ యందు

కోప మెల్లను వీడెను కొమరు మిగిలి

శాంతి సౌఖ్యము లొసగును చారు చరిత

బుద్ధ ధర్మము నెరుగుట పుణ్య మగును.


బోధి వృక్షము చెంతను పొందె జ్ఞాన

ముల్ల మలరగ| జూపెను ముక్తి ద్రోవ

జ్ఞాన జ్యోతిగ వెలిగెను జగము నెల్ల

ధన్య చరితుడు సిద్ధార్థు డనఘ మూర్తి.


కోప మణచిన వాడెగ గొప్ప వాడు

తియ్య నైనట్టి మాటలు దేట పరచు

హింస వీడిన మనమున ఇలను గెలుచు

ముక్తి దొరుకును నిర్వాణ ముదము తోడ.


వెలుగు జూపెను లోకాన విమల మూర్తి

కాంతి నిచ్చెను జగతికి గరిమ తోడ

ధర్మ మార్గము నిలబెట్టె ధరణి యందు

సిద్ధి బొందెను తపమున శివము గనగ.


మేలు జేయును బుద్ధుని మిగుల దయయు

ఆత్మ శుద్ధిని గూర్చును అనఘ మార్గ

మెల్ల రికిని నొసంగును ఏక దృష్టి

సత్య శోధన జేయుట శాశ్వతంబు.


అష్ట మార్గము లొసగెను అనఘు డతడు

శుద్ధ చిత్తము గలిగిన శోభ గలుగు

సత్య వాక్కున నిలవగ శాంతి దొరకు

బుద్ధ పూర్ణిమ పర్వము పొంద జేయు.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

1.5.2026


అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే –2026)

 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే –2026)


తే.గీ.

లోకమునకెల్ల నాధార లోకచరిత

కష్టజీవుల చెమటయే ఘనత నిచ్చు

మే దినమ్మున వారల మెచ్చ వలెను

శ్రమయె వెలుగును నిచ్చును జగతి కంత


తే.గీ.

పుడమి నిలుచును కార్మిక భుజము పైన

గోడ నిలుచును గట్టిగ గూడు నట్లు

శ్రమయె దైవము సకలార్థ సాధనమ్ము

మేటి దినమున గౌరవ మీయ వలెను


తే.గీ.

శ్రమయె జగతికి మూలమై శాంతి నిచ్చు

కూలి జనుల చెమటలచే కుదురు నిలుచు

హక్కు లందున పోరాడి హర్ష మొందు

మేటి దినమిది మేలును మెచ్చ వలయు.



తే.గీ.

పోరు సలిపెడు వారల పొగడ వలయు

శ్రమను నమ్మిన జనులకు శాంతి కలుగు

కార్మి కులయొక్క కష్టమె కల్ప తరువు 

మేటి దినమిది మేటిగ మెరయు నెపుడు 



తే.గీ.

దీపమున్నచో వెలుగులు దేరు నట్లు

శ్రామికుండున్న జగతికి శక్తి కలుగు

చెమట చిందించ సృష్టియే చిత్రమగును

మేటి దినమున వారల మెచ్చవలయు



తే.గీ.

పాలు ఉన్నచో వెన్నయే పరగు నట్లు 

శ్రమయు ఉన్నచో సంపదల్ సాగు చుండు

 కష్ట జీవుల చెమటయే కల్ప తరువు

 మేటి దినమున మేలును మెచ్చ వలయు



తే.గీ.

విత్తు ఉన్నచో వృక్షము వెలయు నట్లు 

శ్రామి కున్నచో సృష్టియే సాగు నెపుడు

 శ్రమయె దైవము సకలార్థ సాధ నమ్ము

 మేటి దినమున మేటిగ మెరయు నెపుడు 



తే.గీ.

పాలు ఉన్నచో వెన్నయే పరగు నట్లు

శ్రమయు ఉన్నచో సంపదల్ సాగు చుండు

కష్ట జీవుల చెమటయే కల్ప తరువు

మేటి దినమున మేలును మెచ్చ వలయు



తే.గీ.

వేరు ఉన్నచో వృక్షము వెలయు నట్లు 

కూలి ఉన్నచో కోటిగా కుదురు నిలుచు 

శ్రమయె దైవము సకలార్థ సాధ నమ్ము

 మేటి దినమున మేలును మెచ్చ వలయు



తే.గీ.

అలలు ఉన్నచో నంబుధి వెలయు నట్లు

 శ్రమయు ఉన్నచో సర్వము సాగు చుండు 

శ్రామి కోన్నత పరులకే శాంతి కలుగు 

మేటి దినమిది మేటిగ మెరయు నెపుడు 



తే.గీ.

వాన ఉన్నచో వసుధపై వరియు పండు

 శ్రమయు ఉన్నచో సౌఖ్యముల్ సాగు చుండు 

కష్ట జీవుల చెమటయే కల్ప తరువు

 మేటి దినమున మేలును మెచ్చ వలయు.


తే.గీ.

భాను డున్నచో భాసిల్లు భాను తేజ

శ్రామి కున్నచో సౌఖ్యము శ్రామి కునకు

శ్రమయె వెలుగును శాశ్వత శ్రమయె జయము

మేటి దినమిది మేటిగ మేలు నిడును


తే.గీ.

విత్తు ఉన్నచో వృక్షము వెలయు నట్లు 

కూలి ఉన్నచో కోటిగా కుదురు నిలుచు

 శ్రమయె దైవము సకలార్థ సాధ నమ్ము 

మేటి దినమిది మేటిగ మెరయు నెపుడు  



ఆ.వె.

చేతి కండ రముల చెమటయే చిందించ

లోక మంత నిలుచు లోతు గాను

ఘనత గాంచె నిచట గౌరవ మందుచు

వంద నములు వారు వరుస తోడ 


ఆ.వె.

శ్రామి కులకు జేయ సకలార్థ వందన

మవని నిలుచు వారలండ తోడ

శ్రమయె దైవమనుచు సాగెడి వేళల

జగతి వెలుగు నిచ్చు జయము తోడ


 – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 1.5.2026


29 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ నృత్య దినోత్సవం-2026

 అంతర్జాతీయ నృత్య దినోత్సవం


ఆంగి కముతోడ నభినయ మరయగాను

హావ భావముల్ మనమున హత్తు కొనగ

తాళ గతులుగా నర్తన తాల పరచి

భాసు రమ్మగు కళనిది భావ మొనరు.


దేశ మంతయు నృత్యమే దేచు చుండ

ఆన దంబొస గెడునిది అను దినంబు

శాంతి నిచ్చుచు మనసును శాంతి పరచు

సాటి లేనట్టి విద్యది సత్య మయ్య.


ఏప్రి లను నెల లోనను ఎల్ల వేళ

నృత్య మును జేయ వలెనని నిశ్చ యించి

జాతు లన్నియు నొక్కటై జాగురూక

చాట వలె దీని జగమున చాల నపుడు.


చింత లన్నియు మదినుండి చెదరి పోవు

ఆట లాడిన తనువందు ఆశ నిండు

శాంతి గలుగును లోకాన సతము మనకు

నృత్య మనునది పరమాత్మ నిలయ మయ్యె.


పాద గతులును లయతోడ పరిమ ళించ

మెరుపు తీగగ మేనంత మెలగు చుండ

కనుల సైగలు భావముల్ కలిపి చూప

విశ్వ మంతయు నృత్యమౌ వింత జూడు.



భావ మక్కర లేనట్టి భంగి మలిది

తాళ గతులకు నింపుగా తనువు గదులు

లయలు సంగీత రీతుల లలిత మగును

నృత్త మన్నది శిల్పపు నిలయ మయ్యె.


(నృత్తం: ఇది కేవలం శారీరక కదలికల (అంగ విన్యాసాల) సమాహారం. ఇందులో భావం (Expressing emotions or story) ఉండదు. కేవలం తాళం, లయ మాత్రమే ప్రధానం. అందుకే దీనిని "Pure Dance" అంటారు.నృత్తానికి సంగీతం ఉంటుంది, కానీ ఆ సంగీతంలోని పదాలకు అర్థం  చెప్పడం ఉండదు. కేవలం జతులు, స్వరాల లయకు అనుగుణంగా అడుగులు వేయడం జరుగుతుంది.)


రసము లొల్కుచు భావముల్ రక్తి గట్ట

ముదము గూర్చెడు నభినయ ముఖ్య మిచట

పాట అర్థము జూపెడు పద్ధ తిదియె

నృత్య మందున ముద్రలే నియమ మయ్యె.


(నృత్యం: పాటలోని అర్థాన్ని, రసాన్ని హావభావాల ద్వారా, ముద్రల ద్వారా వ్యక్తపరచడం (Expository Dance).)


నృత్తం చేసేటప్పుడు కథను లేదా భావాన్ని అభినయించాల్సిన అవసరం లేదు, కేవలం శరీర కదలికలు తాళానికి అనుగుణంగా ఉంటే చాలు. సంగీతం మాత్రం రెండు ప్రక్రియల్లోనూ అంతర్లీనంగా ఉంటుంది.


చరణ గతులతో నందము చాటు చుండు

కఠిన తాళము లయలతో కదలు మేను

తనువు భంగిమ లొప్పెడు తరము నిదియె

నృత్త మనగాను తాళపు నియమ మున్న.


హస్త ముద్రలు భావముల్ హత్తు కొనగ

కథను వర్ణించు రీతిలో కనుల విందు

పదము అర్థము జూపెడి పద్ధ తిదియె

నృత్య మనునది రసమును నింపు చుండు.


నాట్య మనగాను లోకపు నడక తెలియ

అన్ని కళలకు నిదియొక అద్ద ముగను

ముక్తి నిచ్చుచు జ్ఞానము ముదము నిచ్చు

నృత్య నిరతులు గొలువుడి నిత్య ముగను.


నృత్య మందున భావము నిండి యుండు

చిత్ర మందున రూపము చెలువ మొందు

అన్న మయ్యని పాటలు అమృత ములుగ

ధన్య మయ్యెను భారతి ధాత్రి పైన.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

29.4.2026.


అన్నమయ్య సదస్సు (29.4.2026)

 తెలుగు శాఖ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జరుగుతున్న అన్నమయ్య సదస్సు ప్రారంభ సమావేశంలో ... మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై అధ్యాపకులు. 







తెలుగు సంకీర్తనా సాహిత్యానికి అన్నమయ్య ప్రథమాచార్యుడని, పదకవితా పితామహుడిగా సంగీతం, నృత్య కళలను సాహిత్యానికి అందించిన ప్రథమ వాగ్గేయకారుడిగా నిలిచిన అజరామరుడు తాళ్లపాక అన్నమయ్య అని హెచ్ సి యు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నమయ్యకు కైమోడ్పులు ఘటించారు. బుధవారం నాడు (29.4.2026) హైదరాబాద్ యూనివర్సిటీ తెలుగు శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ‘తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు - భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం ‘ అనే అంశంపై జరిగిన సదస్సుకు అధ్యక్షత వహిస్తూ, ఆయన కీలకోపన్యాసం చేశారు. తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్నమయ్య సాహిత్యం లోని సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ, అన్నమయ్యపై పద్యాలను రచించి సభలో చదివి వినిపించారు. సదస్సు కన్వీనర్ ఆచార్య డి. విజయలక్ష్మి సదస్సు లక్ష్యాలను వివరిస్తూ అన్నమయ్య సాహిత్యంలో కేవలం భక్తి మాత్రమే కాదని, భాషా ప్రయోగాలు, సామాజిక అంశాలు ఉన్నాయని, వాటిని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆచార్య ఎం. గోనానాయక్ మాట్లాడుతూ హతీరామ్ జీ బంజారా భాషలో సుమారు 150 కీర్తనలను రచించినట్లు ఆయన తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంగీత నృత్య కళల విభాగ అధ్యక్షులు ఆచార్య ఆర్ ఎన్ ఎస్ శైలేశ్వరి సాహిత్యానికి సంగీత పరంగా సంకీర్తనలు రచించిన మొట్టమొదటి వాగ్గేకారుడుగా అన్నమయ్య గురించి సోదాహరణంగా వివరించారు. ఈ సదస్సులో ఆచార్యులు పమ్మి పవన్ కుమార్, పి.వారిజారాణి, త్రివేణి వంగరి, రెడ్డి శ్యామల, భూక్య తిరుపతి, సాగి కమలాకరశర్మ, డా.బి.భుజంగరెడ్ఢి, డా.ఎస్.రఘు, డా.పి.విజయ్ కుమార్ , డా.బాశెట్టి లత, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భాగవతార్ రమేష్, రెడ్డయ్య, సుశీల్ ఆండాళ్, విజయ్, మురళీ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి డాక్టర్ పి. విజయ్ కుమార్ స్వాగతం పలుకగా, డాక్టర్ బాశెట్టి లత వందన సమర్పణ చేశారు. సదస్సు అనంతరం సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఈ సదస్సులో పరిశోధక విద్యార్థినీ, విద్యార్థులు, స్నాతక, స్నాతకోత్తర విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య పై పద్యాలు 



భక్తి తోడను గీతముల్ బాడి నావు

ముక్తి మార్గము జూపితి ముదము మీర

చక్క నయ్యని కథలను చాటి నావు

తాళ్ళ పాకయ్య నమ్రత తలచి మొక్కు.


కొండ దేవర కీర్తనల్ కొనల సాగె

తేట తేటగ పాటల తేనె లొలికె

అన్న మయ్యని పదములు అమృత ములుగ

చిన్న నయ్యకు జేజేలు చెప్ప వలయు.


తలచి నంతనె కలిగెడి తన్మ యమ్ము

కలియు గంబున దేవుని కాన బరిచె

భజన జేసెడు భక్తుల భాగ్య మయ్యె

అన్న మయ్యను మదినిని అర్చ చేయ.


వెలయ జేసిన పాటలు వేల సంఖ్య

పలుకు తేనెల సంతస పరిమ ళాలు

చిన్న నయ్యకు జేజెలు చెప్ప వలయు

అలరు మంగను గొలిచెడి అనఘు డతడె.


వేగ మెచ్చెను స్వామియు వేల భక్తి

భావ ముట్టిప డెడునట్టి పాట లాడె

తాళ్ళ పాకయ్య పదములు తరచి చూడ

ముక్తి మార్గము మనకును ముదము నిచ్చు.



కొలువు దీరిన సామిని కొలువ దగదె

తేట తేటగ పాటల తేనె లొలికె

అన్న మయ్యని పదములు అమృత ములుగ

వరుస గీతము లాడెడి వాడు నతడె.


సొగసు గూర్చిన పాటలు సొగసు గొలిపె

హరికి సేవలు మనమున హత్తు కొనియె

తెలుగు బాసకు ప్రాణము తెచ్చి నిలిపె

అన్న మయ్యను దలచిన అఘము లరుగు.



అలరు మంగను విభునిని అర్చ నలుగ

పదము లన్నియు హరికిని పరిమ ళాలు

మధుర భక్తిని జగమున మలపి నావు

తలచి మొక్కుదు నన్నను తగును మనకు.


పదకవితలకు జేజేలు పలుకు వాడ

వేద ములసార మంతయు విదిత మయ్యె

అన్న మయ్యని కీర్తన లలరు చున్న

తెలుగు బాసకు వెలుగులు దెచ్చు నపుడు.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

29.4.2026




28 ఏప్రిల్, 2026

ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం- 2026

 ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం (World Veterinary Dayప్రతి ఏటా ఏప్రిల్ చివరి శనివారం జరుపుకునే ఈ దినోత్సవం)



పాప నేడ్వగ పాలని పరగు నట్లు

అమ్మ ప్రేమను అలరియు అమరు నట్లు

మూగ జీవుల ముదమున ముట్టి జూడ

వాసి కెక్కును వాస్తవ వాణి తోడ.


వాన కురిపింప వానలు వార ధిగను

ధాత్రి సస్యము ధాన్యము ధార నట్లు

వైద్యు డెప్పుడు వాత్సల్య వరుస తోడ

సాకు నెప్పుడు సమ్మత సరణి తోడ.


కాపు కున్నట్టి కామిత కామ ధేను

పాడి పంటలు పరగిన పథము నందు

మేలు గూర్చును మేలుగ మేలు నిడును

శక్తి నిచ్చును శమ్మగు శాంతి తోడ.


పాడి పశువులు పాలిడ పార వశము

కోశ మందున కోరిన కోటి యట్లు

రక్ష సేయుము రాజిల్లు రమ్య పథము

ధరణి నరులకు ధన్యత ధాత నిడును.


వాడి పోయిన వాటము వార నట్లు

తోట మాలియు తోయము తోడు నట్లు

రోగ మొచ్చిన రోగిత రోజు నపుడు

వైద్యు డిచ్చును వైభవ వైఖ రిలను.


ఎండ వేళల ఎండను ఎలమి నాపి

నీడ నిచ్చెడి నీరజ నీడ నట్లు

బాధ నున్నట్టి బాధిత బాట గనగ

కరుణ జూపుము కమ్మగ కన్నెలట్లు.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

28.4.2026


ప్రపంచ పని ప్రదేశ భద్రతా దినోత్సవం 2026

 ప్రపంచ పని ప్రదేశ భద్రతా దినోత్సవం 2026

(World Day for Safety and Health at Work)

పనిని జేసెడి ప్రాంతాన పదిల మవగ

కంటి రెప్పయు కనుపాప కాచు నట్లు

మేలు గూర్చును మెలకువ మేదినందు

భౌతి కమ్మగు భాగ్యము భౌవ్య మవగ.


వరుస తప్పక వర్తించు వాడు ధరణి

ఏరు గట్టుల ఎడబాక ఏగు నట్లు

అపద రాకుండ ఆపును అలరి నెపుడు

భావ్య మగునట్టి భౌతిక భౌమ శుభము.


పదిల మొప్పుగ పనినిట పరువ జేయ

కవచ మున్నట్టి కూర్మము కరణి నట్లు

హాని కలుగదు ఎన్నడు హాయి గూర్చు

రక్ష నిడునుది రాజిల్లు రమ్య పథము.


మేలు గూర్చును మేలుగ మేని కిలను

కంటి రెప్పయు కనుపాప కాచు నట్లు

జాగ్ర త్తుండిన జయమౌను జగతి యందు

భీతి నొందక భిన్నత భిలము నందు.


వాసి కెక్కును వాస్తవ వాణి తోడ

శక్తి నిచ్చును సమ్మత శాంతి గొలిపి

పంట పొలముల పచ్చన పరగు నట్లు

భావ్య మగునట్టి భాగ్యము భాసి లంగ.


దీప మెప్పుడు దీప్తిని దీర్చు నట్లు

చూడ చక్కని చూపుల చూర గొనగ

జాగ్ర త్తుండిన జయమౌను జగతి యందు

హాని కలుగదు ఎన్నడు హాయి గూర్చు.


పట్ట మున్నట్టి పరువైన పథము నందు

రైలు బండియు రయమున రాక జేయు

వరుస తప్పని వాస్తవ వరుస తోడ

క్లేశ ముండదు కీర్తిని కేళ గొనగ.


కలసి మెలసియు కార్యము కలిమి జేయ

అల్లి బిల్లగ అందము అలరి నట్లు

సాలె గూడున సవరించు చాతు రిమయు

మేలు గూర్చును మేలుగ మేని కిలను.


అలరి అశ్రద్ధ యెప్పుడు ఆపద నిడు

ఏరు గట్టుల ఎడబాక ఏగు నట్లు

నీటి పడియలు నిలచిన నిజము గనగ

కీడు గూర్చును కఠినము గలత తోడ.


కలిసి మెలసియు కార్యము కలిమి జేయ

తేనె టీగలు తెగువను తేనె గూర్చు

సమత నిలుపును సద్గుణ సరణి తోడ

ధరణి నరులకు ధన్యత ధాతృ విభవ.



వరుస తప్పక వాస్తవ వరుస తోడ

తార లన్నియు తరినిట తనరు నట్లు

చూడ చక్కని చూపుల చూర గొనగ

మేలు గూర్చును మెలకువ మేలు నిడును.


పగ్గ మున్నట్టి పరువైన పథము నందు

గాలి పటమును గగనాన గనగ నట్లు

జాగ్ర త్తుండిన జయమౌను జగతి యందు

నిలచి గెలుచును నిశ్చల నీతి తోడ.


చీక టెల్లను చిన్నగా చీల్చు నట్లు

దీప మెప్పుడు దీప్తిని దీర్చు నట్లు

ముందు చూపున ముదమౌను ముక్తి తోడ

కాంతి నిచ్చును కమ్రత కలిమి నొసగి.


నిరత మభ్యాస నిపుణత నిలచి యున్న

వంతె నప్పుడు వారధి వరుస నట్లు

క్లేశ ముండదు కీర్తిని కేళ గొనగ

చెరగ దెప్పుడు చేతలన్ చెలువు నిడును.


వాన వచ్చిన వారధి వాకి లందు

గొడుగు రక్షణ గోరిన గుణము నట్లు

కీడు రాకుండ కీర్తిని కీలు జేయు

సాకు నెప్పుడు సమ్మత సరణి తోడ.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

28.4.2026