"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

పుస్తకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10 జనవరి, 2016

నా కవిత్వం ‘‘నెమలికన్నులు’’ కవితా సంపుటిగా రాబోతోంది

ఈ వారంలో నా కవిత్వం ‘‘నెమలికన్నులు’’ కవితా సంపుటిగా రాబోతోంది.నా కవిత్వం గురించి చాలా మంది గతంలో రాసిన అభిప్రాయాలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించాను.  దీనికి ముఖచిత్రంగా  ప్రసిద్ధ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ గారు అర్ధవంతమైన కవర్ పెయింటింగ్ వేసిచ్చారు.  ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



. నెమలికన్నులు  ముఖచిత్రం పై ఉన్న పెయింటింగ్ అంతరార్థమేమై ఉంటుందనే దానికి  డా.మల్లెగోడ గంగా ప్రసాద్ తన ఫేస్ బుక్ లో ఇలా వ్యాఖ్యానించారు. దాన్నిక్కడ పునర్ముద్రిస్తున్నాను. 
డా. మల్లెగోడ గంగా ప్రసాద్ Facebook లో రాసిన వ్యాఖ్యలను కింద పునర్ముద్రిస్తున్నాను.


భారతీయ సామాజిక వ్యవస్థ ప్రధానంగా చాతుర్వర్ణమూలాల్ని కలిగి నిర్మితమైంది. దానికి అనుబంధంగా వచ్చిందే పంచమవర్ణం. వీటిని ప్రతీకాత్మకంగా చిత్రకారుడు జంతువుల్ని చిత్రించి ఉండొచ్చు.
  • చాతుర్వర్ణం నుండే రకరకాల ఉపకులాలు మళ్ళీమళ్ళీ పుట్టుకొచ్చినా, వాటిలో ‘ పంచమవర్ణం’ సమాజానికి దూరంగా నెట్టివేయబడింది. దీన్ని విడిగా దూరంగా ఉన్న జంతువు ప్రాతినిథ్యం వహిస్తుందనుకుంటున్నాను.
  • భారతదేశంలోని సాంఘికహోదానీ, ఆర్థిక, రాజకీయాధికారాలను అనుభవిస్తూ విలాసవంతంగా జీవించే లక్షణాలున్న వర్ణాలవారిని నాలుగు జంతువుల్లోను చిత్రకారుడు చిత్రించి ఉండొచ్చు. వీటిని వాటి కొమ్ములకున్న రకరకాల రంగుల ద్వారాను, వాటి శరీరఛాయ, వాటి హావభావాల ద్వారా గమనించేలా చేశాడనుకుంటున్నాను.
  • నాలుగు బలిసిన దున్నపోతులు అలంకరించుకొని సమాజాన్ని ఆక్రమించుకొన్నస్థితి చిత్రంలో కనిపిస్తుంది. ఒకటి మాత్రమే విడిగా ఉంది. దానికి ఎలాంటి అలంకరణా లేదు. దాని కళ్ళల్లో విషాదం తొణికిసలాడుతున్నట్లుంది.
  • ఒక బాలుడు కర్రపట్టుకొని మార్గానికి అడ్డంగా నిలబడిన ఆ పశువుల్ని విదిలిస్తున్నాడు.
  • ఆ బాలుడు నీలిరంగు నిక్కరు , ఎరుపురంగు చొక్కాలను ధరించాడు. నీలిరంగు అంబేద్కరిజానికీ, ఎరుపురంగు కమ్యూనిజానికీ ప్రతీకలుగా చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్నవాళ్ళు కమ్యూనిస్టులైతే, ప్రజాస్వామిక పంథానే ప్రధానం చేసుకొని ఉద్యమాలు చేస్తున్నవాళ్ళు అంబేడ్కరిస్టులు.
  • అడ్డంగా నిలబడిన పశువుల్ని బాలుడు తన చేతిలో ఉన్న కర్రతో విదిలిస్తున్నాడు.
  • దూరంగా కనిపిస్తున్న ఊరు, ఇళ్ళు, పక్కన పచ్చనిపొలాలు... వాటివైపు ఈ నాలుగు పశువులు దృష్టిని కేంద్రీకరించాయి. వాటిని కర్రతో కొడుతూ బాలుడున్నాడు. భారతీయ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు రాజకీయాల ద్వారా ఆ గ్రామాన్నీ, ఆ ఇళ్ళనీ, ఆ పచ్చదనాన్నీ తామెలా స్వాధీనం చేసుకోవాలో ఆలోచిస్తున్న నాలుగు వర్ణాల వారు ఆలోచిస్తున్నట్లుంది. దాన్ని నెరవేరనివ్వనన్నట్లు బాలుడి చేతిలోని కర్ర కనిపిస్తుంది.
  • తాగడానికి కొన్నినీళ్ళు, కట్టుకోవడానికి బట్ట ఉన్న ఆ బాలుడు తినడానికి భుజాన తువ్వాల్లో ఏదొక ఆహారపదార్థం మూటకట్టుకున్నాడు.
  • ఆ బాలుడు చదువుకున్న కవి, రోడ్డుకడ్డంగా నిలబడ్డ పశువులు ఊరుని నాశనం చేయాలనుకునే ఆధిపత్యవర్ణాలు, వర్గాలు గా చెప్పుకోవచ్చుననుకుంటున్నాను. నెమలికన్నులు కవిత్వంలో ఉన్న వస్తువు అంతా దీన్ని ప్రతీకాత్మకం చేసేలా చిత్రకారుడు చిత్రించాడనుకుంటున్నాను. 

19 అక్టోబర్, 2015

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం గ్రంథావిష్కరణ సభ విశేషాలు

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
సభావేదికలో కట్టిన ఆవిష్కరణ బ్యానర్
ఆహ్వాన పత్రం 
ఆవిష్కరణ నాటి గ్రంథ ముఖచిత్రం
స్వాగతం పలుకుతున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
సభ ప్రారంభానికి ముందున్న సభలో ప్రేక్షకులు, వక్తల దృశ్యం
గ్రంథాన్ని ఆవిష్కరించిన మాట్లాడుతున్న డా. సి.నారాయణరెడ్డి గారు, పక్కనే ఆసక్తిగా వింటున్న పరిశోధకురాలు డా.పుట్ల హేమలతగారు.
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథ ఆవిష్కరణానంతరం
 అధ్యక్ష ఉపన్యాసం చేస్తున్న ఆచార్య ఎన్. గోపిగారు.
సభలో పాల్గొన్న డా.పుట్ల హేమలత గారి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, ప్రేక్షకులు

సభలో పాల్గొన్న డా.పుట్ల హేమలత గారి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, ప్రేక్షకులు
ప్రసంగిస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు
ప్రేక్షకుల్లో డా. మంజుశ్రీ

ప్రేక్షకుల్లో కవులు జుగాష్ విలీ, డా. రఘు పరిశోధక విద్యార్థులు
తెలంగాణ సారస్వత పరిషత్ ముఖద్వారం, దాని కిందుగా ఆవిష్కరణ వివరాలతో కూడిన బ్యానర్

సభలో పాల్గొన్న కథారచయిత్రులు అద్దేపల్లి జ్యోతి, సమ్మెట ఉమాదేవి. కన్నెగంటి అనసూయ, కవయిత్రి మెర్సీ మార్గరెట్ తదితరులు 

రచయిత్రి వలబోజు జ్యోతి గారు, డా. వాసాప్రభావతిగారు  తదితరులు

సభ ప్రారంభానికి ముందు నల్లమోతు శ్రీధర్ గారిచ్చిన పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
భూమిక మాసపత్రిక ఎడిటర్ సత్యవతిగారు తదితరులు 
ప్రముఖ పరిశోధకుడు, అధ్యాపకుడు ఆచార్య బన్న అయిలయ్యగారు, ప్రముఖరచయిత్రులు అరుణగారు, తరిమిశ జానకిగారు తదితరులు
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న రచయిత్రి సమ్మెట ఉమాదేవిగారు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న రచయిత్రి కన్నెగంటి అనసూయగారు 
పరిశోధక విద్యార్థులు సతీస్, ప్రకాశ్ , ఆదినారాయణ, కవి జుగాష్ విలీ తదితరులు 
డా.హేమలతగార్ని ఆలింగనం చేసుకుంటున్న ఒక ఆత్మీయురాలు 
ఆచార్య ఎన్. గోపిగారు ఏదో చెప్తున్న విషయాన్ని ఆసక్తిగా, వినయంగా వింటున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, పక్కనే నల్లమోతు శ్రీధర్ గారు 
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కవయిత్రి మెర్సి మార్గరెట్, రచయిత్రి తరిమిశ జానకిగార్లు ఉమాదేవిగారు 
రచయిత్రులతో డా. హేమలతగారు 
ప్రసంగాలను ఆసక్తిగా వింటున్న డా.దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగార్లు  
ఆచార్య బి.రాజశేఖర్ గారి కుటుంబసభ్యులతో ఆత్మీయంగా డా.హేమలతగారు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులతో డా. దార్ల, ఆచార్య రాజశేఖర్, డా. హేమలతగార్లు

సభలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావుగారు

సభలో మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావుగారు. కింద వీడియో

సభ ప్రారంభానికి ముందు సభావేదికపై వక్తలు
సభాధ్యక్షలు ఆచార్య ఎన్.గోపి గారి ప్రసంగ దృశ్యం
డా.రఘుగారు, డా.యాకూబ్ గార్ల గుసగసలేమిటో...

చయిత్రి డా.హేమలత గారితో సమ్మెట ఉమాదేవిగారు, డా.వాసా ప్రభావతిగారు, తరిమిశ జానకిగారు
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న రచయిత్రి తరిమిశ జానకిగారు
 డా.అద్దేపల్లి జ్యోతి, సమ్మెట ఉమాదేవి, కన్నెగంటి అనసూయ, డా.మంజుశ్రీ, డా. దార్ల, మెర్సీ మార్గరెట్ గార్లు


(ఫోటోలు: డా.హేమలత గారి సౌజన్యంతో)

16 మార్చి, 2015

‘‘మేము సైతం’’ పుస్తకావిష్కరణ దృశ్యాలు (కొన్ని)

డా. అసిలేటి నాగరాజు ప్రధానసంపాదకత్వంలో, చిక్కా హరిష్ కుమార్ సంపాదకత్వంలో ‘‘ మేముసైతం’’ అనే పేరుతో వెలువరించిన కథాసంకలనాన్ని నిన్న (15 మార్చి 2015) రవీంద్రభారతి( మినీ కాన్ఫరెన్సుహాలు)లో ఆవిష్కరించి, పుస్తకపరిచయసభను నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు. సభకు డా.పిల్లలమర్రిరాములుగారు అధ్యక్షత వహించారు. నేను (డా.దార్ల వెంకటేశ్వరరావు)ఆత్మీయ అతిథిగా పాల్గొన్నాను. పుస్తకాన్ని ఇంద్రవెల్లి రమేష్ గారు పరిచయం చేశారు. సభలో వికలాంగుల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్న గంగారాంగారు, వికలాంగుల కోసం పత్రికను కూడా నిర్వహిస్తున్న రాజేంద్రగారు పాల్గొన్నారు. సభ జ్యోత్స్నాఫణిజ ప్రార్థనాగీతంతో ప్రారంభమైంది. మల్లేష్ వందనసమర్పణ చేశారు. సభలో డా.అసిలేటినాగరాజు, చిక్కాహరీష్ కుమార్ లు తమ స్పందనను తెలిపారు. నాగరాజు తల్లిదండ్రులకు, సోదరికీ, అలాగే చిక్కాహరీష్ సోదరికీ ఈ సందర్భంగా సభలో పాల్గొన్న అతిధుల చేతిమీదుగా సన్మానించారు. పుస్తకపరిచయ సభకు వచ్చిన అతిథులను నిర్వాహకులు తగిన రీతిలో సన్మానించారు. దీనితో పాటు ‘‘అవిటికథల’’పై పరిశోధన చేసిన బాలిరెడ్డిని, ఉస్మానియాలో పరిశోధన చేస్తున్న కుమారి ఉపేంద్రను కార్యనిర్వాహకులు సన్మానించారు.  సభ చాలా ఆత్మీయంగా జరిగింది. ఈ సందర్భంగా నేను మాట్లాడిన మాటలు ఆడియో ఇక్కడ వినొచ్చు.





‘‘మేముసైతం’’ కథాసంకలనాన్ని ఆచార్య తుమ్మల రామకృష్ణగారు ఆవిష్కరిస్తున్న దృశ్యం

సభలో డా.దార్ల వెంకటేశ్వరరావుని సన్మానిస్తున్న దృశ్యం

సభలో పాల్గొన్న ప్రేక్షకులు

సభకు వచ్చేముందు ఆచార్య తుమ్మల రామకృష్ణగారితో డా.దార్ల వెంకటేశ్వరరావు

డా.దార్ల వెంకటేశ్వరరావుతో పోస్ట్ డాక్టోరల్ ఫెలో డా. వెంకటరమణ

డా.దార్ల వెంకటేశ్వరరావుతో పరిశోధక విద్యార్థి నాగరాజు