"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

08 జులై, 2026

నేను వాడికి కథ చెప్తూనే ఉంటా…!

 నేను వాడికి కథ చెప్తూనే ఉంటా…!




వాడు కథ చెప్పమంటాడు

 ఊ కొడుతూ... ఊ కొడుతూ...

 హాయిగా నిద్రపోతాడు.

 నేనింకా కథ చెప్తూనే ఉంటా...

వాడి కలల్లోకి

 నా మాటలు చిరునవ్వులై

 చేరాయేమో అని ఊహిస్తూ

 కథ చెప్తూనే ఉంటా!

మధ్యలో

 ప్రశ్న అడిగే ఆ చిన్న గొంతు

 నిశ్శబ్దమైపోయిందంటే

 నిద్ర

 వాడిని ఒడిలోకి తీసుకుందన్న మాట.

అయినా

 నేను మాత్రం కథను ఆపలేను.

 ఆపితే

 ఆ నిద్రకెక్కడ భంగం కలుగుతుందో!

రేపు

 అదే కథను

 మళ్లీ మొదటి నుంచే చెప్పమంటాడు.

 విన్న చోటు గుర్తుండదు,

 నా గొంతులో

 ఏదో జోలపాట మాత్రం

 గుర్తుండిపోతుంది.

నేను కథ చెప్తూనే ఉంటా...

 హాయిగా నిదురపోయే

 ఆ మోముపై

 చిరుదరహాసం విరియడాన్ని చూస్తూ

 కథ చెప్తూనే ఉంటా.

నేను

 వాడి బాల్యానికి

 ఒక మధురమైన జ్ఞాపకమై

 మిగిలిపోవాలనో...

లేదా

 ఏదో ఒక రోజు

 వాడూ

 తన కొడుక్కి కథ చెబుతుంటే,

 ఆ గొంతులో

 నా గొంతు ప్రతిధ్వనించాలనో...

నేను

 కథ చెప్తూనే ఉంటా...!

— ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

 8.7.2026


కామెంట్‌లు లేవు: