"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

23 ఏప్రిల్, 2026

ప్రపంచ తాబేలు దినోత్సవం (World Turtle Day)

 ప్రపంచ తాబేలు దినోత్సవం (World Turtle Day)


మంద గమనాన నడచిన మహిని గెలుచు

ఓర్పు తోడను సాగిన నొప్పు గమ్య

మెంత కష్టము వచ్చిన నెదురు నిలుచు

కూర్మ గుణమున నేర్వగా కోరు కొనుము.


పరుగు పందెము నందున పడు శశకము

అలిసి నిద్రించె గర్వము నాత్మ లోన

నిలకడగ సాగి తాబేలు నిలిచె నాడు

పట్టు విడువని శ్రమయెగా పడయు జయము.


గొప్ప లనుకొన డెప్పుడు కూర్మ రాజు

ధనము కీర్తుల వెనుకను ధావ ముడిగి

తృప్తి తోడను జీవించు తరణి పైన

నరుడు నేర్వగ వలయును నడక జూసి.


అడుగు చిన్నదె యైనను నాగకుండ

ముందు కడుగులు వేయుచు మురియు గనుము

గమ్య స్థానము చేరును గర్వ ముడిగి

నిలకడె నిజమౌ విజయాన నిలుచు బాట.


కాల చక్రము మారిన గలగ బడక

తనదు పంథాను వీడక తలచు మదిని

ఓర్పు కలిగిన వారికి నోటమేది

కూర్మ రూపము నేర్పెడి గుణము లివియె.


బాహ్య లోకపు రొదలను బార దోలి

తనదు లోపలి శాంతిని తలచు నెపుడు

కలత లేనిట్టి మది తోడ గడప వలయు

కూర్మ సత్త్వము మనకును గూర్చు నిజము.

డా.దార్ల వెంకటేశ్వరరావు 23.5.2026 




కామెంట్‌లు లేవు: