"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

01 జూన్, 2025

తెలుగు చరిత్ర, సంస్కృతుల వారధి కస్తూరి విజయం

 

శింగలూరు హరనాథ్ గారి ' తెలుగు -వెలుగు' దాన్ని ఆవిష్కరించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు













తెలుగు వారు భిన్న రాష్ట్రాలలో, భిన్న దేశాల్లో ఉన్నప్పటికీ ఆ సాహిత్యాన్ని పుస్తకాలుగా ప్రచురించడం ద్వారా తెలుగు చరిత్ర, సంస్కృతుల వారధిగా కస్తూరి విజయం ప్రచురణలవారు కృషి చేస్తున్నారని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. శనివారం (1.6.2025) నాడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ ఎన్.టి. రామారావు కళా వేదికపై ‘ఇంటర్నేషనల్ ఇంక బౌండ్’ పేరుతో కస్తూరి విజయం (మలేషియా) వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పామిరెడ్డి సుధీర్ రెడ్డి, శ్రీమతి పద్మజా రెడ్డిగార్ల ఆధ్వర్యంలో వందలాది మంది రచయితల కథలు, కవితా సంకలనాలు, వ్యాసాలు అనువాద గ్రంథాలను ఈ వేదికపై ఆవిష్కరించారు. కవులందరినీ ఒకే వేదికపై వివిధ సెషన్స్ వారీగా సత్కరించాలనుకోవడం వినూత్నంగా అనిపించింది. శనివారం (31.5.2025) మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో డా. సబ్బని లక్ష్మీనారాయణ గారి ‘అక్షరధామ్’ గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానంద రావుగారు ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుతం రచయిత పుస్తకం ప్రచురించడమంటే చేతులు కాల్చుకోవడమేనని, తన సాహిత్యాన్ని పాఠకులకు అందించాలనే తపనతో స్వంత డబ్బుతో పుస్తకం వేస్తున్నా, వాటిని కొని చదవేవారు కరువయ్యారని చెప్పారు. కవులు కళాకారులు రచయితలు ఉన్న ఆ సభలో ఆ కామెంట్ చేయడం వెనుక కేవలం రాయడమే కాదనీ పుస్తకాలు కూడా కొనాలనే ఒక సందేశాన్ని పంపించినట్లు అయింది. కవి నూతలపాటి నాగేశ్వరరావుగారి సంపాదకత్వంలో వెలువడిన ‘కథల పరిమళాలు’, ‘వెన్నెల పరిమళాలు’ పుస్తకాలను నూతలపాటి వారే ఆవిష్కరించారు. ఐ. ఆర్. ఎస్ అధికారి శ్రీ శింగలూరు హరనాథ్ గారు రచించిన ‘తెలుగు-వెలుగు’ కావ్యాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కావ్యం లో ఉభయ రాష్ట్రాలలోని కవులు కళాకారులు, విశేషమైన రచనలను తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని కవి మాత్రాచందస్లో షిప్తంగా సౌందర్య భర్తగా వర్ణించారని ప్రశంసించారు. కలర్ లో అందంగా ఆకర్షణీయంగా ప్రచురించిన ఈ పుస్తకం ప్రస్తుత తరుణంలో ప్రచురించవలసిన ఒక పుస్తకంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారు మరలా కలిసి తమ సాంస్కృతిక అంతా సమైక్యతను చాటడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పుస్తకంలోని పద్యాలు సరళంగా సుందరంగా కంఠస్థంపట్టే విధంగా, చరిత్ర సంస్కృతిని ప్రబోధించే విధంగా ఉండటం వలన పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలుగా పెట్టడానికి కూడా అవకాశం ఉందని ఆయన సూచించారు. తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు తెలుగు సాహిత్యాన్ని ఒక ఆప్షనల్ గా తీసుకున్నారని ఆ ప్రేమతో సాహిత్యం పట్ల తనకు అభిరుచి ఏర్పడి కొన్ని పుస్తకాలను కూడా రచించినట్లుగా కవి శ్రీ సింగలూరి హరినాథ్ గారు వివరించారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారి కొన్ని పద్యాలను ఆయన రాగయుక్తంగా వినిపించారు. ‘తెలుగు-వెలుగు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సత్యనారాయణ గారు ఆ పుస్తకాన్ని చక్కగా సమీక్షించారు. కస్తూరి విజయం సంస్థ నుండి పామిరెడ్డి సుధీర్ రెడ్డి గారి సంపాదకత్వంలో ‘మనీ మైండ్ సిగ్నేచర్స్’ , ‘ఆనందోబ్రహ్మ’ ఆవిష్కరించారు. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి ప్రొఫెసర్ అన్నపూర్ణ గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మాణిక్యంబ గారు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్య మధ్యలో తెలుగు సాంస్కృతిక వైభవాన్ని తెలిపే భరతనాట్యం, సంగీత కార్యక్రమాలు జరిగాయి. చిన్న పిల్లల నృత్యాలు, వారు ఆలపించిన శ్లోకాలు, గేయాలు ఎంతో బాగున్నాయి. విడతలవారీగా జరిగిన ఈ సాహిత్య కార్యక్రమంలో వందలాది మంది రచయితలు, కవుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు ఒక నిబంధన పెట్టారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ నెంబర్లు కేటాయించారు. ఆ నెంబర్లను కొన్నింటిని లక్కీ డ్రా తీశారు. వాళ్లకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇవ్వడం ఒక ప్రత్యేకత. దేశదేశాల్లో తెలుగు పుస్తకాలను ప్రచురిస్తున్న కొంత మంది ప్రచురణకర్తలకు, సామాజిక సాంస్కృతిక సేవ చేస్తున్న వారికి విశిష్ట పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. తెలుగు కవులు, రచయితలతో రచయిత్రులు కళాకారులతో యూనివర్సిటీ ప్రాంగణం తెలుగు సంస్కృతీ చరిత్రలను ప్రతిబింబించేలా కార్యక్రమం కొనసాగింది. 



 





 

కామెంట్‌లు లేవు: