"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

19 జులై, 2023

గుర్రం జాషువా ' ముంటాజ్ మహల్ ' పై ప్రసంగం


పవిత్ర దాంపత్యానికి నిలువెత్తు చిహ్నం ముంతాజ్ మహల్



న్యాయం దినపత్రిక, 19.7.2023 సౌజన్యంతో 



నవతెలంగాణ దినపత్రిక, 20.7.2023 సౌజన్యంతో 





షాజహాన్ తన భార్య ముంతాజ్ పేరుతో ఆగ్రాలో నిర్మించిన ముంతాజ్ మహల్ సమాధి ప్రపంచంలోనే ఒక గొప్ప కళాఖండమైతే, వారి హృదయ స్పందనలను, దాంపత్యంలోని అనురాగాన్ని వినిపించే గొప్ప రసభరిత కావ్యంగా వర్ణించారని హెచ్సీయూ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. సోమవారం (18.7.2023) నుండి సేవ తెలుగు భాష, సాంస్కృతిక సేవా సంస్థ ( తిరుపతి, నెల్లూరు) వారి ఆధ్వర్యంలో అంతర్జాలంలో ప్రారంభమైన ఒక వారం పాటు నిర్వహించే గుర్రం జాషువా సాహితీ సప్తాహంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. షాజహాన్ నిర్మించిన ముంతాజ్ మహల్ భవనం కదలకుండా అక్కడికి వెళ్ళిన వారికి మాత్రమే‌ ఆనందాన్ని కలిగిస్తుంటే, మహాకవి జాషువా వర్ణించిన ముంతాజ్ మహల్ కావ్యం ఎక్కడున్నవారినైనా  ఆ వర్ణనలతో సౌందర్య భరితం చేయగలుగుతుందని ముంతాజ్ మహల్ కావ్యసౌందర్యం పై  చేసిన ప్రసంగంలో  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా వివరించారు. 

ముంతాజ్ మహల్ కావ్యాన్ని అయిదు రకాలుగా విశ్లేషించుకోవచ్చునని వెంకటేశ్వరరావు వివరించారు. అవి:

1.ముంతాజి సౌందర్యానికి మోహితుడు కావడం. అది బాహ్య సౌందర్యం. కానీ తర్వాత ఆ మోహం ప్రేమగా మారుతుంది.

2. భార్యాభర్తల మధ్య నిజమైన అనురాగానికి ప్రతీకగా జీవించడం.

3. ఆమె మరణించిన తర్వాత భర్త షాజహాన్ మానసిక స్థితి.

4. చారిత్రక విషయాన్ని కావ్యంగా రచించడంలో కవి నిపుణత. కల్పన, స్వప్నవృత్తాంతం. ముఖ్యంగా ప్రతిపద్యం భావుకతతో ఔచిత్యమంతంగా వర్ణించడం

5. లౌకికమైన సౌందర్యానికీ, అలౌకిక సౌందర్యానికి మధ్య గల తాత్విక ఆలోచనలు. ఇక్కడే భారతీయ కావ్య

   సంప్రదాయాలు, భారతీయుల ఆలోచనలు కవి వ్యక్తీకరణలో వ్యక్తం కావడం… అనే అంశాల ద్వారా కావ్యం చదవడం పూర్తయిన తర్వాత షాజహాన్ - ముంతాజ్ పాత్రలకు బదులు భార్యా భర్తలు మాత్రమే పాఠకులలో నిలుస్తారని, ఆ విధంగా ముంతాజ్ మహల్ కావ్యాన్ని  దాంపత్య ప్రేమకు ప్రతికగా సాధారణీకరించి రాసారని అన్నారు. 


ఈ ప్రారంభ సమావేశానికి ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఈ దేశంలో కులం ఉన్నంత వరకు జాషువా సాహిత్యం ప్రాసంగికమేనని, శిశువు నుండి స్త్రీవాదం వరకు జాషువా స్ఫర్శించని అంశం లేదన్నారు. జాషువా చివరికి వచ్చేసరికి ఆయన డా.బి.ఆర్. అంబేద్కర్ వాదిగా కనిపిస్తారని అన్నారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళుతూ జాతిని చైతన్యం చేయడంలో భాగంగానే తాము కూడా జాషువా సాహిత్యవేదికను కూడా స్థాపించామని గుర్తుచేశారు. 

ముఖ్య అతిథిగా మహాకవి జాషువా కళా పీఠం మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి వర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ జాషువా సాహిత్యాన్ని చదవడమంటే భారతీయ సమాజాన్ని తెలుసుకోవడమేననీ, తెలుగు సమాజంలో జాషువా సాహిత్య విరాట్ స్వరూపాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. జాషువాలో గాంధీజీలో గల సంస్కరణభావాలు, మానవతా విలువలు ముఖ్యంగా గుర్తించాలని, అందువల్లనే ఆయన గొప్ప మానవతావాది అని అన్నారు. తెలుగు భాషకు మరణం లేదనీ, అయినా దాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొని రావడానికి జాషువా సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆయన సాహిత్యం తెలుగు భాషను శక్తివంతం చేసే ఒక గొప్ప సాధనంగా ఆయన వ్యాఖ్యానించారు. 

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత, సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి స్వాగత వచనాలు మాట్లాడుతూ ఈ వారంలో ఇరవైమంది వక్తలు, పదిమంది అతిథులు జాషువా సాహిత్యం గురించి వివరిస్తారని ఆయన పేర్కొన్నారు. జాషువా మొదట ఆస్తికుడుగా కనిపించినా, చివరికి నాస్తికుడుగా మారారని ఆయన పేర్కొన్నారు.


 ఈ కార్యక్రమంలో జాషువా మనుమడు, ప్రముఖ సినీ నటుడు, గాయకుడు,సంగీత దర్శకుడు సుశీల్ కుమార్ ప్రత్యేక అతిథిగా పాల్గొని తన తాతగారి సాహిత్యంపై వారం పాటు ప్రముఖులతో ప్రసంగాలు చేయించి, వాటిని యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్న సేవ సంస్థను అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. జాషువా విశ్వమానవవుడనీ, కులానికీ, మతానికీ ఆయన సాహిత్యం చోటునివ్వలేదనీ, ఆయన అలాంటి భేదభావాలు లేని కొత్తలోకాన్ని కలగన్నారని ఆయన చెప్పారు. 

ప్రముఖ కవి, విమర్శకులు ఆచార్య కర్రి సంజీవరావు (శిఖామణి) జాషువా ఫిరదౌసికావ్యసౌందర్యాన్ని సోదాహరణంగా తెలిపారు. సేవా సంస్థ అధ్యక్షులు కంచెర్ల సుబ్బానాయుడు జాషువా సాహిత్యం విశ్వవినమైనదని దాన్ని ప్రతి ఒక్కరూ చదవవలసిన అవసరం ఉందని దీనిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆచార్య సిహెచ్.సుశీలమ్మ,  ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి కొణిదల శోభ సేవ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. వీరితో పాటు కార్యక్రమనిర్వాహకులు, బోర భారతీదేవి వందన సమర్పణ చేశారు..  ఈ అంతర్జాల ప్రారంభ సమావేశంలో వీరితో పాటు డా.బద్దిపూడి జయరావు, శిల్పాజగదీశ్, డా.పిళ్ళా వెంకటరమణమూర్తి, శ్రీకాంత్ కుమార్,మలేషియా నుండి సత్య మల్లుల, కె.పోతన్న, మల్లేశం గురప్ప, డా.జోగేశ్వరనాయుడు. డి.యువశ్రీ, జి.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక, చెన్నై, 19.7.2023 సౌజన్యంతో 

https://newsbyte.net/?p=99


దిశ దినపత్రిక, 19.7.2023 సౌజన్యంతో


కామెంట్‌లు లేవు: