16 ఏప్రిల్, 2026

ప్రపంచ స్వరం దినోత్సవం

 ప్రపంచ స్వరం దినోత్సవం



ఆ.వె.

మాట తీరు జెప్పు మనుజుని గుణమును

స్వరము తెలుపు నెపుడు సౌమ్యతలను

గొంతు నాద మదియె కోటి సంపద సుమా!

కంటి పాపవోలె కాచుకొనుము


ఆ.వె.

కాకి నల్లనౌను - కోకిల నల్లనౌ

నల్లవైన రెండి నడుమ భేద

మెరయు చుండు నూహ మెయి వసంతము రాగ

స్వరము బట్టి మనకు తెలియవచ్చు!


తే.గీ.

మాట తీరున దెలియును మనిషి గుణము

పాట రీతిని గళమున పలక వలెను

స్వరము చక్కగ నున్నచో జగతి మెచ్చు

ప్రాణ వాయువు గళమున ప్రాణ మగును.


తే.గీ.

కవికి కలమున్న రీతిగ గాయకునకు

స్వరమె యొక గొప్ప నగయగు సాటి లేక

విశ్వ గళముల పండుగ వెలుగు నేడు

గొంతు కలిపిరి జనులెల్ల సంతసమున.


తే.గీ.

నాద మయమగు జగతిలో నరుని కంఠ

నాద మేగద ప్రాణమై నడచు నెపుడు

స్పష్ట మైనట్టి పలుకులే స్వర్ణ మగును

గొంతు నిలుపును మనిషికి గొప్ప పేరు.



తే.గీ.

గురువు బోధన జేయగ గొంతు కాదె

జ్ఞాన మార్గము జూపును నవని యందు

స్పష్ట మైనట్టి పలుకులు పసిడిడి వన్నె

కవికి కలమున్న రీతిగ గాయకునకు


తే.గీ.

పాట రీతిన బలికిన బహుళ సుఖము

మాట తీరున దెలియును మనిషి గుణము

తీపి గొంతున వెలయును దివ్య శబ్ద

మమిత శక్తిని నిచ్చును నవని లోన.


తే.గీ.

నీరు ద్రావిన గొంతుకు నెమ్మి గలుగు

హాని జేయని ఆహార మమర వలయు

శ్రద్ధ తోడను గళమును సాక వలెను

ప్రాణ వాయువు గళమున ప్రాణ మగును.


తే.గీ.

మంచి నీటిని ద్రావిన మమత తోడ

గొంతు దేరును నిశ్చయ మవని లోన

శ్రద్ధ తోడను గళమును సాక వలెను

హాయి నిచ్చును గళమున హర్ష మెపుడు.


తే.గీ.

జాతి భేదము లేనిది జగతి యందు

స్వరము నందలి మాధురి సాటి లేని

భాష లేకున్న భావము భౌమ మందు

మంచి మాటలే మనిషికి మణిగ నిలుచు.


తే.గీ.

స్వరమె యొక గొప్ప నగయగు సాటి లేక

విశ్వ గళముల పండుగ వెలుగు నేడు

గొంతు కలిపిరి జనులెల్ల సంతసమున.

స్వరము సంపద గాదె యీ జగతి లోన.


తే.గీ.

మంచి నీటిని ద్రావిన మమత తోడ

గొంతు దేరును నిశ్చయ గుణము తోడ

భాష లేకున్న భావము భౌమ మందు

జ్ఞాన దీప్తిని వెలిగించు జగతి యందు!

(మంచి నీటిని తాగుతూ, క్రమశిక్షణతో కూడిన అలవాట్లను పాటిస్తే గొంతు ఆరోగ్యంగా ఉంటుంది. భాష ఉన్నా, అది స్పష్టమైన స్వరం ద్వారా వ్యక్తం కాకపోతే లోకంలో భావ వ్యక్తీకరణ జరగదు. అటువంటి ఆరోగ్యకరమైన స్వరమే ప్రపంచంలో జ్ఞానమనే వెలుగును ప్రసరింపజేస్తుంది.)

తే.గీ.

మంచి నీటిని ద్రావిన మమత తోడ

తోడుగా నుండు స్వరమున దొడ్డ శక్తి

శక్తి రూపాన శోభిల్లు శాంతి ముక్తి

ముక్తి కన్నను మించిన ముదము నిచ్చు


(శ్రద్ధతో మంచి నీటిని సేవించడం వల్ల మన స్వరం ఎంతో ఆరోగ్యంగా తయారై గొప్ప శక్తిని పొందుతుంది. ఆ వాక్శక్తి వల్ల మనిషికి అంతర్గత శాంతి, తద్వారా అజ్ఞానం నుండి విముక్తి లభిస్తాయి. లోకంలో ఆ ముక్తిని మించిన ఆనందం, శక్తి మరేదీ లేవు.)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 

16.4.2026

తే.గీ.

మంచి నీటిని ద్రావిన మమత తోడ

తోడుగానుండు గళమున దొడ్డ శక్తి

శక్తి యున్నచొ భావము ముక్తి నిచ్చు

ముక్తి కన్నను మించిన ముదము లేదు

(మంచి నీటిని సేవించడం వల్ల గొంతుకు గొప్ప శక్తి లభిస్తుంది. ఆ వాక్శుద్ధి ఉన్నప్పుడే మన భావాలు సార్థకమై మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే అటువంటి ముక్తి కంటే మించిన శక్తి ఈ లోకంలో మరేముంటుంది?)


….

మంచి నీటిని ద్రావిన మమత తోడ

తోడుగానుండు గళమున దొడ్డ శక్తి

శక్తి యున్నచొ భావము ముక్తి నిచ్చు

ముక్తికన్నను మించిన శక్తియేది?



కావ్య పఠనము చేసిన కలుగు ధన్య

ధన్య రూపాన గళమున దాల్చు శక్తి

శక్తి యున్నచొ లభియించు ముక్తి సిద్ధి

ముక్తికన్నను మించిన శక్తియేది? 


గురుని బోధన విన్నచొ జ్ఞాన మబ్బు

మబ్బు వీడిన వెలుగును మహిమ శక్తి

శక్తి నిచ్చును గళమున ముక్తి జూప

ముక్తికన్నను మించిన శక్తియేది?


నెమ్మి తోడను గళమును నేర్పు కావ

కావ గల్గిన గలుగును కంఠ శక్తి

శక్తి తోడను పొందుము ముక్తి మార్గము

ముక్తికన్నను మించిన శక్తియేది?


సత్య వాక్కును బలికిన శాంతి కలుగు

కలుగు ముందర గారవ కంఠ శక్తి

శక్తి రూపాన శోభిల్లు శాంతి ముక్తి

ముక్తి కన్నను మించిన ముదము నిచ్చు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి