25 ఏప్రిల్, 2026

ప్రపంచ మలేరియా దినోత్సవం - 2026

 ప్రపంచ మలేరియా దినోత్సవం - 2026


దోమ కాటున దొరకును దోష రాశి

నీరు నిల్వగ నిలచును నిశ్చ యమ్ము

చిన్న కన్నాన జెడునయా చెరువు కట్ట

ముందె జాగ్రత్త నొందుట ముక్తి పథము.


మురికి నీటిని నిలువగ ముందె యణచు

దోమ సంతతి హెచ్చిన దోష మగును

అగ్ని రవ్వయు నొకటైన నడవి కాలు

రోగ మును తొల్త నణచుట రూఢి గాదె.


మశక ములవల్ల వ్యాపించు మైలు నెరిగి

రోజు రోనాల్డు రాసుయే రోగ మణచె

కీర్తి నొందెను లోకాన కినుక మాన్పి

ధన్య జీవుల దలచుట ధర్మ మగును.


రాచ నగరున రోనాల్డు రాసు జేసె

దోమ కాటున దొరకును దోష మంచు

కీర్తి నిలిచెను లోకాన కినుక బాపి

నేటి దినమున దలచుట నేర్పు గాదె.


ఇంటి దరిజేర నిలుచును ఇంకు గుంట

నీరు నిల్వగ దోమలు నిశ్చ యమ్ము

శుభ్ర మగుచున్న లోకాన శుభము కలుగు

రోగ రహితమౌ దేహమే రోహ ణమ్ము.


చుట్టు ప్రక్కల శుద్ధిగ జూడ వలెను

దోమ రాకుండ దలపున దోచు మెలకు

చెత్త చెదరము లేకున్న చెడును వ్యాధి

బాధ్య తగనుండ సౌఖ్యము భాసి లునుగ.


మురికి కాలువ లన్నిటి ముందె కడగ

ఈగ దోమల బాధలు ఏల కలుగు

వాడ వాడల నేర్పైన వరుస గనగ

అవని ఆరోగ్య భాగ్యము అందు నపుడు.



ధాత్రి  జనులకు మేలును  ధార బోయ

నీతి  వర్తన గలిగిన  నిపుణు  లెవరు

ప్రజల పక్షాన నిలచుట ప్రథమ విధిగ

భాసి  లుదురుగ  ప్రతినిధుల్ భవ్య  ముగను.



మేలు కలుగును నలుదెసల్ మెలకు వయును

దోమ పోటును దొలగగ దోవ గనుము

జాడ రోగపు దెలియుచు జాగ్ర తగను

ఉండ వలయును లోకాన ఉత్సు కతను.


జీవ గతికిది మూలమై జిలుగు నొలికె

దీని రూపము జూపిరి ధీర వరులు

వరుస గ్రమమున జీవపు వార సులము

సృష్టి మర్మము దెలియుట సిద్ధ మొకటె.


భాష నేర్వగ బాలలు భాసి లంగ

వేస వవి సెల వులయందు వేడ్క మీర

పద్య పఠనము నేర్చుచు పాట బాడు

ధన్య రూపము గలుగును ధాత్రి యందు.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

25.4.2026




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి