12 జులై, 2023

వాయిలెంట్ ట్రాన్స్ క్రిప్షన్!

 వాయిలెంట్ ట్రాన్స్ క్రిప్షన్!


పెరిగిన సాంకేతికత

మూగబోతున్న నా భావాలన్నింటికీ

ప్రాణం పోసి 

అక్షరాల ముత్యాల దండ చేస్తుందని సంబరపడ్డానేగానీ

మళ్ళీనాకు తెలియకుండానే 

నన్నో నిరక్షరాస్యుణ్ణి చేస్తుందని గమనించలేకపోయాను


ఎంత అందమైన అక్షరాలు

ఇంతలా చిక్క శల్యమైపోయి 

మళ్ళీ నన్ను ఓనమాలు దిద్దిస్తున్నాయి ! 


-దార్ల వెంకటేశ్వరరావు

29/6/2023.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి