12 జులై, 2023

ఆనందమెపప్పుడూ ఓ ప్రవాహమే !

ఆనందమెపప్పుడూ ఓ ప్రవాహమే !

పర్వతం ఎత్తు తెలిసినంత సులభంగా

నదిలోతు కనిపెట్టలేం

వడివడిగా పరుగిడుతుంటే

మన దాహం తీర్చడానికే వస్తుందనుకుంటాం

మనకొక చల్లని ఆటోగ్రాఫ్ చేసేసి 

నవ్వులు చిందించుకుంటూ 

మన ముందునుండే నిండుయవ్వనిలా

నిన్నూ, నన్నూ ముడివేసుకొని

మురిపిస్తూ మురిపిస్తూ 

అలా అలా  అలలా ప్రవహించుకుంటూ 

తన గమ్యాన్ని 

వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోతుందా…

వెళ్ళినట్లు మనకి అనిపిస్తున్నా

మనల్నీ తనతోనే‌ ముడివేసుకుంటుందా!


నది నాదనుకుంటే

నది అందరి ఆనందమంటుంది 

నది ఒక పూలబాలలా 

తన పరిమళాలతో 

మనకి శాశ్వతమైన అనుభూతినిస్తుంది

ఆనందమే అందం

అందం అందరిదీ కావడమే శాశ్వతానందం!

  • ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

9182685231

                       27.6.2023








 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి