12 జులై, 2023

వర్షించెనొక మౌనసంగీతం!

 వర్షించెనొక మౌనసంగీతం!


మౌనానికున్న ఆ భాష నీకు తెలియాలంటే

ఆ ప్రవహించే నదిని చూడు

మౌనానికున్న ఆ భావం నీకు అర్థం కావాలంటే

కరిగి కరిగి హిమశిఖరమే 

నదిగా మారిన ప్రవాహాన్ని చూడు

పరుగుపరుగున వచ్చిన ఆ నదిని 

తనలో కలుకున్నంతనే 

చిన్నపిల్లాడి చేతిలో తియ్యని పదార్థమేదో ఆవిరై

మళ్ళీశిఖరంలా మారిన హిమాలయాన్ని చూడు

నదిలో శిఖరమున్నది

శిఖరంలోనే నది ఉంది

ఈ రెండూ ఒకర్నొకరు వీడకుండానే

విడివిడిగా

ఒకరికొకరు కరిగించుకుంటూ

ఒకరికొకరు మరిగించుకొంటూ

తమలో తామే స్పటికంలా మెరుస్తుంటాయి

నదీ - హిమశిఖరమూ మాత్రమే చూసుకోగల

అద్వైత సౌందర్యచిత్రమది

నదికీ - హిమశిఖరానికీ మాత్రమే 

ఏకాంతంగా వినగలిగే మౌన సంగీతమది!

దార్ల వెంకటేశ్వరరావు, 

9182685231


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి