14 అక్టోబర్, 2006

మాదిగ మానిఫెస్టో -2


సముద్ర లోతుల్లోకెళ్ళాను
మొసళ్ళ విజృంభణల్ని చూశాను
చిలుకపలుకుల్తో
ఉరుకులూ పరుగులూ నేర్పుతున్నట్లే నేర్పుతూ
అందితే స్వజాతినే తినేస్తున్న
అవకాశవాద కొరమేనుల సమూహం పాడిన
సమైక్యతాగీతాలనూ విన్నాను
గుడినీ గోపురాన్నీ
మింగుతున్నప్పటికీ చాలదంటున్న
బకాసుర తిమంగలాల్ని చూసి భయంతో ఉలిక్కిపడ్డాను.
అడవితల్లి కదా అక్కడిపోయి చూస్తే
అధికార రక్తం మరిగిన సింహాలు
జూలుమెలేసి చిత్రవధ చేస్తున్నాయ్
జిత్తులుచేసి ,కుట్రలు పన్నే గుంటనక్కలు
గోతులు తవ్వుతూనే ఉన్నాయ్!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి