14 అక్టోబర్, 2006

మాదిగ మానిఫెస్టో -1

కందిన చరిత్ర గాయం
దండోరా గేయమై మ్రోగుతోంది
శత్రు శిభిరంలో సింహ స్వప్నమవుతోంది
అంటరానితనం లో అంటరానితనం పెంచే
ఇంటర్ సుపీరియారిటీని భరించ లేక
అంతరాంతరాల్లోని అగ్నిపర్వతం పగిలిందిప్పుడే!

ఎన్నాళ్ళనుండో పర్వతాలెక్కి
వీచే తుఫాన్లతోనూ...
ఎర్రని సూర్యుళ్ళతోను...
ఎన్నెన్ని చర్చలు జరిపానో...!
మండిచటమే తప్ప
మా చలిని గుర్తించని సూర్యుళ్ళు !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి