15 అక్టోబర్, 2006

మాదిగ మానిఫెస్టో -3

అన్నా...
నాకు నీ అన్నం పరమాన్నమయ్యింది గాని
నా కూడు చూసేసరికి మాత్రం
ఊరపెట్టే తోళ్ళ కంపు కొట్టింది!
"యాక్... మాదిగోడి అన్నం తినాలా..." అంటూ
వాంతులు చేసుకున్న నీ ప్రేమాభిమానాలను
జాలి కన్నీళ్ళతో ఉడ్చేశాను
అన్నా నువ్వే నాతో కలిసి తినలేవు

నువ్వే నాతో కలిసి జీవించలేవు
"వాళ్ళకి" ఇంటినే చక్కబెట్టుకోని వాళ్ళ నెలా చూడాలో తెలీదా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి